మీ–సేవా కేంద్రంలో చోరీ
గార్లదిన్నె: స్థానిక మీ సేవా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నెకు చెందిన సోమశేఖరరెడ్డి స్థానిక కెనరా బ్యాంక్ సమీపంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం లావాదేవీలు ముగించుకున్న అనంతరం రాత్రి తాళం వేసి ఇంటికెళ్లిపోయాడు. అర్థరాత్రి సమయంలో దుండగులు మీసేవా కేంద్రం తాళాలు బద్దులుగొట్టి లోపలకు ప్రవేవించి, రూ.1.50 లక్షల నగదు అపహరించారు. బుధవారం ఉదయం కేంద్రం వద్దకు చేరుకున్న సోమశేఖరరెడ్డి చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి దుండగుల వేలి ముద్రలు సేకరించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.


