
చర్యలు తీసుకోవాలి
అడ్మిషన్ల పేరుతో ప్రైవేటు ఉపాధ్యాయుల్ని యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వేసవి సెలవుల్లోనే అడ్మిషన్లు మొదలు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఇటీవల రాయదుర్గంలోని నారాయణ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించాం. విద్యాశాఖ అధికారులు పరిశీలించి కట్టడి చేయాలి. ముందస్తు పాఠ్య, నోట్ పుస్తకాలు, షూ, బెల్టు లాంటి విక్రయాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి.
– ఆంజనేయులు, ఏఐఎస్‌ఎఫ్
జిల్లా కోశాధికారి, రాయదుర్గం.
అడ్మిషన్ల పేరుతో వేధిస్తే చర్యలు
అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను , టీచర్లను వేధింపులకు గురిచేస్తే ప్రైవేటు పాఠశాలల యజమానులపై కఠిన చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే అడ్మిషన్లు చేపట్టాలి. దీనికి విరుద్దంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వ బడుల్లో చేరేలా అవగాహన కల్పిస్తున్నాం.
– ప్రసాద్‌బాబు, డీఈఓ, అనంతపురం