
సాక్షి, పుట్టపర్తి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకాశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు తిరుగు పయనం అవుతారు.
జయప్రదం చేద్దాం
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనను జయప్రదం చేద్దామని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కొడికొండ చెక్‌పోస్టుకు వైఎస్ జగన్ చేరుకుంటారని, పార్టీ శ్రేణులు ఆ సమయానికంతా కొడికొండ చెక్‌పోస్టు వద్దకు చేరుకోవాలని ‘అనంత’ కోరారు.