సైనికుల త్యాగాలకు వందనం
‘దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికులకు వందనం.. వారికి బాసటగా నిలుద్దాం’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్యారోగ్య శాఖమంత్రి సత్యకుమార్, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాల ధ్వంసమే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతాన్ని పురస్కరించుకుని శనివారం సైనికులకు సంఘీభావంగా అనంతపురం నగరంలో ‘తిరంగా యాత్ర’ను నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వారు మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి ఎంతంటి త్యాగానికై నా సిద్ధంగా ఉన్నామని మన సైనికులు ప్రపంచదేశాలకు తెలియజేశారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సైనికుడు మురళీ నాయక్ వీరమరణం పొందారని, సైనికులకు అందరం రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, పల్లె సింధూరరెడ్డి, ఎంఎస్‌రాజు, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, అహుడా చైర్మన్ టీసీ వరుణ్, ఆర్‌డీఓ కేశవనాయుడు, సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ఎన్‌జీఓలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
సైనికుల త్యాగాలకు వందనం


