
అమ్మాయిలకు చదువు ముఖ్యం
మాది అనంతపురం మండలం ఉప్పరపల్లి. నాన్న రాముడు రైతు. అమ్మ నారాయణమ్మ. ఆడ, మగ ఇద్దరూ సమానమేనని ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు చాలా అవసరం అని అమ్మ గట్టిగా నమ్మింది. అలా చదివించడం వల్లే నేను ఎంపీడీఓ స్థాయికి చేరాను. సోదరి డాక్టర్ ఉజ్జినేశ్వరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. తమ్ముళ్లు నరేష్, విష్ణువర్ధన్ ఆపరేటర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇలా అందరూ మంచి స్థానాల్లో స్థిరపడడానికి అమ్మ ప్రోత్సాహం, అందించిన సహకారమే కారణం. ఆడపిల్లలైనా ఇంటి పని చెప్పకుండా చదవాలంటూ పదే పదే చెప్పేది. అందరు తల్లులూ ఇలాగే ఆలోచిస్తే ఎంత బాగుంటుందో..
– విజయలక్ష్మి, ఎంపీడీఓ, రాప్తాడు