
కనుల పండువగా రథోత్సవం
విడపనకల్లు: మండలంలోని పాల్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఉండబండ వీరభద్రస్వామి రథోత్సవం బుధవారం కనుల పండువగా సాగింది. మండలంలోని ఉండబండ, పాల్తూరు, చీకలగురికి, విడపనకల్లు, కరకముక్కల, గాజుల మల్లాపురం, ఉరవకొండ, కర్ణాటకలోని బళ్లారి, గదగ్, చిక్‌మంగుళూర్, శివమొగ్గ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఉదయం ఆలయంలో వీరభద్రస్వామి, కాళికాదేవి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం వేలాది భక్తుల గోవింద నామస్మరణ మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు.