కంబదూరు వైస్ ఎంపీపీగా సోమశేఖర్
కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు వైస్ ఎంపీపీగా ఎనుముల సోమశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం కంబదూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా డీఎల్‌డీఓ నాగేశ్వర రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ బలపరిచిన ఎంపీటీసీ సోమశేఖర్‌ను ఎంపీటీసీలు చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధికారులు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించి వైస్ ఎంపీపీగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. సోమశేఖర్‌కు వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వ య కర్త తలారి రంగయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీలకు సోమశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, సమన్వయకర్త తలారి రంగయ్య, నాయకులు ఉమామహేశ్వర నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, వైస్ ఎంపీపీ తిమ్మరెడ్డి, ఎంపీటీసీలు ఈరన్న, నాగలక్ష్మి, మాధవి, సరస్వతి, నాగరత్నమ్మ, విద్యావతి, శ్రీదేవి, లక్ష్మి, నరసక్క, శివమ్మ, పలు మండలాల పార్టీ కన్వీనర్లు హనుమంత రాయుడు, వెంకటప్ప, పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, గోళ్ల సూరి తదితరులు పాల్గొన్నారు.


