‘సకల శాఖలకు మంత్రి లోకేష్‌.. అందుకే పవన్‌కు మోదీ చాక్లెట్‌’ | YSRCP Shyamala Satirical Comments On Nara Lokesh And Pawan Kalyan, More Details Inside | Sakshi
Sakshi News home page

‘సకల శాఖలకు మంత్రి లోకేష్‌.. అందుకే పవన్‌కు మోదీ చాక్లెట్‌’

May 17 2025 12:15 PM | Updated on May 17 2025 12:46 PM

 ysrcp shyamala Satirical Comments On Nara Lokesh And Pawan

సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. రాష్ట్రంలో సకల శాఖల మంత్రిగా నారా లోకేష్‌ కొనసాగుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్షాలు.. అబద్ధపు స్టేట్‌మెంట్స్‌తో ఈ అరెస్ట్ జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉంది. సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. వైఎస్సార్‌సీపీ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు.  

వైఎస్ జగన్ పాలనలో 22వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు. ఏపీలో నారా లోకేష్ సకల శాఖ మంత్రి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు?. ప్రభుత్వ వసతి గృహంలో అమ్మాయిలను ఎలుకలు కొరికినా స్పందించలేదు. రెండు రోజుల అనంత పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం.

రాష్ట్రంలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. డిప్యూటీ సీఎం పదవి వచ్చాక అదృశ్యమైన మహిళల వ్యవహారంపై పవన్ ఎందుకు మాట్లాడరు. పవన్ కళ్యాణ్.. పిఠాపురం పీఠాధిపతి. అందుకే ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్‌ చాక్లెట్ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement