
వేధింపుల కేసు నమోదు
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ ప్రయాణికురాలి వద్ద ఉన్న బంగారు నగలను దుండగులు అపహరించారు. వివరాలు... కర్నూలుకు చెందిన సుభాన్‌బీ సోమవారం గుంతకల్లులో జరిగిన బంధువుల ఇంట శుభ కార్యానికి వెళ్లారు. మంగళవారం ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. బస్సు గుత్తి బస్టాండ్‌కు చేరుకోగానే కాసేపు ఆగింది. కాసేపటి తర్వాత తన వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించుకున్న ఆమె... అందులో ఉంచిన ఆరు తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో అపహరణకు గురైనట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ ఎస్‌ఐపై వేటు
● సరెండర్ చేస్తూ డీఐజీ ఉత్తర్వుల జారీ
అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎం. ప్రదీప్‌కుమార్‌పై వేటు పడింది. అతన్ని సరెండర్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఉమ్మడి జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రదీప్‌కుమార్ ఉన్నతాధికారుల అండ చూసుకుని లాబీయింగ్ చేసేవారని, డీఎస్పీ, సీఐలను సైతం లెక్క చేయకుండా వ్యవహరించే వారని సమాచారం. దీంతో పాటు రాజకీయ అండతో పంచాయితీలు, పైరవీలు చేస్తుండటంపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన అనంతపురం రేంజ్ డీఐజీ.. ప్రదీప్‌కుమార్‌ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.