మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం
సాక్షి, పుట్టపర్తి: పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ముడావత్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 13న గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లి తండాకు చేరుకుంటారు. వీరజవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్‌ను పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.
నేడు గార్లదిన్నెలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్/గార్లదిన్నె: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం గార్లదిన్నెలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. తహసీల్దారు కార్యాలయం పక్కన ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలని సూచించారు.

రేపు కల్లితండాకు వైఎస్ జగన్