
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో సీఐ, అటెండర్ మధ్య పంచాయితీ చర్చనీయాంశంగా మారింది. కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సీఐ హసీనా భాను.. అటెండర్‌ను చెప్పుతో కొట్టిన ఘటన వివాదంగా మారింది. రెండు క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
వివరాల ప్రకారం.. కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను, అటెండర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అటెండర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఐ హసీనా భాను. ఈ విషయమై తనకేమీ తెలియదని సదరు అటెండర్.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి.. ఆగ్రహానికి లోనైన సీఐ హసీనా భాను.. అటెండర్‌ను చెప్పుతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
