
ధాన్యం తడిసిపోయింది
నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. రూ.లక్షల పెట్టుబడి పెట్టా. ప్రకృతి విపత్తులను దాటి అరకొరగా చేతికందిన పంటను కల్లంలో కుప్పచేసుకునే లోపే కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ ఆపేశారు. అధికారుల్ని అడిగితే టార్గెట్ పూర్తయిందని చెప్పారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కల్లంలో ధాన్యం తడిసి ముద్దయింది. టార్ఫాలిన్ షీట్లు లేకపోవడంతో మొలకలు కూడా వచ్చాయి. ప్రభుత్వం త్వరగా స్పందించి మరింత ధాన్యం కొనుగోలు చేయాలి.
– ముజంబిల్, కౌలు రైతు, కణేకల్లు