ఢిల్లీ అతలాకుతలం.. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ | Heavy Rain Fall In Delhi And Telangana, IMD Issued Yellow Alert To All Districts, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అతలాకుతలం.. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

May 22 2025 8:11 AM | Updated on May 22 2025 12:09 PM

Heavy Rain Fall In Delhi And Telangana

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: మండు వేసవిలో దేశవ్యాప్తంగా అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వ‍ర్షాకాలం నాటి పరిస్థితులు వేసవిలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఢిల్లీలో బలమైన గాలులు, వడగళ్ల వానతో నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అటు.. చెట్లు కూలడంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ఏరియాల్లో మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. ఇటు తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

ఢిల్లీలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటకు 70కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో ఏకంగా గంటకు 80 కిలీమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. లోదీ రోడ్‌లో వడగళ్ల వాన పడింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశముందని ముందుగానే ప్రకటించాయి.

ఇదిలా ఉండగా.. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు 39 మేకలు చనిపోయాయి. ఇక వీటితో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

హైదరాబాద్‌లో వాన బీభత్సం
హైదరాబాద్‌లో వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని నదులను తలపించాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని అన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్‌ విధించింది వాతావరణ శాఖ. బంగ్లగూడ, సైదాబాద్‌, మలక్‌పేట్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement