కళ్లకు కట్టారు.. అవగాహన పెంచారు
నంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో బుధవారం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. విపత్తులు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా వ్యవహరించాలనే విషయాలను అగ్నిమాపక సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. బాంబులు పేలిన సమయంలో హెచ్చరిక సైరన్ మోగించడం నుంచి క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చడం, సీపీఆర్ చేయడం తదితర విషయాలను క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టం గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అనంతరం పిల్లలు, యువతకు క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాస రెడ్డి, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి, తహసీల్దార్ హరిప్రసాద్ పాల్గొన్నారు. – అనంతపురం
అ
కళ్లకు కట్టారు.. అవగాహన పెంచారు
కళ్లకు కట్టారు.. అవగాహన పెంచారు


