
యువరైతు బలవన్మరణం
విడపనకల్లు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు.. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన రైతు బోయ సుధాకర్(27)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. గత రెండేళ్లుగా మిరప పంట సాగు చేస్తున్నాడు. సరైన దిగుబడి రాకపోవడంతో పాటు దిగుబడి ఉన్న సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో పంట సాగు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడే సుధాకర్.. సోమవారం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.