
వాహనాలు క్లియర్ చేయండి : ఎకై ్సజ్ డీసీ
హిందూపురం టౌన్: మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలు త్వరగా క్లియర్ చేయాలని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్‌తో కలసి హిందూపురం ఎకై ్సజ్ పోలీసుస్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్లు దుకాణల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించాలని, కల్తీ కల్లు అరికట్టేలా అమ్మకందారుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఎక్కువ కేసులు నమోదైన వారిని వారిని జిల్లా బహిష్కరణకు సిఫార్సు చేయాలన్నారు.