యోగాంధ్రపై చైతన్యం తీసుకువస్తాం | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్రపై చైతన్యం తీసుకువస్తాం

May 20 2025 1:16 AM | Updated on May 20 2025 1:16 AM

యోగాం

యోగాంధ్రపై చైతన్యం తీసుకువస్తాం

సీఎస్‌కు తెలిపిన కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

అనంతపురం అర్బన్‌: యోగాంధ్ర–2025 క్యాంపెయిన్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. యోగాంధ్ర, తదితర అంశాలపై సీఎస్‌ సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, డీఆర్‌ఓ ఎ.మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో యోగాంధ్ర–2025 నిర్వహణలో భాగంగా తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వర ఆలయం, గుత్తి కోట వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో నగర పాలక కమిషనర్‌ బాలస్వామి, డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, కలెక్టరేట్‌ ఏఓ అలెగ్జాండర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో

యువకుడి మృతి

కళ్యాణదుర్గం రూరల్‌: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరులోని కోట వీధిలో నివాసముంటున్న రామాంజినమ్మ, మల్లేశప్ప దంపతలకు ఇద్దరు కుమార్తులు, కుమారుడు శ్యామ్‌ (24) ఉన్నారు. బేల్దారి పనులతో శ్యామ్‌ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. సోమవారం రోజులాగే కంబదూరులో గృహ నిర్మాణ పనుల్లో పాల్గొన్న శ్యామ్‌... ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తగలడంతో షాక్‌కు గురై భవనం పైనుంచి కిందపడ్డాడు. గమనించిన స్తానికులు వెంటనే కంబదూరులోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కంబదూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పాపంపేటలో

మహిళ ఆత్మహత్య

రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటకు చెందిన లక్ష్మీదేవి (45) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త కుళ్లాయప్ప గతంలోనే చనిపోయాడు. కుమారుడు రామాంజనేయులు ఆటోమొబైల్స్‌లో పని చేస్తున్నాడు. కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీదేవి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎకై ్సజ్‌ ఇన్‌చార్జ్‌ సీఐగా

గురుప్రసాద్‌

కళ్యాణదుర్గం రూరల్‌: స్థానిక ఎకై ్సజ్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌గా గురుప్రసాద్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ హసీనాభాను అవినీతి ఆరోపణలపై బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో విడపనకల్లు చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న గురుప్రసాద్‌కు ఉన్నతాధికారులు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలిసింది.

నాటుసారా నిర్మూలనపై

ప్రత్యేక దృష్టి

చెన్నేకొత్తపల్లి: గ్రామాల్లో నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య ఎకై ్సజ్‌ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. గతంలో గ్రామాల్లో నాటుసారాను తయారు చేసే పాత నేరస్తులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా, విక్రయంపై నిఘా పెట్టాలని సూచించారు. బెల్టుషాపులు లేకుండా చూడాలన్నారు. లైసెన్స్‌ మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువ విక్రయిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ ఫరూక్‌ ఆజామ్‌, ఎస్‌ఐ శివప్రసాద్‌ సిబ్బంది పాల్గొన్నారు.

యోగాంధ్రపై చైతన్యం తీసుకువస్తాం 1
1/1

యోగాంధ్రపై చైతన్యం తీసుకువస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement