
యువ పరిశోధకుడిగా ప్రారంభమైన ‘చావా’ ప్రస్థానం
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. వేసవితాపం అధికంగా కొనసాగుతోంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
ప్రతి స్నాతకోత్సవానికి విశిష్ట వ్యక్తులను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించడం జేఎన్‌టీయూ(ఏ) ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో 14వ స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్‌ను వర్సిటీ చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావాకు అందజేయనున్నారు. ర్యాన్‌బ్యాక్సీలో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ చావా విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్సిక్స్‌లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఎదిగారు. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005) (హైదరాబాద్)తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి దిశాదర్శకులయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ను 2021లో సాక్షి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఘనంగా సత్కరించింది. 18 సంవత్సరాల క్రితం ఏర్పాటైన లారస్ ల్యాబ్స్ కంపెనీలో ఇప్పటి వరకూ 150 కొత్త మందులు కనిపెట్టారు. 150 పేటెంట్లు దక్కాయి. రెస్పెక్ట్.. రివార్డు..రీటైయిన్ అనే మూడు ప్రాధాన్యత అంశాలుగా ల్యాబ్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.