
ప్రభుత్వ ధోరణిని ఖండిస్తున్నాం
సాక్షి సంపాదకులు ధనుంజయరెడ్డి ఇంటిపై ఇటీవల పోలీసులు జరిపిన చట్ట విరుద్ధమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సెర్చ్ వారెంటు లేకుండా, అనుమతి లేకుండా ప్రవేశించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం దారుణం. ఈ తరహా చర్యలు మౌలిక హక్కులను హరించడమే కాక, నిష్పక్షపాతంగా వార్తలు అందించే ప్రయత్నాలను అణచివేసే కుట్రలో భాగమేనని భావించాల్సి వస్తుంది. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలి. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలి.
– రామ్‌కుమార్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్) జిల్లా అధ్యక్షుడు