
అనంతపురం: టీడీపీ అర్బన నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునివ్వగా, అది కాస్తా రసాభాసగా మారింది. ఈరోజు(మంగళవారం) కమ్మ భవన్ లో ఉదయం పది గంటల ప్రాంతంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఓ కార్యకర్త పురుగుల మందు తాగాడు.
టీడీపీకి వైఖరితో మనస్తాపం చెందిన వెంకటేష్ అనే కార్యకర్త వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన వెంకటేష్.. ఆపై పురుగుల మందు తాగేశాడు. దాంతో ఆ కార్యకర్తను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.