తోపుదుర్తి చందుకు సంబంధం లేదు
మా తాత నుంచి మా నాన్నకు భాగానికి వచ్చిన 3.23 ఎకరాలను తన పేరిట చేయించాలని మా పెద్దనాన్న కుమారుడు, రౌడీ షీటర్ అయిన బండి పరుశురాం బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే సునీత, బాలాజీ అండ చూసుకుని చంపుతానని దౌర్జన్యం చేస్తున్నాడు. గతంలో మాపై దాడులు చేయించడమే కాకుండా ఇంటి స్థలాన్ని కబ్జా చేసి, చేసి జేసీబీతో గుంతలు తవ్వించాడు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం బి.యాలేరు మీదుగావెళుతున్న తోపుదుర్తి చందును ఆపి వివరిస్తుండగా టీడీపీ నేతలతో కలసి పరుశురాం గొడవ చేశాడు. ఎలాంటి సంబంధం లేని తోపుదుర్తి చందుపై అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. – బండి నాగరాజు, బి.యాలేరు


