
దారుణంగా రైతుల పరిస్థితి
వరి రైతులు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కంటికి రెప్పలా కాపాడిన పంటలపై ప్రకృతి పగ పడుతోంది. ఈ క్రమంలో అరకొరగా చేతికొచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 3,900 మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేస్తే, రైతుల వద్ద మిగిలిపోయిన దాన్ని ఎవరు కొంటారో అధికారులు, పాలకులు సమాధానం చెప్పాలి. మరో 5 వేల మెట్రిక్ టన్నులతో పాటు తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి.
– మెట్టు గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త,రాయదుర్గం