అనంతపురం: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ స్మారకార్థం ఈ నెల 26 నుంచి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఉమ్మడి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, అనంతపురం నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడా జట్లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 80085 50464, 79893 69100, 73969 27271, 98855 31051, 94407 58953లో సంప్రదించాలని కోరారు.
ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి
● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి
తాడిపత్రి టౌన్: ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఎస్టీయూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీలను బ్లాక్ చేయకుండా పారదర్శకత పాటించాలన్నారు. ప్రతి యూపీ పాఠశాలలో నిబంధనలకు అనుగుణంగా పోస్టులు కేటాయించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ఇచ్చిన గ్రీవెన్స్‌ను క్లియర్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజినేయులు, ఆర్థిక కార్యదర్శి ప్రసాద్, తిరుపాల్‌నాయుడు, శివచంద్ర, డేనియల్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

26 నుంచి అగ్నివీర్ మురళీనాయక్ స్మారక క్రికెట్ టోర్న