
రూ. లక్షలు.. ‘చెత్త’లో పోసిన పన్నీరు!
రూ. లక్షలు పెట్టి ఈ వాహనాలు కొనుగోలు చేశారు. వాటితో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సి ఉంది. ఎందుకో తెలియదు కానీ.. పంపిణీ మాత్రం చేయలేదు. దీంతో ఇదిగో ఇలా అనంతపురం హౌసింగ్ బోర్డులోని పార్కులో వృథాగా పడి ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లలు వాటిపైకి చేరి ఆడుకుంటుండడంతో దెబ్బతింటున్నాయి. కొన్ని వాహనాల చక్రాలు అప్పుడే ఊడిపోయాయి. ప్రభుత్వ నిధులు వృథా కాకుండా ఇప్పటికై నా మున్సిపాలిటీ అధికారులు వాహనాలను వినియోగంలోకి తెస్తే నగరంలో పరిశుభ్రత మెరుగుపడుతందని ప్రజలు చర్చించుకుంటున్నారు. లేకుంటే రూ. లక్షలు... ‘చెత్త’లో పోసిన పన్నీరు చందంగా మారే పరిస్థితులు లేకపోలేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం