
బీపీఈడీ ఫలితాల విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీపీఈడీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య బి.అనిత బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 73.77 శాతం, మూడో సెమిస్టర్‌లో 82.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్‌లో చూడవచ్చు. అలాగే బీఎస్సీ, బీకాం, బీసీఏ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ దరఖాస్తుకు ఈ నెల 30 చివరి తేదీగా నిర్దేశించినట్లు అనిత పేర్కొన్నారు. కార్యక్రమంలో రెక్టార్ జి.వెంకటనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ ఈ.రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి.లోకేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.