ఐదురోజులు వర్షసూచన
ముందస్తు నైరుతి నేపథ్యంలో రానున్న ఐదు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లాలో కొన్ని ప్రాంతాలకు భారీ వర్షసూచన తెలియజేస్తూ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించినట్లు పేర్కొన్నారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులకు సంబంధించి వచ్చే రెండు రోజులు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించినట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే సూచన ఉన్నట్లు తెలిపారు.


