
మృతుడి కుటుంబసభ్యులకు పరామర్శ
కళ్యాణదుర్గం రూరల్: కుందుర్పి సమీపంలో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన కరిగానపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రాజు కుటుంబసభ్యులను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య శుక్రవారం పరామర్శించారు. కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీలో ఉన్న రాజు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చా రు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, మండల కన్వీనర్లు హనుమంతురాయుడు, గోళ్ల సూరి, మండల మాజీ కన్వీనర్ సత్యనారాయణశాస్త్రి, సర్పంచ్ విజయ్, నాయకులు షెక్షావలి, లింగప్ప, తిప్పేస్వామి, రామిరెడ్డి, తదితరులు ఉన్నారు.
‘ఎన్‌ఐసీ’కి ప్రభుత్వ డిగ్రీ
కళాశాల విద్యార్థి
గుంతకల్లు టౌన్: కర్ణాటకలోని బెల్గాంలో ఉన్న రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకూ జరిగే నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (ఎన్‌ఐసీ)కు గుంతకల్లులోని ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ (స్వయం ప్రతిపత్తి) కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థి గాదిలింగ ఎంపికయ్యాడు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదరు విద్యార్థిని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపల్ రవిశంకర్ శర్మ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నారాయణ అభినందించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడిపత్రి టౌన్: స్థానిక రజక కల్యాణ మంటపం సమీపంలో శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి (58) మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పట్టణంలో భిక్షాటనతో జీవించేవాడై ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మృతుడి కుటుంబసభ్యులకు పరామర్శ