
అక్లాండ్‌లో వైఎస్సార్‌సీపీకి అపూర్వ ఆదరణ
అనంతపురం కార్పొరేషన్: న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో వైఎస్సార్‌సీపీకి అపూర్వ ఆదరణ లభించింది. పార్టీ కార్యకలాపాల్లో ప్రవాసాంధ్రులను మమేకం చేసేలా వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి గురువారం అక్లాండ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్సార్‌సీపీ న్యూజిలాండ్ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరు, కో కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, సమంత్ డేగపూడి, తదితర ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం అక్లాండ్‌లోని గ్లోబల్ కనెక్ట్ మీటింగ్‌లో ఆలూరు సాంబశివారెడ్డి ప్రసంగించనున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. భవిష్యత్తులో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎన్‌ఆర్‌ఐలు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చాటిన ఉమ్మడి జిల్లాలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు నక్కారామారావు ఎడ్యుకేషనల్, కల్చరల్ ట్రస్ట్ బోర్డు, యాదవ సంఘం, యాదవ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు జి.నాగభూషణం, జి.శ్రీనివాసులు, రామకృష్ణ, ఎం.శ్రీరాములు, ఉమాశంకర్, హేమంత్, లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతిలో 400పైబడి మార్కులు, ఇంటర్‌లో 700పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. జూన్ 1న పురస్కారాలు అందజేయనున్నారు. పూర్తి వివరాలకు 83094 75846, 94922 87710లో సంప్రదించవచ్చు.