
హంద్రీ–నీవాపై చర్చకు రా..
● రాయదుర్గం ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సవాల్
ఉరవకొండ: హంద్రీ–నీవా అభివృద్ది పనులపై ముందుగా ప్రకటించినట్లుగానే నేడు (బుధవారం) బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నానని, దమ్ముంటే చర్చ కోసం ఉరవకొండకు రావాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. హంద్రీ–నీవా కోసం ఏ ప్రభుత్వం ఎంత మేర ఖర్చు చేసిందో, ఎంత మేర పనులు పూర్తి చేసిందో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఉరవకొండ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న హంద్రీ–నీవా శిలాఫలకాల వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు చర్చకు సిద్ధం కావాలన్నారు. ఎమ్మెల్యే కాలవ రాక కోసం తాను అక్కడే వేచి ఉంటానన్నారు.