
●తల్లి ప్రోత్సాహంతోనే ఉన్నతస్థానాలకు చేరిన బిడ్డలు ●సంద
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మేము నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉండేవాళ్లం. అమ్మ వెంకట సుబ్బమ్మ, నాన్న వేణుగోపాలరావు. ఆరో తరగతికి కొడిగెనహళ్లిలో అడ్మిషన్ పొందాను. అప్పటి వరకు అమ్మతోనే ఉండేవాడిని. ఆళ్లగడ్డ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పొలం ఉండేది. ఆళ్లగడ్డ నుంచి నిత్యం పొలం పనులకు వెళ్తూ.. ఎంతో కష్టపడేవారు అమ్మ. మేము నలుగురు అబ్బాయిలం. వారిలో నేను పెద్దవాడిని. ముగ్గురు అమ్మాయిలు. నేను బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండగా నాన్న కాలం చేశారు. అప్పటి నుంచి మా కోసం అమ్మ ఎంతో కష్టపడ్డారు. జేన్‌టీయూ అనంతపురం వీసీ స్థాయికి ఎదగడానికి అమ్మ కృషి ఎంతో ఉంది. ప్రస్తుతం అమ్మకు 82 సంవత్సరాలు. అమ్మ అండదండలతోనే ఉన్నతస్థాయికి చేరాను.
– ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు,
వీసీ, జేఎన్‌టీయూ అనంతపురం
అనంతపురం /అనంతపురం కల్చరల్: కల్మషం లేనిది అమ్మ ప్రేమ. అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ పేరు. నవమాసాలు మోసి బిడ్డలను కళ్లలో పెట్టుకుని చూసుకునే తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. మాతృభావన అక్షరాలలో చెప్పలేని, భావాలలో వ్యక్తీకరించలేని తీయని అనుభూతి. ఎంతమంది పిల్లలున్నా కంటికి రెప్పలా కాపాడుకుని ఉన్నత స్థానాలకు చేర్చిన తల్లిదండ్రులు వృద్ధులైపోతే భారంగా భావిస్తున్న రోజులివి. కర్కశ స్వభావమున్న బిడ్డలు తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. అలా పేగు పాశం కోసం తల్లడిల్లే ఎందరో అమ్మలు జిల్లా కేంద్రం అనంతపురంలోని ఆశ్రమాలలో పిల్లల పిలుపు కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తల్లినే దైవంగా భావించి ఆరాధిస్తూ ఉన్నత స్థానాలను చేరుకున్న వారూ మరెంతోమంది ఉన్నారు. స్వచ్ఛమైన అమ్మ ప్రేమను తెలియజేయడానికి చరిత్రలో ఓ రోజును కేటాయించింది. మే నెలలో రెండవ ఆదివారాన్ని ‘అంతర్జాతీయ మాతృదినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆదివారం పలుచోట్ల మాతృదినోత్సవ వేడుకలు జరగనున్నాయి. తల్లులందించిన ప్రేమను చాటుకున్న ప్రముఖులు, అధికారుల అనుభవాలతో మదర్స్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.
అమ్మ స్ఫూర్తితోనే ఉన్నత స్థాయికి

●తల్లి ప్రోత్సాహంతోనే ఉన్నతస్థానాలకు చేరిన బిడ్డలు ●సంద