
● అ‘పూర్వ’ం.. ఆత్మీయం
రాయదుర్గం టౌన్: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఇంటర్ కళాశాలలో 1980–83 విద్యాసంవత్సంలో కలసి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. అప్పట్లో 200 మంది కలసి చదువుకోగా, వీరిలో వంద మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు. మనసారా పలకరించుకున్నారు. అప్పటి అధ్యాపకులు ఎవరూ లేకపోవడం కాస్త నిరాశ మిగిల్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత బేలోడు పాఠశాల హెచ్‌ఎం నాగరాజు, శివానంద, రామదాసు, వెంకటేశులు, శేషప్రభ, కేకేటీ మోహన్, బండి చిన్న, లాయర్ బాబు, ఎర్రిస్వామి తదితరులు నేతృత్వం వహించారు.