
దేవుని ప్రతిరూపం అమ్మ
మాటలకు అందనిది అమ్మ. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. అంతే కాదు దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు. మనకు జన్మనిచ్చి మనకోసం ఎంతో తాపత్రయపడిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. వారిని బాగా చూసుకుంటేనే మన జన్మకు సార్థకత. మాది కంబదూరు మండలం కొత్తపల్లి గ్రామం. అమ్మ పి.తులసీబాయి, నాన్న పి.అర్జున్ నాయక్. నేను ఒక్కడే కొడుకును. ఒక అక్క ఉంది. నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. మా నాన్న పోస్టుమాస్టర్‌గా పనిచేశారు. కొన్ని రోజులు అమ్మ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేశారు. నేను జీవితంలో స్థిరపడడానికి అమ్మ అండదండలే కారణం. ప్రతి దశలోనూ అమ్మ ప్రోత్సాహం ఉంది.
– ప్రొఫెసర్ కేబీ చంద్రశేఖర్, మాజీ వీసీ, కృష్ణా యూనివర్సిటీ.