
రాజకీయ దృష్టితో జరిగిన దాడే
సాక్షి ఎడిటర్ ఇంటిపై జరిగిన పోలీసు దాడి కేవలం రాజకీయ దృష్టితో జరిగిన దాడిగానే కనిపిస్తోంది. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి. దీనిని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలి. పోలీసులు చట్టాన్ని అతిక్రమించి, పత్రికలను టార్గెట్ చేయడం అనుమతించరాదు. చూసీచూడనట్టు పోతే అది సమాజానికి నష్టదాయకమవుతుంది. సాక్షి ఎడిటర్ విషయంలో చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ గేయానంద్,
మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు