
నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలి : ఎస్పీ
అనంతపురం: నేరస్తులకు పక్కాగా శిక్షలు పడాలంటే నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలని సిబ్బందికి ఎస్పీ పి.జగదీష్ సూచించారు. ‘ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్’’పై పోలీసు అధికారులకు సోమవారం సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. నేర స్థలంలో ఆధారాల సేకరణ, వాటి ప్యాకేజింగ్, భద్రతా ప్రమాణాలు, సిరాలజీ, డీఎన్‌ఏ, టాక్సికాలజీ, సైబర్ ఫోరెన్సిక్స్ వంటి విబాగాల్లో నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు నేరస్తులు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని, అలాంటి వారిని సమర్థవంతంగా పట్టుకుని చట్టం ద్వారా శిక్షలు వేయించాలంటే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వివిధ అంశాలపై అనంతపురం ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజా రంగనాథరెడ్డి, ఫోరెన్సిక్ సైంటిఫిక్ ఆఫీసర్ సుధారాణి, సైంటిఫిక్ అసిస్టెంట్లు మురళి, వెంకటేశ్వరరావు తదితరులు అవగాహన కల్పించారు.