25న సివిల్స్‌ ప్రిలిమినరీ | - | Sakshi
Sakshi News home page

25న సివిల్స్‌ ప్రిలిమినరీ

May 22 2025 12:26 AM | Updated on May 22 2025 12:26 AM

25న స

25న సివిల్స్‌ ప్రిలిమినరీ

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 25న జరగనుందని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అన్నారు.

చీనీ టన్ను రూ.42 వేలు

అనంతపురం మార్కెట్‌యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.42 వేలు పలికాయి.

గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025

అనంతపురం సిటీ: ‘విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. ఉన్నతాధి కారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పేదల ప్రాణాలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు ధనదాహంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి’ అంటూ జెడ్పీ సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్‌లో ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌, శ్రీసత్యసాయి జిల్లా జేసీ అభిషేక్‌ కుమార్‌, సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, అనంతపురం,మడకశిర, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్‌, ఎంఎస్‌ రాజు, అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. ముందుగా భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధంలో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్‌ సహా ఇతర సైనికుల ఆత్మ శాంతి కోసం మౌనం పాటించారు. ఆ తరువాత సభను చైర్‌పర్సన్‌ గిరిజమ్మ కొనసాగించారు. జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ వేదాంతం నాగరత్నమ్మ సహా అనంతపురం రూరల్‌, బుక్కరాయసముద్రం, విడపనకల్లు, శెట్టూరు జెడ్పీటీసీ సభ్యులు జూటూరు చంద్రకుమార్‌, నీలం భాస్కర్‌, వాసల్లి హనమంతు, మంజునాథ, వజ్రకరూరు ఎంపీపీ రమావత్‌ దేవి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాతో పాటు కడప, కర్నూలు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల వారికి అనువైన అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సరిగా అందుబాటులో ఉండడం లేదన్నారు. కర్నూలు లేదా బెంగళూరుకు రెఫర్‌ చేస్తున్నారని మండిపడ్డారు. వైద్యులు చాలా మంది ప్రభుత్వ సొమ్మును జీతంగా తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారన్నారు.సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు అసమర్థత, నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, కొన్నేళ్లుగా పాతుకుపోయి మామూళ్ల మత్తుకు అలవాటుపడి ఆస్పత్రి పరువు తీస్తున్నారని, వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. వైద్య ఆరోగ్య శాఖమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇటీవల ఓ రోగిని అనంతపురం శివారులోని సవీరా ఆస్పత్రికి తీసుకెళ్లగా స్టంట్‌ వేయాలని, అందుకు రూ. లక్షలు ఖర్చవుతుందంటూ అక్కడి వైద్యులు తెలిపారని, అయితే రోగిని బెంగళూరుకు తరలించి టెస్ట్‌ చేయించగా ఎటువంటి ఆపరేషన్‌ అవసరం లేదని చెప్పారని సభ్యులు పేర్కొన్నారు. అవసరం లేకపోయినా ఆపరేషన్లు, స్టంట్లు వేస్తూ సవీరా యాజమాన్యం రోగులను దోచుకుంటోందని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ, ఆ తరువాత వెళ్లిపోతుండటంతో అత్యవసర కేసులకు దిక్కులేకుండా పోతోందన్నారు. విడపనకల్లు మండలంలో తొమ్మిదేళ్ల బాలిక ప్రమాదానికి గురి కాగా, ప్రాణాపాయ స్థితిలో స్థానిక పీహెచ్‌సీకి తరలిస్తే.. ఒక్కరంటే ఒక్కరూ అందుబాటులో లేరని జెడ్పీటీసీ సభ్యుడు హనుమంతు ఆరోపించారు. బళ్లారికి తరలించేలోపే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ సవీరా ఆస్పత్రిలో జరిగే వ్యవహారాలపై కలెక్టర్‌ దృష్టి పెట్టాలని సూచించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ మాట్లాడుతూ.. సర్వజనాస్పత్రిలో పరిస్థితి గాడిన పడుతోందని, రోజూ 2 వేల నుంచి 2,500 వరకు రోగులు వస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ జోక్యం చేసుకుంటూ పేదల ప్రాణాలతో చెలగాటమాడే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ సర్వజనాస్పత్రితో పాటు పీహెచ్‌సీ, సీహెచ్‌సీలను కూడా రాత్రిళ్లు తనిఖీ చేయాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, డీసీహెచ్‌ఎస్‌, డీఎంహెచ్‌ఓలను ఆదేశించారు. తాను ఇటీవల కొన్ని గిరిజన ప్రాంతాల్లో పర్యటించానని, దయనీయ పరిస్థితి ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు.

‘ఉపాధి’లో భారీగా అక్రమాలు

ఉపాధి హామీ పథకం అమలులో విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయని సభ్యులు ఆరోపించారు. నిధులను ఎవరు మెక్కుతున్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో కోరారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ సలీం బాషాను కలెక్టర్‌ ఆదేశించారు. జెడ్పీలో అతిథి గృహాలు లేక మహిళా జెడ్పీటీసీలు, ఎంపీపీలు అవస్థలు పడుతున్నారని కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు ఆవేదన వ్యక్తం చేయగా.. తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

8లో

న్యూస్‌రీల్‌

ఉమ్మడి జెడ్పీ సమావేశంలో సభ్యుల నిలదీత

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో దయనీయ పరిస్థితులు

అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్యులు, నర్సులు, సిబ్బంది ఇష్టారాజ్యం

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం

ఆరోగ్యశ్రీ బాధితులను హడలెత్తిస్తున్న సైబర్‌ నేరగాళ్లు

చిన్న సమస్యతో సవీరాకు వెళ్లినా ఆపరేషన్లు, స్టంట్లు అంటూ ప్రాణాలతో చెలగాటం

ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందంటూ సభ్యుల ధ్వజం

25న సివిల్స్‌ ప్రిలిమినరీ 
1
1/2

25న సివిల్స్‌ ప్రిలిమినరీ

25న సివిల్స్‌ ప్రిలిమినరీ 
2
2/2

25న సివిల్స్‌ ప్రిలిమినరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement