జాతీయస్థాయి ప్రదర్శనలకు ‘అనంత’ ప్రాజెక్టులు
అనంతపురం సిటీ: జాతీయస్థాయిలో అగస్త్య ఇంటర్‌నేషనల్ ఫౌండేషన్ సంస్థ నిర్వహిస్తున్న శాసీ్త్రయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయని డీఈఓ ప్రసాద్‌బాబు మంగళవారం తెలిపారు. ఇందుకు సంబంధించి మూడ్రోజులుగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఎంపికలో మొత్తం 234 ప్రాజెక్టులు ప్రదర్శనకు రాగా.. అందులో మన జిల్లాలోని పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు పావని, ప్రణతి రూపొందించి ప్రదర్శించిన సౌరశక్తి ఆధారిత పిచికారీ యంత్రం మొదటి స్థానంలో నిలిచిందని డీఈఓ వివరించారు. గుత్తి ఆదర్శ పాఠశాలకు చెందిన మౌర్య శ్రీకారి, అంజుమ్ పర్వీన్ తయారు చేసిన ‘వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ ఆన్ ది మూవ్’ ప్రాజెక్టు మూడో స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వంగా ఉందని డీఈఓ పేర్కొన్నారు.
నిబంధనల మేరకే పాఠశాలలకు అనుమతి
ప్రైవేటు పాఠశాలల రెన్యువల్, రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను విద్యాశాఖ అదనపు డైరెక్టర్ పార్వతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆమె డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, విద్యాశాఖ ఇతర అధికారులతో వెబెక్స్ నిర్వహించారు. అనంతపురం నుంచి డీఈఓ ప్రసాద్‌బాబు, ఏడీ–1, 2 మునీర్ ఖాన్, శ్రీనివాసులు, డిప్యూడీ డీఈఓ మల్లారెడ్డి, సూపరింటెండెంట్ జగదీష్, ఏపీఓ మంజునాథ్, ఏఎస్‌ఓ బోయ శ్రీనివాసులు, ఐటీ సెల్ ఇన్‌చార్జ్ చంద్రశేఖర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలన్నీ కచ్చితంగా రెన్యువల్ అయ్యేలా చూడాలన్నారు.
మూడో స్థానం దక్కించుకున్న గుత్తి ఆదర్శ పాఠశాల విద్యార్థినులతో పీజీటీ సాంబశివారెడ్డి
మొదటి స్థానంలో నిలిచిన చీమలవాగుపల్లె విద్యార్థినులతో హెడ్మాస్టర్
జాతీయస్థాయి ప్రదర్శనలకు ‘అనంత’ ప్రాజెక్టులు


