రైతులపై చంద్రబాబు సర్కార్‌కు కాసింతైనా కనికరం లేకుండా ప
బొమ్మనహాళ్ వద్ద వర్షాలకు తడిసిన ధాన్యాన్ని
ట్రాక్టర్‌లో లోడ్ చేస్తున్న దృశ్యం (ఫైల్)
రాయదుర్గం: జిల్లావ్యాప్తంగా గత రబీలో 4,528 హెక్టార్లలో వరి పంట సాగైంది. ఇందులో కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్ మండలాల్లోని హెచ్‌ఎల్‌సీ ఆయకట్టు భూముల్లోనే 3 వేల హెక్టార్లకు పైగా సాగు చేశారు. ఈ క్రమంలో 29,960 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే, పంట కోతకొచ్చే ముందు ఈదురుగాలులు, వడగండ్ల వాన కారణంగా పంట దెబ్బతిని కేవలం 18 వేల మెట్రిక్ టన్నులే దిగుబడి వచ్చింది.
3,900 మెట్రిక్ టన్నులతో సరి..
‘పండించిన ప్రతి ధాన్యం గింజనూ మద్దతు ధరతో కొంటాం. తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటాం’ అంటూ సీఎం చంద్రబాబు పలు సభలు, సమావేశాల్లో ప్రగల్బాలు పలికారు. అయితే ఆయన మాటలకు, క్షేత్రస్థాయిలో చేతలకు పొంతనే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం జిల్లాలో ఏడు చోట్ల ఆర్భాటంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. కేవలం 3,900 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో సరిపెట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో జిల్లాలో రైతుల వద్ద ఇంకా సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండిపోయింది. కొందరు దళారులకు అమ్ముకుంటుండగా.. చాలామంది ప్రభుత్వం ఇంకా సేకరిస్తుందేమోననే ఆశతో కల్లాల్లోనే ధాన్యం రాశులను కుప్పపోశారు.
వరుణుడి భయం..
సాధారణంగా మేలో భానుడు భగభగ మండిపోతాడు. అయితే ప్రకృతి మార్పుల కారణంగా కొన్ని రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కల్లాల్లో ధాన్యం రాశులున్న అన్నదాతలు కలవరపాటుకు గురవుతున్నారు. కణేకల్లు ప్రాంతంలో ఇటీవల వర్షాలకు ధాన్యం తడిసిపోవడం గమనార్హం. ఇంకా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు అధికారులు చెబుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన అధికమవుతోంది. అదనంగా మరో 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా వీలైనంత త్వరగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వరి రైతు ఘోష
3,900 మెట్రిక్ టన్నుల సేకరణతో సరిపెట్టిన కూటమి సర్కార్
మరో 3 వేల టన్నులు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
ఇంకా కల్లాల్లోనే ధాన్యం రాశులు
అన్నదాతలను భయపెడుతున్న వర్షాలు
స్పందించని చంద్రబాబు ప్రభుత్వం
రైతులపై చంద్రబాబు సర్కార్‌కు కాసింతైనా కనికరం లేకుండా ప


