
కమనీయం.. శ్రీవారి కల్యాణం
ఉరవకొండ రూరల్: ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. జిల్లా నలమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ప్రధాన అర్చకుడు ద్వారకనాథచార్యులు, ఈఓ సాకే రమేష్‌బాబు అధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి ఉత్సవ మూర్తులకు కల్యాణం జరిపించారు. అంతకు ముందు దేవేరులతో కలసి గరుడ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనిమిచ్చారు.