ఉన్నట్లుండి ముంచుకొచ్చింది. ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉరిమి ఉరిమి గడగడలాడించింది. పంటలకు నష్టం కలిగించింది. జీవాలను బలితీసుకుంది. భారీ వృక్షాలను సైతం నేలకూల్చింది. జిల్లాలో పలు చోట్ల వాన బీభత్సం సృష్టించింది. వరదతో ముంచెత్తింది. వర్షానికి తోడుగా మెరుపులు | - | Sakshi
Sakshi News home page

ఉన్నట్లుండి ముంచుకొచ్చింది. ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉరిమి ఉరిమి గడగడలాడించింది. పంటలకు నష్టం కలిగించింది. జీవాలను బలితీసుకుంది. భారీ వృక్షాలను సైతం నేలకూల్చింది. జిల్లాలో పలు చోట్ల వాన బీభత్సం సృష్టించింది. వరదతో ముంచెత్తింది. వర్షానికి తోడుగా మెరుపులు

May 16 2025 12:39 AM | Updated on May 16 2025 12:39 AM

ఉన్నట

ఉన్నట్లుండి ముంచుకొచ్చింది. ఒక్కసారిగా విరుచుకుపడింది.

రాప్తాడురూరల్‌/అనంతపురం అగ్రికల్చర్‌: రాప్తాడు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. 27 మండలాల పరిధిలో 16.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. రాప్తాడులో రికార్డు స్థాయిలో 141.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే, కళ్యాణదుర్గం 53.2 మి.మీ, ఆత్మకూరు 38, బ్రహ్మసముద్రం 35, బుక్కరాయసముద్రం 34.2, శెట్టూరు 27.6, పామిడి 26.4, నార్పల 25.6, అనంతపురం మండలంలో 24.6 మి.మీ వర్షం కురిసింది. కణేకల్లు, బొమ్మనహాళ్‌, విడపనకల్లు, ఉరవకొండ మినహా మిగతా మండలాల్లో మోస్తరుగా వాన పడింది.

వణికిన రాప్తాడు..

రాప్తాడు మండలాన్ని వరుణుడు బెంబేలెత్తించాడు. మండలంలోని సీపీఐ కాలనీని వాన నీరు ముంచెత్తాయి. పలువురు స్థానికులు ఇళ్లపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను గురువారం ఉదయం అగ్ని మాపక సిబ్బంది తాళ్లు, ట్యూబుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

● అనంతపురం రూరల్‌ పరిధి కక్కలపల్లి పంచాయతీలోని బీజేపీ కొట్టాలు, ప్రజాశక్తినగర్‌, ఆర్డీటీ కాలనీల్లో దాదాపు 90 ఇళ్లల్లోకి నీరు చేరాయి. గురువారం తెల్లవారుజాము 4 గంటల నుంచి ఒక్కసారిగా ఇళ్లలోకి నీళ్లు చేరడం ప్రారంభించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బతుకు జీవుడా అంటూ పిల్లాపాపలతో బయటకు పరుగులు తీశారు. వాన నీరు ఇంట్లో చేరడంతో నారాయణ ఇంట్లో దాదాపు 20 ప్యాకెట్ల బియ్యం, కందిబేడలు తడిసిపోయాయి. నరసింహులు, నాయక్‌లు వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న ఎండు కర్జూరం, 2 టన్నుల మామిడిపండ్లు పూర్తిగా తడిసిపోయాయి. ఎంపీడీఓ దివాకర్‌, ఈఓఆర్డీ వెంకటనాయుడు కాలనీల్లో పర్యటించారు. బాధితుల వివరాలను సేకరించారు.

● బీజేపీ కాలనీ పక్కన నెట్టెం ఆనంద్‌నాయుడు అనే వ్యక్తి వంకను ఆక్రమించి వెంచర్‌ ఏర్పాటు చేయడంతో వర్షం నీరు ఇళ్లలోకి చేరిందని స్థానికులు వాపోయారు. డ్రైనేజీని ఆక్రమించడంతో దుస్థితి నెలకొందని చెబుతున్నారు.

● కాటిగానికాలువకు చెందిన రైతు రామచంద్ర తన ఎకరా భూమిలో సాగు చేసిన బీరపంట మొత్తం నీటిలో మునిగిపోయింది. రామినేపల్లి గ్రామంలో రాగే లక్ష్మీనారాయణ అనే రైతు 1.80 ఎకరాల్లో 2 నెలల క్రితం సాగు చేసిన 2 వేల అరటి మొక్కలు కొట్టుకుపోయాయి. ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్మించిన చెక్‌డ్యాంకు రామయ్య అనే వ్యక్తి రంధ్రం వేశాడని, దీంతో నీరు తన పొలంలోకి చేరి పంట మొత్తం దెబ్బతిందని రామచంద్ర వాపోయాడు. మరో 15 రోజుల్లో కోత పెట్టాల్సిన సమయంలో ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

● వాన నీటితో పంగల్‌రోడ్డు సమీపంలోని శిల్పా లేపాక్షి నగర్‌లో పలు ఇళ్లు నీట మునిగాయి. ఆక్రమణల కారణంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు పేర్కొన్నారు.

పంటలకు తీవ్ర నష్టం..

వర్షం ధాటికి జిల్లాలో పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనంతపురం, కళ్యాణదుర్గం మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడా కరెంటు స్తంభా లు, వృక్షాలు నేలకూలాయి. కక్కలపల్లి సబ్‌స్టేషన్‌లోకి నీళ్లు చేరడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ వర్షాలు ఖరీఫ్‌ పంటల సాగుకు వీలుగా భూములు దుక్కులు చేసుకునేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లో వాన రాప్తాడులో కుండపోత

రికార్డు స్థాయిలో 141.2 మి.మీ వర్షపాతం

కాలనీలు జలమయం.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

పలు చోట్ల పంటలకు నష్టం జీవాల మృత్యువాత

ఉన్నట్లుండి ముంచుకొచ్చింది. ఒక్కసారిగా విరుచుకుపడింది. 1
1/1

ఉన్నట్లుండి ముంచుకొచ్చింది. ఒక్కసారిగా విరుచుకుపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement