
బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమాలో ఓ ఆసక్తికర సీను
రాచానపల్లి సమీపంలో ఇటీవల రిపేరీ చేయించిన
బోరులో వస్తోంది ఆయిల్ కాదు నీరే..
వ్యర్థాలు భూమిలోకి వదులుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీ
● చుట్టు పక్కల ప్రాంతాల్లో
కలుషితమవుతున్న భూగర్భజలాలు
● ఇటీవల రాచానపల్లి పంచాయతీ బోరులో నల్లటి ద్రావకం
● పొగ, దుర్వాసన కూడా వెదజల్లుతున్న వైనం
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ పరిధి బళ్లారి రోడ్డు సమీపంలో ఉన్న ఔషధాల తయారీ సిఫ్లాన్ డ్రగ్స్ ఫ్యాక్టరీ వ్యర్థాలు తీవ్ర ప్రమాదకరంగా మారాయి. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను రివర్స్ బోరింగ్ ద్వారా భూమిలోకి వదులుతుండటంతో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. ఫ్యాక్టరీకి చుట్టుపక్కల 6–7 కిలోమీటర్ల వరకు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సిఫ్లాన్ ఫ్యాక్టరీకి దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరంలోని చెక్ డ్యాంలో ఉన్న రాచానపల్లి పంచాయతీ బోరు ఇటీవల చెడిపోగా.. రిపేరీ చేయించారు. మోటారు ఆన్ చేయగానే నల్లటి ద్రవం బోరులో నుంచి ఎగజిమ్మింది. రెండు ఇంచుల పైపులో దాదాపు రెండు గంటల పాటు ఇదే పరిస్థితి. ఈ బోరు 250 అడుగుల లోతు ఉంది. దీన్ని బట్టి రసాయన వ్యర్థాల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తీవ్ర అవస్థలు..
‘సిఫ్లాన్’ భూతం కారణంగా రాచానపల్లి, కొడిమి పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాచానపల్లి పంచాయతీలో కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరు కలుషితమై వస్తోందని మహిళలు వాపోతున్నారు. తాగేందుకు ఏమాత్రమూ ఉపయోగపడడం లేదని, దుస్తులు ఉతకడానికి కూడా వినియోగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పంట భూముల్లోనూ డ్రగ్స్ వ్యర్థాల అవశేషాల ప్రభావం పడిందంటున్నారు. దీనికితోడు పొగ, దుర్వాసన వెదజల్లుతుండడంతో అవస్థలు పడుతున్నామంటున్నారు.

బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమాలో ఓ ఆసక్తికర సీను

బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమాలో ఓ ఆసక్తికర సీను