
మద్యం అతిగా సేవించి వ్యక్తి మృతి
తాడిపత్రి: మద్యం అతిగా సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన తాడిపత్రి రూరల్ పరిధిలోని జగనన్న కాలనీలో జరిగింది. సీఐ శివ గంగాధర రెడ్డి తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణం నంద్యాల రోడ్డుకు చెందిన జయ చంద్రారెడ్డి (45) శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం జగనన్న కాలనీలోని ఓ ఇంటి ముందు మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్న జయచంద్రారెడ్డిని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య అమరావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.