
విత్తనకాయల పంపిణీకి సిద్ధంగా ఉండండి
అనంతపురం అర్బన్: జిల్లాలో వేరుశనగ విత్తనకాయల పంపిణీకి అవసరమైన చర్యలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కిసాన్ డ్రోన్లను పంపిణీ చేయాలని చెప్పారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్–2025కు సంబంధించి 50,592 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. జిల్లాకు 35 డ్రోన్‌లు కేటాయించారన్నారు. 31 మండలాల పరిధిలో గుర్తించిన 26 గ్రూపులకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మిగిలిన గ్రూపులను ఎంపిక చేసి ఈ నెలాఖరులోగా డ్రోన్‌లు పంపిణీ చేయాలన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువకు ఇరువైపులా ఉద్యాన పంటలు సాగయ్యేలా చూడాలన్నారు. కాలువ గట్టుపై టేకు మొక్కల ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటస్వామి, ఉద్యాన శాఖ డీడీ రఘునాథరెడ్డి, ఏడీ ఫిరోజ్‌ఖాన్, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, డీసీఓ అరుణకుమారి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, ఏడీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా
అనంతపురం కార్పొరేషన్: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే వ్యాపారులకు జరిమానా విధిస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం నగరంలోని హౌసింగ్ బోర్డు సెవెన్‌హిల్స్ కాలనీలో ఇంటింటా చెత్త సేకరణను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని ముస్తాఫా అనే వ్యక్తి కలెక్టర్‌కు విన్నవించగా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ బాలస్వామిని ఆయన ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్‌ను వాడకుండా పబ్లిక్ నోటీసును జారీ చేయాలన్నారు. ప్రతి షాపు వద్ద తడి, పొడి చెత్త డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఎస్‌ఈ చంద్రశేఖర్, ఈఈ షాకీర్, ఇన్‌చార్జ్ ఈఈ బీఎల్ నరసింహ తదితరులున్నారు.
రైతు గ్రూపులకు కిసాన్ డ్రోన్లను పంపిణీ చేయండి
కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం