breaking news
Ananthapur
-
దళితులంటే సునీతమ్మకు నచ్చదా?
అనంతపురం: దళితులంటే పరిటాల సునీతకు నచ్చదా? అంటూ గొరిదిండ్లకు చెందిన దళిత మహిళలు ఎమ్మెల్యే సునీతపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. శుక్రవారం ఆత్మకూరులో గొరిదిండ్ల దాడి విషయంలోని బాధితులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు సీపీ ఆలమూరు ఓబులేసు, దళిత మహిళలు మాట్లాడుతూ గొరిదిండ్లకు అనూష తన భర్త, తండ్రిని కోల్పోయి ఉన్న ఒక్క కూతురిని చూసుకోవడానికి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే అదే గ్రామానికి చెందిన అక్కులప్ప అనే వ్యక్తి అనూష పట్ల అనుచితంగా ప్రవర్తించి, అత్యాచార యత్నం చేశాడన్నారు.బుధవారం రాత్రి అక్కులప్ప మధ్యం తాగి అనూషను కత్తితో పొడవగా, తీవ్రంగా గాయపడిందన్నారు. అనూషపై దాడిని అడ్డుకోబోయిన హరీష్ కుమార్, మహేంద్ర, శివానందను గొడ్డలితో దాడి చేశారన్నారు. ప్రస్తుతం వారు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. దాడి చేసిన వారిపై అక్కులప్ప, మధు, సోమశేఖర్, రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేవలం అక్కులప్పపై కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుకున్నారన్నారు. మిగిలిన వారిని టీడీపీ నాయకుడు బాలాజీ ఎమ్మెల్యే సునీత ఇంట్లో దాచిపెట్టారన్నారు. కక్షలను పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే సునీత.. నియోజకవర్గంలో మహిళల పట్ల ఎన్ని దాడులు జరిగినా ఎమ్మెల్యే సునీత మాత్రం పట్టించుకోలేదని గ్రామానికి చెందిన దళిత నాయకులు అన్నారు. పరిటాల సునీత ఎప్పుడు అధికారంలోకొచ్చినా ఎస్సీలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. హోంమంత్రిగా దళిత మహిళ ఉన్నా.. మహిళలపై దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. టీడీపీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఊర్లు విడిచే పరిస్థితి వచ్చిందన్నారు. నలుగురిపై కేసులు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని బాలాజీ ఎవరి పేరు చెబితే వారిపైన మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారని, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మండల కన్వీనర్ బాల పోతన్న, యూత్ కన్వీనర్ కొండారెడ్డి,మాజీ డీసీసీబీ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, లక్ష్మిరెడ్డి, గొరిదిండ్ల నరసింహ, రమేష్ కేశవరెడ్డి, మాధన్న, గోవింద్ , ఆదినారాయణ, లక్ష్మి, అఖిల, లలితమ్మ, సంగమ్మ,రామక్క,లక్ష్మక్క, ముత్యాలక్క,నారాయణమ్మ,కుంటెమ్మ,నాగమణి, శాంతమ్మ, కుళ్లాయప్ప, పెద్దన్న పాల్గొన్నారు. అమ్మ లేకపోతే అనాథనైతా..మా అమ్మను కత్తితో పొడిచారు.. మా నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. మా అమ్మ కూలి పనులు చేస్తూ నన్ను చదివిస్తోంది. మా అమ్మను వదిలేయండి.. మా అమ్మను కత్తితో పొడిచారు. మా అమ్మ లేకపోతే నేను బతకను. నన్ను అనాథను చేయకండి అంటూ అనూష కూతురు ప్రీతి సుధ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం అందరినీ కలచివేసింది. సమావేశంలో మాట్లాడుతున్న దళిత నాయకులు ఇదీ చదవండి: రాణీగారి తోటలో చంపేశారు -
కలెక్టరేట్లో భూరికార్డుల ట్యాంపరింగ్
● డీఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు అనంతపురం అర్బన్: తాడిపత్రిలోని ఓ భూమికి సంబంధించి కలెక్టరేట్లోని ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు. డీఆర్ఓ మలోల ఫిర్యాదు మేరకు అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఐపీసీ466, 468/బీఎన్ఎస్ 336 (3), 337 కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రి మండలం తాడిపత్రి గ్రామ సర్వే నంబరు 770–ఇ2, సీసీ నంబరు 2963/75 ఉండగా... సంబంధిత ఎంట్రీలో సర్వే నంబరు 709–ఇ2, సీసీ నంబరు 2968/75గా మార్పు చేసినట్లు గుర్తించారు. ఈ మార్పుల ఆధారంగా గతంలో అనంతపురం భూ సంస్కరణల విభాగం ప్రత్యేక తహసీల్దారు 2023 మే 9న సంబంధిత భూమి ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధిలోకి రాదని ఎండార్స్మెంట్ ఇచ్చినట్లు... అలాగే ఈ ఏడాది మార్చి 16న తాడిపత్రి తహసీల్దారుకు పంపిన లేఖలో సర్వే నంబరు 770–ఇ2లో 2.40 ఎకరాల భూమి సంబంధిత రిజిష్టర్‌లో నమోదు కాలేదని పేర్కొన్నట్లు దర్యాప్తులో తేలింది. గతంలో కలెక్టర్ విచారణ.. ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆనంద్ గతంలో స్వయంగా విచారణ చేసి ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లోని నమోదులో మార్పులు జరిగినట్లు గుర్తించారు. తహసీల్డారు కార్యాలయం ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లో 17, 18 పేజీలు లేకపోవడం, 1–బి రిజిష్టర్, అడంగల్‌లో డి.పట్టాగా నమోదు ఉండడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సీలింగ్ ల్యాండ్ ప్రస్తావన ఉండడం, ఆర్డీఓ కార్యాలయంలోని ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లో సీసీ నంబరు 2963/75 తాడిపత్రి కింద సర్వే నంబరు 770–ఇ2లో 2.40 ఎకరాలు సంబంధించిన నమోదు ఉండడాన్ని కలెక్టర్ గుర్తించారు. ఇందుకు తాడిపత్రి ఇన్చార్జ్ తహసీల్దార్ సోమశేఖర్, ఎంఆర్ఐ ఈశ్వర్‌రెడ్డి, వీఆర్ఓ వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ షఫీలను బాధ్యులను చేస్తూ గత నెల 17న సస్పెండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం డీఏఓ కుల్లాయప్పకు, డీటీ రాజేంద్రప్రసాద్‌కు, కలెక్టరేట్ భూ రికార్డుల విభాగం జూనియర్ అసిస్టెంట్ పవన్‌కుమార్‌కు చార్జ్‌మెమో ఇచ్చారు. -
దళితులంటే సునీతమ్మకు నచ్చదా?
ఆత్మకూరు: దళితులంటే పరిటాల సునీతకు నచ్చదా? అంటూ గొరిదిండ్లకు చెందిన దళిత మహిళలు ఎమ్మెల్యే సునీతపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. శుక్రవారం ఆత్మకూరులో గొరిదిండ్ల దాడి విషయంలోని బాధితులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు సీపీ ఆలమూరు ఓబులేసు, దళిత మహిళలు మాట్లాడుతూ గొరిదిండ్లకు అనూష తన భర్త, తండ్రిని కోల్పోయి ఉన్న ఒక్క కూతురిని చూసుకోవడానికి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే అదే గ్రామానికి చెందిన అక్కులప్ప అనే వ్యక్తి అనూష పట్ల అనుచితంగా ప్రవర్తించి, అత్యాచార యత్నం చేశాడన్నారు. బుధవారం రాత్రి అక్కులప్ప మధ్యం తాగి అనూషను కత్తితో పొడవగా, తీవ్రంగా గాయపడిందన్నారు. అనూషపై దాడిని అడ్డుకోబోయిన హరీష్‌కుమార్, మహేంద్ర, శివానందను గొడ్డలితో దాడి చేశారన్నారు. ప్రస్తుతం వారు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. దాడి చేసిన వారిపై అక్కులప్ప, మధు, సోమశేఖర్, రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేవలం అక్కులప్పపై కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుకున్నారన్నారు. మిగిలిన వారిని టీడీపీ నాయకుడు బాలాజీ ఎమ్మెల్యే సునీత ఇంట్లో దాచిపెట్టారన్నారు. కక్షలను పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే సునీత.. నియోజకవర్గంలో మహిళల పట్ల ఎన్ని దాడులు జరిగినా ఎమ్మెల్యే సునీత మాత్రం పట్టించుకోలేదని గ్రామానికి చెందిన దళిత నాయకులు అన్నారు. పరిటాల సునీత ఎప్పుడు అధికారంలోకొచ్చినా ఎస్సీలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. హోంమంత్రిగా దళిత మహిళ ఉన్నా.. మహిళలపై దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. టీడీపీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఊర్లు విడిచే పరిస్థితి వచ్చిందన్నారు. నలుగురిపై కేసులు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని బాలాజీ ఎవరి పేరు చెబితే వారిపైన మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారని, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మండల కన్వీనర్ బాల పోతన్న, యూత్ కన్వీనర్ కొండారెడ్డి,మాజీ డీసీసీబీ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, లక్ష్మిరెడ్డి, గొరిదిండ్ల నరసింహ, రమేష్, కేశవరెడ్డి, మాధన్న, గోవింద్ , ఆదినారాయణ, లక్ష్మి, అఖిల, లలితమ్మ, సంగమ్మ,రామక్క,లక్ష్మక్క, ముత్యాలక్క,నారాయణమ్మ,కుంటెమ్మ,నాగమణి, శాంతమ్మ, కుళ్లాయప్ప, పెద్దన్న పాల్గొన్నారు. -
కక్షలకు ఆజ్యం పోస్తున్న పరిటాల సునీత
● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆత్మకూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి సస్యశ్యామలంగా ఉన్న రాప్తాడు నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది.. ఎమ్మెల్యే పరిటాల సునీత పల్లెల్లో కక్షలకు ఆజ్యం పోస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఘర్షణలో గాయపడి అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అనూష, హరికుమార్, మహేంద్ర, శివానందను మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గొరిదిండ్లలో అనూష అనే మహిళపై టీడీపీ కార్యకర్త అక్కులప్ప కత్తితో దాడి చేశాడన్నారు. అక్కులప్ప అనుచరులు మరో ముగ్గురిపై విచక్షణరహితంగా కత్తులు, గొడ్డలితో దాడి చేశారని, కనగానపల్లి అక్కులప్ప అనే వ్యక్తి అనూషను అత్యాచారం చేయబోయాడని తెలిపారు. అనూషకు మద్దతు ఇచ్చిన వారిపై మధు, సతీష్, సోమశేఖర్, రామాంజనేయులు కత్తులు, గొడ్డలితో దాడి చేశారన్నారు. అయితే అక్కులప్పను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారని, మిగిలిన నలుగురిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళను అత్యాచారం, చంపబోతే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. మదిగుబ్బ తండాలో ఓ మహిళను హత్య చేస్తే పోలీసులు కేసు తీసుకోకుండా ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. నిందితులు నెల రోజులుగా గ్రామంలో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సనప గ్రామంలో పోతులయ్య అనే వ్యక్తి ఇంట్లో రూ.18 లక్షల విలువైన నగలు దొంగతనం జరిగితే టీడీపీ నేతలే దొంగతనం చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దొంగలకు, రేపిస్ట్‌లకు, హత్యలు చేసేవారికి పరిటాల సునీత మద్దతు పలుకుతూ గ్రామాల్లో కక్షలు రేపుతున్నారన్నారు. దాడులు చేసిన వారు అధికార పార్టీ నేతలు అయితే వారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి టీ, కాఫీలు ఇస్తున్నారన్నారు. అదే గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కుళ్లాయప్ప ప్రమేయం ఉందని బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారని, అనంతపురం రూరల్ మండలం కొడిమిలో అంజనాదేవి అనే మహిళపై అత్యాచారయత్నం చేస్తే మహేంద్రరెడ్డి, మహేశ్వరరెడ్డితో పాటు మరొకరు ఆమెను వివస్త్రను చేసి, రాళ్లు, కట్టెలతో దాడి చేశారన్నారు. పోలీసులు మాత్రం దాడులకు పాల్పడిన వారి దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకొని బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాపంపల్లి వాసుదేవరెడ్డి ,ముత్యాలరెడ్డి, గొరిదిండ్ల నరసింహ, సునీల్‌దత్తారెడ్డి, సుధీర్‌రెడ్డి, హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలి
అనంతపురం అర్బన్: మైనార్టీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలని శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ మహమ్మద్ నసీర్ అహమ్మద్ జిల్లా అధికారులకు సూచించారు. మైనార్టీల కోసం చేపట్టిన కార్యక్రమాలపై చైర్మన్ శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనార్టీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా? అనే అంశాలను పరిశీలించడమే కమిటీ ఉద్దేశమన్నారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. సమాజంలో విద్య ద్వారానే మార్పు సాధ్యమవుతుందన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, వాటి ద్వారా ఆదాయ వనురల పెంపు, మసీదుల ఇమామ్‌లు, మౌజమ్ల గౌరవ వేతనం తదితర అంశాలపై కమిటీ సమీక్షించిందన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. అనంతరం కమిటీ చైర్మన్, సభ్యులను కలెక్టర్ సన్మానించారు. సమావేశంలో కమిటీ సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇషాక్‌బాషా, సుందరపు విజయ్‌కుమార్ ఖాజీ యాకూబ్‌బాషా, కమిటీ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, కమిటీ అదనపు కార్యదర్శి ఈశ్వరరావు, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి రామసుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
కుందుర్పి: మండలంలోని రుద్రంపల్లికి చెందిన బోయ హరికృష్ణ (22) జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. బోయ బొమ్మిరెడ్డి రెండో కుమారుడు హరికృష్ణ తాగుడుకు బానిసయ్యాడు. జులాయిగా తిరిగేవాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం తాగుడు మానేయాలని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన హరికృష్ణ.. గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల కాపర్లు విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తండ్రి బొమ్మిరెడ్డి ఫిర్యాదు మేరకు కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ అనంతపురం న్యూ టౌన్: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్య మని వక్తలు స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని ఉపాధ్యాయ భవన్లో భవన్లో జిల్లాస్థాయి పర్యావరణ వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా స్థాయిలోని గ్రీన్ టీచర్లు, విద్యార్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ క్రాప్స్ రాష్ట్ర కోఆర్డినేటర్ నీలకంఠ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. నీటి సంరక్షణ చర్యలను చేపడుతూనే, ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గించినప్పుడే ప్రకృతిలో పర్యావరణం సాధ్యమవుతుందన్నారు. ఉపాధ్యాయులందరూ విధిగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎన్జీసీ జిల్లా కోఆర్డినేటర్ కావూరి విజయ్‌కుమార్, అనంతపురం క్లస్టర్ కోఆర్డినేటర్ రవికుమార్, శైలజ, ప్రేమనాథరెడ్డి, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లుకు చెందిన ఉపాధ్యాయులు, 16 మండలాల పర్యావరణ పరిరక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 21 నుంచి జిల్లావ్యాప్తంగా కరువు దీక్షలు అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 23 వరకు కరవు దీక్షలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జగదీష్ మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయకుడు కరువుపై చర్చించకపోవడం బాధాకరమన్నారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జాఫర్, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సంజీవప్ప, రామకృష్ణ, కేశవరెడ్డి, గోపాల్, టి.నారాయణస్వామి, పద్మావతి పాల్గొన్నారు. నిమజ్జనంలో కత్తులతో దాడి అనంతపురం సెంట్రల్: నగరంలో ఇందిరానగర్‌లో వినాయక నిమజ్జనంలో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేసుకున్నారు. అనిల్‌కుమార్ అనే యువకుడిపై వినయ్ అనే యువకుడు కత్తితో ఛాతీలో పొడిచాడు. దీంతో నిమజ్జన వేడుకలో ఒక్కసారి కలకలం రేగింది. తీవ్రంగా గాయపడిన అనిల్‌కుమార్‌ను క్షతగాత్రులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దగ్గుపాటి.. వివాదాల కుంపటి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. వివాదాలతో తరచూ వార్తల్లో కెక్కుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్న వారితో పాటు గతంలో ఎమ్మెల్యే వెన్నంటి నడిచిన వారే ఆయన తీరును తూర్పారపడుతున్నారు. ఎమ్మెల్యేకు డబ్బులుంటే చాలని.. మరెవ్వరూ అవసరం లేదని కార్యకర్తలే చెప్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకున్నా.. లేదా చెప్పిన పని చేయకున్నా కార్యకర్తలను వేధిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా ఎమ్మెల్యే ఏమాత్రమూ తగ్గడం లేదు. సొంతపార్టీ కేడర్‌పైనే కేసులు రుద్రంపేట గ్రామ పంచాయతీ పరిధిలో టీడీపీ సీనియర్ కార్యకర్త ఫక్రుద్దీన్ ఏటా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. గతేడాది మాత్రం ఎగ్జిబిషన్ పెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే ‘ఎమ్మెల్యే ట్యాక్స్’ కింద రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని దగ్గుపాటి అనుచరులు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. అంత డబ్బులు ఇచ్చుకోలేమని బతిమలాడినా వదల్లేదు. ఫక్రుద్దీన్‌పై ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు గంగారంతో పాటు గన్‌మెన్ షేక్షావలి దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షావలిని పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. గంగారాంపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంత జరిగినా దగ్గుపాటి వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. మామూళ్లు ఇవ్వలేదని మద్యం దుకాణానికి నిప్పు అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్ల నుంచి ప్రతి నెలా ‘ఎమ్మెల్యే ట్యాక్స్’ కింద మామూళ్లు వెళుతున్నాయి. అయితే డీమార్ట్ ఎదురుగా ఉన్న నంబూరి వైన్స్‌ను నంబూరి వెంకట రమణ నిర్వహిస్తున్నాడు. ఈయన టీడీపీ సానుభూతిపరుడు. దుకాణంలో తనకు వాటా ఇవ్వాలని రమణపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. తన మాట లెక్కచేయకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు పెట్రోల్ పోసి వైన్స్ దుకాణానికి నిప్పంటించారు. ఇలా వరుసగా సొంత పార్టీ వారిపైనే దాడులు, దౌర్జన్యాలు, దాష్టీకాలకు పాల్పడుతుండడంతో ఎమ్మెల్యేను కాదని ఏ పని చేయాలన్నా నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. రూ.200 కోట్ల ఆరోపణలపై నోరెత్తని దగ్గుపాటి రెండేళ్ల వ్యవధిలోనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రూ.200 కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నారని సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆరోపణలు చేశారు. నగరంతో పాటు రూరల్ పరిధిలో ఏ స్థలం అమ్మాలన్నా.. కొనాలన్నా ఎమ్మెల్యే అనుమతి అడుగుతున్నారని, అలాగే ప్రతి నెలా రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే బహిరంగంగా ఆరోపణలు చేసినా ఇప్పటివరకు వీటిపై దగ్గుపాటి స్పందించకపోవడం గమనార్హం. గంగారం... దూరం దూరం ఎమ్మెల్యే దగ్గుపాటికి గంగారాం నమ్మిన బంటుగా ఉన్నారు. దగ్గుపాటి ఏ చిన్న పని చేయాలన్నా గంగారాంతో చేయించారు. మద్యం దుకాణాల నుంచి అక్రమ వసూళ్లు, సివిల్ పంచాయితీలు, పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు, మాట వినని వారిపై దాడులు మొదలైనవన్నీ గంగారాం కనుసన్నల్లోనే జరిగాయి. పంపకాల్లో తేడా రావడంతో గంగారాంను ఎమ్మెల్యే దూరం పెడుతూ వచ్చారు. ఓ వైన్ షాపుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పై నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు గంగారాంను అరెస్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి గంగారాంను ఎమ్మెల్యే పూర్తిగా దూరం పెట్టారు. చేయించిన ఎమ్మెల్యేను వదిలేసి చేసిన తనను జైలుకు పంపించారని గంగారాం తన అనుచరుల వద్ద రగిలిపోతూ కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేపై బూతుపురాణం లంకించిన సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాలు అడిగినందుకు బెదిరింపులు ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే 1000 మంది మైనార్టీలకు నివేశన స్థలం ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టించి ఇస్తానని దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. గెలిచాక హామీపై నోరు మెదపకపోవడంతో టీడీపీ మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహబూబ్‌బాషా ప్రశ్నించారు. దీన్ని ఎమ్మెల్యే సహించలేకపోయారు. బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తన కుమారుడిపై హత్యాయత్నం కేసు పెట్టించారని, తన కూతురి వివాహ సమయంలో కుటుంబాన్ని ఇబ్బందిపెట్టడంతో పెళ్లి కూడా రద్దయ్యిందని మహబూబ్‌బాషా శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ ఎదుట శుక్రవారం విలపించారు. ఇలా సొంత పార్టీ నేతలు, కార్యకర్తల ఎదుగుదలను ఎమ్మెల్యే ఓర్వలేకపోతున్నారని టీడీపీ కేడరే బహిరంగంగా విమర్శిస్తుండడం గమనార్హం. వరుస వివాదాల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే సొంత పార్టీ కేడర్‌పైనే అక్రమ కేసుల బనాయింపు అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వేధింపులే ఎమ్మెల్యే అక్రమాలపై భగ్గుమంటున్న బాధితులు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుత్తి: పట్టణ శివారులోని కర్నూలు రోడ్డు కోళ్లఫారం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బెస్త శ్రీరాములు (38) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బెస్త వీధికి చెందిన శ్రీరాములు, రామలక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె కర్నూలు రోడ్డులోని మహర్షి దయానంద గురుకుల పాఠశాలలో ఏడు, ఐదో తరగతి చదువుతున్నారు. శ్రీరాములు పిల్లలను పిలుచుకొని రావడానికి స్కూటీపై బయల్దేరాడు. మార్గంమధ్యలో స్కూల్ వ్యాన్ ఢీకొనింది. స్కూటీ రోడ్డు పక్కకు ఎగిరి పడింది. రోడ్డుపైనే శ్రీరాములు పడి మృతి చెందాడు. భర్త మరణ వార్త విని భార్య రామలక్ష్మి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ పరారీ అయ్యాడు. ఘటనపై సీఐ రామారావు కే సు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతో భర్త హత్య కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని చాపిరి గ్రామంలో భర్తను భార్య హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...నారాయణపురం గ్రామం నుంచి చాపిరి గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చిన నాగరాజు, రత్నమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈమధ్య కాలంలో నాగరాజు తాగుడుకు బానిసయ్యాడు. తరుచూ భార్యాభర్తలు తగువు పడుతుండేవారు. గురువారం రాత్రి భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. గొడవ సద్దిమణిగిన తర్వాత ఒక్కసారిగా భార్య రత్నమ్మ భర్త నాగరాజుపై కర్రతో తలపై బాదింది. ఈ దాడిలో గాయపడిన నాగరాజును స్థానికులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ నాగరాజు శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ గంగాధర్ తెలిపారు. డీపీఓ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ (టీఎంఎఫ్) పోస్టును ఔట్సో ర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అయ్యూబ్ హుస్సేన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నెలకు రూ.25 వేల వేతనం చెల్లిస్తారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు తెలుగు, ఇంగ్లిష్ భాషలపై మంచి పట్టు, సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. విద్యాశాఖ లేదా ఇంటర్మీడియట్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ డైరెక్టర్లు, సూపరింటెండెంట్లకు ప్రాధాన్యం ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన, ప్రతిభా పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నెల 22లోపు దరఖాస్తులు సమర్పించాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాతో పాటు విద్యార్హత, అనుభవ ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని డీఈఓ సూచించారు. విద్యుదాఘాతంతో మహిళా రైతుకు తీవ్ర గాయాలు గుత్తి రూరల్: మండలంలోని టి.కొత్తపల్లిలో శుక్రవారం విద్యుదాఘాతంతో నాగలక్ష్మి అనే మహిళా రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ఆదిశేషులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాగలక్ష్మి గ్రామ శివారులోని పంటకు నీరు పెట్టేందుకు వెళ్లింది. వ్యవసాయ బోరు స్విచ్ ఆన్ చేస్తున్న క్రమంలో స్టార్టర్ బాక్సు వద్ద తెగి ఉన్న తీగ తగిలి ఆమె షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో సొమ్మసిల్లి పడి అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్య గార్లదిన్నె: బూదేడుకు చెందిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన అనూష (30) గత బుధవారం ఇంటి వద్ద విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉండగా ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. మృతు రాలికి కొడుకు,కుమార్తె ఉన్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
కరువు చిత్రం.. కన్నీటి కష్టం
శింగనమల/గుత్తి రూరల్: ఆరుతడి పంటలపై ఆశలేదు.. పచ్చని పంట పొలాలున్నా ఫలితంలేదు.. పంట పొలాలు బీటలు వారాయి.. పచ్చని పైర్లు నిలువునా నెర్రెలు చీలాయి.. వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంటలు కళ్లెదుటే నిలువునా ఎండిపోతుంటే.. కనుచూపు మేర ఎడారి ఛాయలు కనిపిస్తుంటే.. చూడలేక.. ఉండలేక ఆరుగాలం కష్టించే అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.. ఇంతటి దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నా.. కనీసం వ్యవసాయానికి సాగునీరు అందలేదు.. సాయం అందించలేదు.. రైతు సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం.. రైతుల గురించి ఆలోచన కూడా చేయలేదని నిట్టూరుస్తున్నారు. శింగనమల నియోజకవర్గం ఉద్యానతోటలకు ప్రసిద్ధి. కానీ నేడు భూగర్భజలం అడుగంటిపోవడంతో రైతులు దిక్కు తోచక విలవిల్లాడుతున్నారు. శింగనమల మండలం నాగులగుడ్డం తండాలో రైతు రాముడు నాయక్‌కు ఎనిమిదెకరాల పొలం ఉంది. చీనీపంటలు, ఇతర పంటల సాగుకోసం ఎనిమిది బోరుబావులు తవ్వాడు. నాలుగు బోర్లలో నీరు వస్తుండేది. కానీ అందులో రెండు బోర్లలో భూగర్భజలాలు అడుగంటాయి. మరో రెండు బోర్లలో మాత్రమే నీరు వచ్చేది. దీంతో పంటలకు నీరుచాలకపోవడంతో చుట్టుపక్కల ఉన్న రైతుల బోరుబావుల నుంచి ట్యాంకర్ల ద్వారా తెప్పించుకొని చీనీచెట్లను బతికించుకోవడానికి అష్టకష్టాలు పడ్డాడు. అయితే ట్యాంకర్లకు కూడా నీరు సరిపడా అందక దిక్కుతోచని స్థితిలో చీనీచెట్లను వదిలేయాల్సి వచ్చింది. గ్రామంలోని రైతులు కూడా తాగు, సాగు నీటి కోసం ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. నాగులగుడ్డం తండాలో రైతు మూడ్ రాముడు నాయక్ తోటలో ఎండిపోయిన చీనీ చెట్లు, శ్రీపురంలో వేరుశనగ పంటను దున్నేస్తున్న రైతు శ్రీపురం వద్ద ఎండిన వేరుశనగ పంట.. గుత్తి మండలంలోని శ్రీపురంలో గోవిందు అనే రైతు ఖరీఫ్ సీజన్లో ఎంతో ఆశతో ఈ ఏడాదైనా దిగుబడి వస్తుందని మూడున్నర ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాడు. విత్తనం వేసినప్పటి నుంచి సరైన వర్షాలు లేవు. పంట ఎండుముఖం పట్టింది. ఇక వర్షం రాదు.. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆదుకోదని భావించాడు. దిక్కుతోచని స్థితిలో పశువుల మేత అయినా దక్కుతుందేమోనని భావించి వేరుశనగ పంటను శుక్రవారం దున్నేశాడు. ప్రస్తుతం మార్కెట్లో ట్రాక్టర్ వరిగడ్డి రూ.25 వేలు పలుకుతోంది. దీంతో రైతులు అంత ధరపెట్టి కొనుగోలు చేసే శక్తి లేక నష్టం అని తెలిసినా కూడా తమ పొలాల్లో వేరశనగ పంటలు తొలగించి పశువుల మేత కోసం ఇళ్లకు తరలిస్తున్నారు. దాదాపు రూ.60 వేలు వెచ్చించి వేరుశనగ సాగు చేశానని, పంట చేతికి రాక పూర్తిగా నట్టేట మునిగానని, రైతు గోవిందు ఆవేదన చెందాడు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కాదు.. ఎల్లోనినో ఎఫెక్ట్‌గానే రైతులు భావిస్తున్నారు. ఎండిపోయిన 1200 చీనీ చెట్లు నాగులగుడ్డం తండా వద్ద రైతు రాముడు నాయక్ వదిలేసిన చీనీ పంట గుత్తి మండలం శ్రీపురం వద్ద వేరుశనగ పంటను దున్నేసిన రైతు -
కాలువ మట్టి.. కొల్లగొట్టి
● బీటీపీ కాలువ పనుల్లో దోపిడీ ● రాత్రికి రాత్రే తరలిస్తున్న ‘పచ్చ’ నేతలు ● మట్టి రవాణాను అరికట్టని అధికారులు ● మైనింగ్ చట్టాల ప్రకారం కాలువ తవ్వకాల మట్టిని కాంట్రాక్టర్ సొంత పనులకు తరలించకూడదు. విక్రయించకూడదు. నిర్దేశించిన ప్రభుత్వ స్థలంలోనే డంప్ చేయాలి. ● అదేవిధంగా మట్టిని తరలించాలంటే ప్రభుత్వానికి నిర్ణయించిన సీనరేజ్ రుసుం చెల్లించి అనుమతి పత్రాలు పొందాలి. ● కాలువ నిర్మాణాల కోసం తవ్విన మట్టిని తరలించాలంటే సంబంధిత ఆర్డీఓ/ తహసీల్దార్ వద్ద నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తప్పనిసరి. ● మట్టి తరలించే వాహనానికి మైనింగ్ శాఖ జారీ చేసిన వేబిల్లు తప్పనిసరిగా ఉండాలి. ● ఈ బిల్లులో మట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు. ఎంత పరిమాణం ఉందో స్పష్టంగా ఉండాలి. ● ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మట్టి తరలించాలి. కళ్యాణదుర్గం: బీటీపీ (భైరవానితిప్పప్రాజెక్టు) కాలువ పనుల పేరుతో మట్టి దోపిడీ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. రాత్రివేళ్లల్లో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ రవాణా స్థానికంగా చర్చనీయాంశమైంది. జీడిపల్లి నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టు వరకు కాలువ తవ్వకం పనులు సాగుతున్నాయి. కాలువ కోసం తీసిన మట్టిపై అధికార టీడీపీ నాయకులు కన్ను పడింది. సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే టిప్పర్ల ద్వారా కాలువ మట్టిని తరలించుకుపోతోంది. ఇదే అదనుగా పలువురు ‘పచ్చ’ నేతలు భారీ మొత్తంలో ప్రైవేట్ భూముల్లో డంప్ ఏర్పాటు చేసుకుని.. గుట్టుగా అమ్ముకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా పొలాలకు, రస్తాలకు కూడా కాలువ మట్టిని వినియోగించుకోవడం కొసమెరుపు. రూ.లక్షల్లో మట్టి దోపిడీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం– అనంతపురం ప్రధాన రహదారి ఒంటిమిద్ది వద్ద, కళ్యాణదుర్గం– బెంగళూరు ప్రధాన రహదారి నారాయణపురం వద్ద బీటీపీ కాలువ పనుల నిర్మాణాల కోసం తవ్విన మట్టిని రాత్రికి రాత్రే ‘తమ్ముళ్లు’ అక్రమంగా రవాణా చేస్తున్నారు. 30 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్ల ద్వారా మట్టిని తరలించేస్తున్నారు. ఇలా పదుల సంఖ్యలో టిప్పర్లను పెట్టి రూ.లక్షల్లో మట్టి దోపిడీ చేస్తున్నారు. చోద్యం చూస్తున్న అధికారులు నిబంధనల ప్రకారం ప్రభుత్వ పరిధిలోని మట్టిని తరలించాలన్నా, వినియోగించాలన్నా సంబంధిత మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. కానీ కళ్లముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రతిపక్షం, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికై నా బీటీపీ కాలువ మట్టి అక్రమ రవాణాను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరుతున్నారు. ఇవీ నిబంధనలు... ఇక్కడ కనిపిస్తున్న మట్టి దిబ్బలు కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోనివి. పక్కనే ఒంటిమిద్ది వద్ద బీటీపీ కాలువ పనులు జరుగుతున్నాయి. ఓ టీడీపీ నాయకుడు తనకున్న పలుకుబడితో రాత్రికి రాత్రే కాలువ మట్టి అక్రమ రవాణాతో దోపీడికి తెరలేపాడు. అనంతపురం ప్రధాన రహదారి పక్కనే ప్రైవేట్ పొలంలో మట్టిని నిల్వ ఉంచాడు. దీని విలువ సుమారు రూ.5 లక్షలకు పైగానే ఉంటుంది. -
నేమకల్లు క్వారీల్లో ‘విజిలెన్స్’ తనిఖీలు
బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు శివారులోని క్వారీల్లో అనుమతి లేకుండా తెల్లరాయి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై మైన్స్ అండ్ జియాలజీ అధికారులు రెండో రోజు శుక్రవారం కూడా తనిఖీలు నిర్వహించారు. కర్నూలు రీజినల్ మైన్స్అండ్ జియాలజీ విజిలెన్స్ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా మైనింగ్ అధికారుల బృందం సభ్యులు క్వారీలను పరిశీలించారు. కర్నూలు రీజినల్ మైన్స్అండ్ జియాలజీ ఏజీ రాజశేఖర్ మాట్లాడుతూ అనుమతి లేకుండా తెల్లరాయి తవ్వకాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు కేంద్ర మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయాలనికి అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేమకల్లు కొండల్లోని క్వారీల్లో రెండురోజుల పాటు తనిఖీలు నిర్వహించామన్నారు. పీహెచ్ భారతి 4.398 హెక్టార్లు, శివరాజు 4.958 హెక్టార్లు, మోహన్‌దాస్ 2.620 హెక్టార్లు, గురుప్రసాద్ 2.082 హెక్టార్లకు ప్రభుత్వం లీజు మంజూరు చేసిందన్నారు. అయితే అనుమతులు లేకపోయినా కేటీ లాలుస్వామి 2.646 హెక్టార్లు, తిమ్మనగౌడ్ 3.632 హెక్టార్లు, అలైఖ్య 4.684 హెక్టార్లలో తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. లీజు అనుమతుల కోసం వీరు రెండేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకున్నారని, అయితే వాటిని 8 నెలల క్రితమే రద్దు చేసినట్లు తెలిపారు. కేటీ లాలుస్వామి, తిమ్మనగౌడ్ క్వారీల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రదేశాల్లోనే అక్రమంగా తెల్లరాయిని తవ్వుతున్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలు, యంత్రాలను గురువారమే సీజ్ చేసిన్నట్లు చెప్పారు. అన్ని క్వారీల్లో సర్వేలు చేశామని, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఏజీ తెలిపారు. తనిఖీల్లో రాయల్టీ ఇన్స్పెక్టర్ పురుషోత్తం, టెక్నికల్ అసిస్టెంట్ దిలీప్‌కుమార్, అనంతపురం రాయల్టీ ఇన్స్పెక్టర్ సుప్రజ, సర్వేయర్ నిర్మల్ పాల్గొన్నారు. -
10 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: చాన్నాళ్ల తర్వాత జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 10 మండలాల పరిధిలో 3.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరులో 42.6 మి.మీ మేర వర్షం కురిసింది. శింగనమల 20 మి.మీ, నార్పల 18.6 మి.మీతో పాటు కూడేరు, గుత్తి, యల్లనూరు, బ్రహ్మసముద్రం, అనంతపురం రూరల్, యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. కాగా అక్కడక్కడా బలమైన గాలులు వీయడంతో ఆత్మకూరు మండలం సనపలో 15 మంది రైతులకు చెందిన 45 ఎకరాల అరటి తోటలు నేలవాలడంతో రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. దీనిపై ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు వేసినట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాగల నాలుగు రోజులూ వర్షం పడే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి, రీసెర్చ్ అసోసియేట్ కె.పావని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో 19న 6.3 మి.మీ, 20న 8.8 మి.మీ, 21న 10 మి.మీ, 22న 10.1 మి.మీ, 23న 6 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో 19న 6.4 మి.మీ, 20న 16 మి.మీ, 21న 8 మి.మీ, 22న 10 మి.మీ, 23న 8.8 మి.మీ మేర వర్షం పడే సూచన ఉందన్నారు. -
నగదు బ్యాగు పొలంలో ప్రత్యక్షం
ఉరవకొండ: ఉరవకొండ శివారులోని లత్తవరం రోడ్డు వద్ద రైతు మాదినేని శ్రీనివాసులు ఇంట్లో బుధవారం రాత్రి చోరీకి గురైన రూ.45 లక్షల నగదు బ్యాగు శుక్రవారం బాధిత రైతు పొలంలో ప్రత్యక్షమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బ్యాగు తెరిచి చూడగా రూ.32 లక్షల నగదు కనిపించింది. ఈ బ్యాగు తాను ఇంట్లో భ్రదపరచినదేనని రైతు గుర్తించాడు. మిగతా రూ.13 లక్షలు ఏమయ్యాయో తెలియడం లేదు. అసలు బ్యాగును బాధితుడి పొలంలోనే ఎవరు పడేసి వెళ్లానేది అంతుచిక్కడం లేదు. ఇంటిదొంగల పనేనా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. త్వరలోనే నిజానిజాలు బయటపడనున్నాయి. ‘డైట్’ సరఫరాకు టెండర్ల ఆహ్వానం అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిధిలోని డీసీహెచ్ఎస్ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో రోగులు, వైద్య సిబ్బందికి ఆహారం (డైట్) సరఫరా చేసేందుకు అనుభవం, ఆసక్తి ఉన్న వారి నుంచి టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ మేరకు డీసీహెచ్ఎస్ డాక్టర్ వెంకట్రావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హిందూపురంలోని 200 పడకలు ఉన్న జిల్లా ఆస్పత్రితో పాటు తాడిపత్రి, గుంతకల్లు, మడకశిర, కదిరి, ధర్మవరం, రాయదుర్గంలోని వంద పడకల ప్రాంతీయ వైద్యశాలలు, అనంతపురంలోని సీడీ ఆస్పత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, గుత్తి, పెనుకొండ ప్రాంతాల్లోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు, కొనకొండ్ల, శింగనమల, కణేకల్లు, పామిడి, సీకే పల్లి, తనకల్లు, కొత్తచెరువు, గోరంట్ల, నల్లమాడ, రొళ్లలోని 30 పడకల సీహెచ్‌సీలకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు జిల్లా ఆస్పత్రికి రూ.2 వేలు, ప్రాంతీయ వైద్య శాలలకు రూ.1,500, సీడీ ఆస్పత్రి, సీహెచ్‌సీలకు రూ.వెయ్యి చొప్పున డీడీ (డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, అనంతపురం) తీసి ఈ నెల 21 నుంచి 26వ తేదీలోపు కార్యాలయం పనివేళల్లో అందజేయాలి. పూర్తి వివరాలకు 80085 53730, 82475 78680 నంబర్లలో సంప్రదించవచ్చు. ఐటీఐల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో (2026–27 విద్యా సంవత్సరానికి) మిగిలిన సీట్ల భర్తీకి నిర్వహించే 6వ విడత ప్రవేశాల కౌన్సెలింగ్ గడువును పొడిగించినట్లు ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ రాయపరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 91005 98631, 97032 31501 నంబర్లలో సంప్రదించాలన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేయాలి అనంతపురం అర్బన్: వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 నంబంరు నుంచి ఇప్పటి వరకు 24 శాఖలకు సంబంధించి మంజూరు చేసిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు లేనిపక్షంలో నిధులు వెనక్కు వెళతాయన్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పనులు చేయకపోతే అభివృద్ధిలో జిల్లా వెనకబడుతుందన్నారు. పనుల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయికి ఇద్దరు విద్యార్థినులు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా సైన్స్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన నేషనల్ సైన్స్ సెమినార్–2026 జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ‘భారతదేశ ఇంధన సమ్మేళనం–2047: అవకాశాలు– సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో గుంతకల్లు డాక్టర్ ఎస్‌ఆర్‌కేఎం ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పి.నందిత, రాయదుర్గం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎస్.హఫీపా సాధియా ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు రాష్ట్రస్థాయి పోటీల్లో అనంతపురం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని డీఈఓ డాక్టర్ అయూబ్ హుస్సేన్, జిల్లా సైన్స్ అధికారి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి
అనంతపురం సిటీ: మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వీటిని నిర్లక్ష్యం చేస్తే కంటి సమస్యలు, కిడ్నీ వైఫల్యం, గుండెపోటు, స్ట్రోక్, పాదాల సమస్యలు వస్తాయని డీఎంహెచ్ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ’మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంచితే.. ప్రాణానికి రక్షణ’ అనే నినాదంతో 30 రోజుల పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగే సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని గురువారం అనంతపురంలోని నాయక్‌నగర్‌లో ఉన్న అర్బన్‌హెల్త్ సెంటర్లో ఆయన ప్రారంభించారు. నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ప్రత్యేక స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి గుత్తి: వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో నివాసముండే అశోక్‌కుమార్ (26) బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం సంబరాల్లో పాల్గొన్నాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి కింద పడిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని కర్నూలు ఆస్పత్రికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడు అశోక్ కుమార్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసేవాడు. మృతుడికి భార్య ప్రశాంతి ఉన్నారు. సెలవులో ఉద్యానశాఖ డీడీ అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీహెచ్) డి.ఉమాదేవి గురువారం నుంచి 40 రోజుల పాటు సెలవు పెట్టారు. కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికా వెళుతున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. తిరిగి నవంబర్‌లో డీడీగా బాధ్యతలు చేపడతారన్నారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ బీసీ ధనుంజయకు ఇన్చార్జి డీడీ బాధ్యతలు అప్పగిస్తూ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాషా తెలిపారు. గల్లంతైన యువకుడి మృతి బొమ్మనహాళ్: వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని హెచ్చెల్సీ కాలువలో గల్లంతైన సాయిభరత్ (22) మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ నబీరసూల్ వివరాల మేరకు.. ఉప్పరహాళ్ క్రాస్ వద్ద నివాసం ఉంటున్న శీనా కుమారుడు సాయిభరత్ బుధవారం సాయంత్రం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిమజ్జనం అనంతరం అందరూ గోడిసెలపల్లి రోడ్డులోని హెచ్చెల్సీ కాలువలో స్నానం చేస్తుండగా సాయిభరత్ కూడా కాలువలోకి దూకాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం కణేకల్లు మండలంలోని యర్రగుంట గ్రామ సమీపంలో సాయిభరత్ మృతదేహం లభ్యమైంది. మృతుడు తండ్రి శీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండి బొమ్మనహాళ్: మండలంలోని ఏలంజి గ్రామ సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గురువారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో ట్యాంక్‌లో నిల్వ ఉన్న తాగునీరు భారీగా వృథా అవుతోంది. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా హెచ్చెల్సీ నుంచి వచ్చే నీటిని ఈ ట్యాంక్‌లో నిల్వ చేసి, చుట్టూ పక్కల ఉన్న 16 గ్రామ పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కీలకమైన నీటి నిల్వ ట్యాంక్‌కు గండి పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్యాంక్‌కు గండి పడిన విషయం తెలుసుకున్న డీఈఈ రామారావు, ఏఈఈ భార్గవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ట్యాంక్ నుంచి నీరు బయటకు వస్తున్న నేపథ్యంలో పనులు చేయడానికి వీలు కావడం లేదన్నారు. ట్యాంక్‌లో నీటిని ఒక్కటిన్నర అడుగు మేర ఉంచి రింగ్ బండ్‌ను ఏర్పాటు చేసిన తర్వాతే గండి పూడ్చేందుకు వీలవుతుందన్నారు. వీలైనంత త్వరగా గండి పూడ్చివేసి ట్యాంక్‌లోకి హెచ్చెల్సీ నీటిని నింపుతామని డీఈఈ తెలిపారు. -
పెండింగ్ వేతనాల కోసం 20 నుంచి సమ్మె
● ‘శ్రీరామరెడ్డి’ ప్రాజెక్టు కార్మికుల స్పష్టీకరణ కూడేరు/అనంతపురం న్యూటౌన్ : ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఈ నెల 20 నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ కార్మికులు సమ్మెకు దిగనున్నట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్, ప్రాజెక్ట్ కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రకోడు ఎర్రిస్వామి తెలిపారు. గురువారం వారు మండలంలోని శ్రీరామరెడ్డి ప్రాజెక్ట్ వద్ద కార్మికులతో సమావేశమయ్యారు. న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ప్రాజెక్ట్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్ట్‌లో 600 మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ 5 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిల చెల్లింపుతో పాటు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫేజ్–4 కార్మికుల వేతన కోతలను ఉపసంహరించుకోవాలన్నారు. 18 ఫిల్టర్ బెడ్లు, మోటార్లు సక్రమంగా పని చేయడం లేదని, నిర్వహణ లోపాలను సరిచేయాలని కోరారు. రెండు రోజుల్లో డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు నారాయణ స్వామి, రమేష్, వన్నూరు స్వామి రాజా, నేసే ఎర్రిస్వామి, సుధాకర్ పాల్గొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
కణేకల్లు: మండలంలోని అంబాపురంలో గురువారం గంగమ్మ (28) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోలీసుల వివరాలమేరకు.. బొమ్మనహళ్ మండలం హారేసముద్రానికి చెందిన హెచ్.వండ్రక్క, వండ్రప్పల కుమార్తె గంగమ్మను పదేళ్ల క్రితం అంబాపురానికి చెందిన వన్నూరుస్వామికిచ్చి వివాహాం చేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీరికి ముగ్గురు కుమారులున్నారు. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం గురువారం ఉదయం వన్నూరుస్వామి తన భార్య ఉరి వేసుకొని చనిపోయినట్లు భార్య తరుపు బంధువులకు చెప్పాడు. వారి ద్వారా సమాచారం తెలుసుకొన్న గంగమ్మ తల్లిదండ్రులు గురువారం ఉదయం అంబాపురంలోని వారి ఇంటికెళ్లి విగతజీవిగా ఉన్న కూతుర్ని చూసి బోరుమన్నారు. అయితే గంగమ్మ తలకు దెబ్బలు తగలడంతో తమ కూతుర్ని కొట్టి చంపి ఉంటారని తల్లీదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా గంగమ్మ పెద్ద కుమారుడు ముని బుధవారం రాత్రి ఇంట్లో జరిగిందంతా పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా నారాయణస్వామి బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్తగా (ప్రిన్సిపాల్ సైంటిస్ట్, హెడ్) గురువారం డాక్టర్ నారాయణస్వామి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ప్రధాన శాస్త్రవేత్తగా పని చేస్తున్న డాక్టర్ విజయ శంకర్‌బాబు వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల తిరుపతి–మృతికా శాస్త్ర విభాగ అధిపతిగా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి మాట్లాడుతూ జిల్లా రైతులకు పంటల సాగులో లాభసాటి మెళకువలు అందించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణపై వ్యవసాయ సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. రైతాంగ అభివృద్ధికి పరిశోధనా స్థానం తరుఫున ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. వ్యక్తిపై పోక్సో కేసు బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని పసులూరులో బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేఽధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి వివరాలమేరకు.. వెంకటాపురానికి చెందిన రాజు పసులూరు గ్రామంలో ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. రాజుకు ఇది వరకే పెళ్లి అయింది. అయితే నాలుగు రోజుల క్రితం బాలికను రాజు ఇంటి నుంచి తీసుకెళ్లాడు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఇరువురిని స్టేషన్‌కు తీసుకొచ్చి రాజును అదుపులోకి తీసుకుని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. రాజుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్స్‌కు తమిళనాడు, మణిపూర్
అనంతపురం: డాక్టర్ తాలిమెరెన్ ఆవో అండర్–19 బాలికల ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ టోర్నీలో ఇప్పటి వరకూ జార్ఖండ్ కొనసాగిస్తూ వచ్చిన విజయ ప్రస్థానానికి డిఫెండింగ్ చాంపియన్ మణిపూర్ జట్టు కళ్లెం వేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నెల 10 నుంచి ఆర్డీటీ స్టేడియం వేదికగా 15 రాష్ట్రాల జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు, ఏపీ జట్లు తలపడ్డాయి. ఏపీ జట్టుపై 12–1 గోల్స్ తేడాతో తమిళనాడు జట్టు ఘన విజయం సాధించింది. పైచేయి సాధించిన మణిపూర్ మధ్యాహ్నం జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో జార్ఖండ్, మణిపూర్ జట్లు తలపడ్డాయి. నువ్వానేనా అనే రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు మొదట ఓ గోల్ చేసింది. ఛాలెంజ్‌గా తీసుకున్న మణిపూర్ జట్టు చెలరేగిపోయింది. మరో 6 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా మణిపూర్ క్రీడాకారిణి తంగ్జమ్ విక్టోరియా దేవి ఓ గోల్ చేయడంతో మ్యాచ్ ఫలితం సమంగా మారింది. దీంతో నిబంధనల మేరకు ఇరు జట్లకు చెరో ఐదేసి పెనాల్టీ షూటౌట్లు కేటాయించారు. ఈ అవకాశాన్ని మణిపూర్ జట్టు క్రీడాకారులు సద్వినియోగం చేసుకున్నారు. ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ మణిపూర్ క్రీడాకారులు దాసిలా సేస్టమ్, మంగలేబి ఇరోమ్, అగున్వాంగ్లియు ఖేంగ్తామెయ్, రించుయిలా గాంగ్మెయ్ వరుసగా నాలుగు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకంగా మారారు. జార్ఖండ్ జట్టు రెండు గోల్స్‌కే పరిమితమైంది. దీంతో మణిపూర్ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మ్యాచ్‌లను ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, కార్యదర్శి డానియల్ ప్రదీప్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు దాదాఖలందర్ పర్యవేక్షించారు. -
చెదుళ్లలో మహిళపై దాడి
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని చెదుళ్ల గ్రామంలో ఓ మహిళపై దాడి జరిగిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. చెదుళ్లలో దళిత వర్గానికి చెందిన శ్రీదేవికి 15 ఏళ్ల క్రితం నరసింహారెడ్డితో ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో శ్రీదేవి చెదుళ్లలో అవ్వ ఇంట్లో ఉంటోంది. శ్రీదేవి సొంత పిన్ని అయిన నారాయణమ్మ, ఆమె కుమారులు కుళ్లాయప్ప, నారాయణలు శ్రీదేవి ఇంట్లో ఉన్న సామాన్లను బయటకు విసిరేశారు. పిల్లలను బయటకు ఈడ్చి కొట్టి గ్రామంలో ఉండడానికి వీల్లేదని బెదిరింపులకు పాల్పడ్డారు. అఽధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. -
●ఉండ్రాళ్లయ్యా.. క్షమించయ్యా
బుక్కరాయసముద్రం: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సాధారణ ప్రజలకే కాదు.. దేవుళ్లకూ నీటి కష్టాలు తప్పడం లేదు. బీకేఎస్ మండలం మీదుగా వెళ్తున్న హెచ్ఎల్సీలో ఈ సారి నీటి జాడ కరువైంది. కాలువకు నీరు వదలాలని ప్రజలు, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులు పాలకులను అనేకసార్లు కోరినా పట్టించుకోలేదు. దీంతో రైతులు, ప్రజలు సాగు,తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి రావడం, లంబోదరుడి విగ్రహాల నిమజ్జనానికి కూడా నీరు కరువవడంతో చేసేదిలేక వెంకటాపురం, దయ్యాలకుంటపల్లికి చెందిన ప్రజలు ఒట్టి కాలువలోనే వినాయకులను వదిలేసి వచ్చారు. ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదని, కనీసం వినాయక చవితికి అయినా కాలువకు నీరు వదలక పోవడం దారుణమని పలువురు మండిపడ్డారు. -
‘మత్తు’పై ఉక్కుపాదం మోపండి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం అనంతపురం అర్బన్: ‘‘మత్తు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి. గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోండి. మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించండి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ పి.జగదీష్‌తో కలిసి నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ (ఎన్కార్డ్) జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా ‘ఈగల్ క్లబ్‌లు’ క్రీయాశీలకంగా పనిచేయాలన్నారు. పాఠశాలల సమీపంలో గుట్కా, గంజాయి, ఇతర నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై సమాచారం సేకరించి పంపించాలన్నారు. జిల్లాలోని ప్రతి ఈగల్ క్లబ్‌కు ఒక మహిళ పోలీసు అధికారిని అనుసంధానం చేయాలన్నారు. ఆయా ఈగల్ క్లబ్‌లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బందితో నెలకోసారి పాఠశాలల్లో మాదకద్రవ్య వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ‘‘డ్రగ్స్ వద్దు బ్రో’’ పుస్తకాన్ని కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. సమావేశంలో ఏఎస్పీ నాగభూషణం, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీటీసీ వీర్రాజు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వలీబాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. హెచ్ఐవీ నియంత్రణపై దృష్టి సారించాలి హెచ్ఐవీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. తన చాంబర్లో వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. హెచ్ఐవీ ప్రభావిత ప్రాంతాలు, వర్గాలు, వృత్తిదారులను గుర్తించి పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎయిడ్స్ నియంత్రణాధికారి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గడువులోపు ‘సర్’ పూర్తి చేస్తాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను గడువులోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌కు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. సీఈఓ గురువారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు ఎస్పీ పి.జగదీష్, డీఆర్ఓ ఎ.మలోల పాల్గొన్నారు. చెత్త తొలగింపుపై ప్రత్యేక దృష్టి అనంతపురం న్యూటౌన్: జిల్లాలో బల్క్ చెత్త తొలగింపునకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జడ్పీ ఆవరణంలోని డీపీఆర్సీ మీటింగ్ హాలులో గురువారం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బల్క్ వేస్ట్ జనరేటర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. ే -
గంగజాడ కోసం అన్నదాతల పాట్లు
● 20 కిలో మీటర్ల నుంచి పైపులైన్లు ● చీనీచెట్లను కాపాడుకునేందుకు రైతుల కష్టాలు ● ట్యాంకర్ నీరు రూ.వెయ్యి పైమాటే .. యల్లనూరు: ఆరుగాలం శ్రమించి పంటలను సాగు చేసిన అన్నదాతలను పుట్టెడు దుఃఖాలు వెంటాడుతున్నాయి. సాగు చేసిన పంటలకు సైతం నీరు లేక నిట్టనిలువునా ఎండుతుంటే.... చేసేది లేక చీనీ, అరటి చెట్లను కొందరు రైతులు వదిలేసుకుంటున్నారు. కరువు విలయతాండవం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వంతో పాటు ఉద్యాన, వ్యవసాయ అధికారుల్లో చలనం లేదు. కనీసం ప్రభుత్వానికి నివేదికలను రాసి పంపితే పంట నష్టపరిహారం జాబితాలో చేర్చేందుకు కూడా ఉద్యాన అధికారులు ప్రయత్నించడం లేదు. 1400 అడుగుల్లో బోర్లు వేస్తున్నా... పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, బాలాపురం తదితర గ్రామాల్లో రైతులకు గంగజాడ కరువైంది. 1400 అడుగుల లోతులో బోర్లు వేస్తున్నా గంగజాడ దొరకడం లేదు. దీంతో చేసేదిలేక యల్లనూరు మండలం తిరుమలాపురం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బోరు వద్ద నుంచి ట్యాంకర్లతో నీటిని తరలిస్తూ చీనీ, దానిమ్మ, అరటి చెట్లను కాపాడుకుంటున్నారు. ఒక్కో ట్యాంకరుకు రూ.1000 కి పైగా ఖర్చు చేస్తున్నారు. వందల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేసిన అన్నదాతలకు నీరు కరువవడంతో నీళ్లకోసం రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. యల్లనూరు మండలం చిలమకూరు చిత్రావతి నదిలో పుట్లూరు గ్రామాల రైతులు బోర్లు వేసుకొని అక్కడి నుంచి పైపులైను సహాయంతో నీటిని తీసుకెళ్లేందుకు రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పుట్లూరు మండలానికి పుట్లూరు చెరువు, కోమటికుంట్ల చెరువులు, గండికోట నీరు వస్తే రైతులు కాస్త ఊపిరి పీల్చుకునేవారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి రైతుల కోసం పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు నీరు విడుదల చేయిస్తే సగం కష్టాలు గట్టెక్కుతామని పలువురు రైతులు చెబుతున్నారు. కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే నవంబర్‌లోపు పుట్లూరు, యల్లనూరు మండలాల భూములన్నీ బీడు భూములుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలమకూరు చిత్రావతి నది నుంచి కోమటికుంట్లకు రైతులు వేసుకుంటున్న పైప్‌లైన్ తిరుమలాపురం తోటల వద్ద పుట్లూరుకు ట్యాంకర్లతో నీటిని నింపుకుంటున్న వ్యాపారులు -
అసమర్థ ప్రభుత్వం.. పంట తొలగింపే శరణ్యం
విడపనకల్లు: మండల పరిధిలోని పొలికి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి తన 12 ఎకరాల్లో సాగు చేసిన మిరప పంటను గురువారం తొలగించాడు. గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జీబీసీ)కు సాగు నీరు వస్తాయనే ఆశతో నెల రోజుల క్రితం రూ.12 లక్షలు ఖర్చు చేసి వెంకటేశ్వరరెడ్డి మిరప సాగు చేశాడు. అయితే, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ సాగు నీరు విడుదల కాకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. దీంతో దిక్కుతోచని వెంకటేశ్వర రెడ్డి ట్రాక్టర్‌తో పంటను తొలగించాడు. ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటలకు కనీసం సాగు నీరు ఇవ్వలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. -
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
ఉరవకొండ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు నెలకొందని, ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి కలెక్టర్ ఆనంద్‌ను కోరారు. గురువారం అనంతపురంలోని కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసి ఆయనకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ రెండో వారం దాటినప్పటికీ తగినంత వర్షపాతం నమోదుకాక బోరుబావులు ఎండిపోతున్నాయన్నారు. వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భజలాలు పూర్తిగా అడుగంటే పరిస్థితి నెలకొందన్నారు. చాలా మంది రైతులు పంటలు సాగుచేసి వాటిని కాపాడుకోలేక అప్పుల పాలవుతున్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో పశువులకు మేత, తాగునీరు అందక కబేళాలకు తరలిస్తున్నారని చెప్పారు. కనీసం పశువుల దాహర్తి తీర్చడానికి జిల్లాలోని అన్నీ చెరువులను హంద్రీనీవా నీటితో నింపాలన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ అందేలా చూడాలన్నారు. బ్యాంకుల్లో రైతుల రుణాలన్నీ మాఫీ చేసి, వ్యవసాయ పనులు లేక అవస్థలు పడుతున్న వారికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. ప్రస్తుత పనిదినాలకు అదనంగా మరో 50 రోజులు పని కల్పించేలా చూడాలన్నారు. -
చోరీ ఘటనపై లోతుగా దర్యాప్తు
ఉరవకొండ: పట్టణ శివారు లత్తవరం రోడ్డు పక్కన నివాసముండే రైతు మాదినేని శ్రీనివాసులు ఇంట్లో బుధవారం రాత్రి జరిగిన భారీ చోరీ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం చోరీ జరిగిన ఇంటిని సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో పాటు డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీం బృందాలు తనిఖీ చేశారు. రైతు ఇంట్లో మంచం కింద ప్రత్యేకంగా బ్యాగులో దాచిన రూ.45 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు... దేవుడి గదిలో ఉంచిన రూ.2లక్షలు, మరో చోట ఉంచిన రూ.50వేలు చోరీ చేయకపోవడం పలు అనుమాలకు తావిస్తోంది. ఈచోరీ తెలిసిన వ్యక్తుల పనేనా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాదిత రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవలే తన పొలాన్ని రూ.60లక్షలకు విక్రయించిన డబ్బులో రూ.45లక్షలను తన కుమారుడి వివాహం, ఇంటి నిర్మాణం కోసం ఇంట్లో దాచిపెట్టుకోని ఉంటే దాన్ని చోరీ చేశారని వాపోయారు. ఉరేసుకున్న వ్యక్తి కర్ణాటక వాసి కూడేరు: మండల పరిధిలోని ఉదిరిపికొండ–శివరాంపేట గ్రామాల మధ్య అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తిని కర్ణాటక వాసిగా పోలీసులు గుర్తించారు. గురువారం మృతుడి వివరాలను పోలీసులు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని మొలకల్మూరు తాలుకా కొండపల్లికి చెందిన రుద్రప్ప, నాగలక్ష్మి దంపతుల కుమారుడు మైలాడి (25), కుమార్తె ఉన్నారు. వీరు ఈ నెల 9న ఉరవకొండ మండలం పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనార్థం వచ్చారు. మైలాడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఉదిరిపికొండ వైపు వచ్చాడు. కుటుంబ సభ్యులు అతని కోసం వెతికినా కనిపించలేదు. వారు ఉరవకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి స్వగ్రామానికి వెళ్లి పోయారు. ఆ తర్వాత మైలాడి చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు అతని భుజాలపై ఉన్న పచ్చబొట్టు అక్షరాల ఆధారంగా బళ్లారి పోలీసులకు సమాచారమివ్వగా వారి ద్వారా మృతుడి ఆచూకీ లభించడంతో మిస్టరీ వీడింది. -
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
● ఎస్పీ జగదీష్ అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో వినాయకుల శోభాయాత్ర, నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జగదీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో పోలీసు సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లు, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్ సర్వీస్ సిబ్బందిని నియమించామన్నారు. డీజేలకు అనుమతి లేదని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగజేయరాదన్నారు. మద్యపానం చేసి వేడుకల్లో పాల్గొనరాదన్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీసులు సూచించిన మార్గాల్లోనే శోభాయాత్రలు నిర్వహించి కమిటీ సభ్యులు, యువత సహకరించాలని కోరారు. ● 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు విగ్రహాలను ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని హంద్రీ–నీవా కాలువలో, అంత కంటే తక్కువ విగ్రహాలను అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి అక్కమ్మగార్ల గుడి వద్ద చెక్‌డ్యాంతో పాటు న్యూ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నిమజ్జనం చేయాలి. ● నిమజ్జనోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గుత్తి వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు గుత్తి రోడ్డులోని మిర్చి యార్డు నుంచి, తాడిపత్రి వైపు నుంచి వచ్చే బస్సులు ఎన్టీఆర్ మార్గ్ మీదుగా, కళ్యాణదుర్గం, బళ్లారి, రుద్రంపేట వైపు నుంచి వచ్చే బస్సులు తపోవనం, తడకలేరు, గుత్తి రోడ్డు నుంచి మిర్చియార్డు మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. ఇళ్ల స్థలాలు అడిగితే ఎమ్మెల్యే వేధిస్తున్నాడు ● శాసనసభ కమిటీ ఎదుట టీడీపీ నాయకుడు ఆవేదన అనంతపురం అర్బన్: ‘‘పార్టీ కోసం.. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపు కోసం పనిచేసినందుకు వేధింపులు, నాలుగు పోలీసు కేసుల రూపంలో సరైన బహుమతి ఇచ్చారు’ అంటూ శాసనసభ మైనారిటీల సంక్షేమ కమిటీ ఎదుట టీడీపీ మైనారిటీ నాయకుడు ఐఎంఎంబాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో కమిటీ చైర్మన్ మహమ్మద్ నసీర్ అహమ్మద్‌తో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు బయటకు తీసుకెళ్లారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో కమిటీకి బాషా వినతిపత్రం అంద జేసి పరిస్థితి వివరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి విజయం కోసం అలుపెరగకుండా పనిచేశానని చెప్పారు. అనంతరం మీడియాతో బాషా మాట్లాడారు. దగ్గుపాటి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే ముస్లిం మైనారిటీలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరగా ఆయన సరే అన్నారని, అయితే రెండున్నరేళ్లయినా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని వాపోయారు. ఇదే విషయంపై తమ వాళ్లు ఎక్కడపడితే అక్కడ నిలదీస్తున్నారని చెప్పారు. ఇళ్ల స్థలాల గురించి అడిగితే ఎమ్మెల్యే తనపై వ్యతిరేక ముద్రవేసి వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుకు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే తనపై నాలుగు కేసులు పెట్టారని ఆవేదన చెందారు. ఎం.కొండాపురం పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు అనంతపురం ఎడ్యుకేషన్: కళ్యాణదుర్గం మండలం ఎం.కొండాపురం గ్రామ పంచాయతీకి నీటి సమృద్ధి అంశం కింద ఐఎస్ఓ గుర్తింపు లభించింది. సమర్థవంతమైన నీటి నిర్వహణతో పాటు ప్రజలకు నీటి సదుపాయాలు కల్పించేందుకు పంచాయతీ చేపట్టిన చర్యలకు గుర్తింపు లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ కృష్ణతేజ చేతుల మీదుగా డిప్యూటీ ఎంపీడీఓ రంగనాయకులు, పంచాయతీ కార్యదర్శి లోకేష్ ఐఎస్ఓ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. -
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం రాయలసీమకు.. మరీ ముఖ్యంగా కరువుపీడిత ఉమ్మడి అనంతపురం జిల్లాకు శాపంగా మారింది. తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలు నేరుగా తీసుకుపోయేందుకు హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ వేయించారు. ఇలా చేయడం వల్ల కాల
ఆత్మకూరు/ కనగానపల్లి: ఉమ్మడి జిల్లాలోని ఉరవ కొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల మీదుగా హంద్రీ–నీవా కాలువ వెళ్తుంది. అయితే కాలువకు కాంక్రీట్‌తో లైనింగ్ చేయడం వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా కాలువలోకి మోటర్లు వేసి నీటిని పొలాలకు తీసుకుందామని ప్రయత్నిస్తే కేసులు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఫ్యాక్టరీలకు నీరు వదిలే ప్రభుత్వం.. పంటల సాగు ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే ఉపాధి కోసం వలస పోక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కంటతడి బోర్లల్లో నీళ్లున్నాయన్న ఆశతో చాలామంది రైతులు వరి నార్లు వేసుకుని, నాట్లుకూడా వేశారు. అయితే హంద్రీ– నీవా, పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా చెరువులకు నీరు ఇవ్వకపోవడంతో పరిస్థితి తారుమారైంది. ఓ వైపు ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చెరువులకు నీరు చేరడం లేదు. క్రమేణా భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలోంచి నీరు రావడం లేదు. దీంతో పైరు ఎండిపోతుండటంతో కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో రైతు కంటతడి పెడుతున్నాడు. నీరు లేక వ్యవసాయ భూములన్ని బీళ్లుగా మారుతున్నాయి. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే లక్ష ఎకరాల వరకు నీరందకుండా పోతోంది. తాగునీటికీ కష్టాలే హంద్రీ–నీవా కాలువతో పాటు పీఏబీఆర్ నుంచి కుడి కాలువ గుండా కూడా చెరువులు, కుంటలకు నీరు వదలటం లేదు. దీంతో గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. హంద్రీ–నీవా ద్వారా సాగునీటికి కాకుండా తాగునీటికి వదులుతామని చెప్పిన అధికారులు కనీసం ఈ ప్రాంతంలోని చెరువులు, నీటికుంటలకు కూడా నీరు ఇవ్వడం లేదు. దీంతో బోరుబావుల్లో నీరు రాక ప్రజలు తాగునీటి కష్టాలు పడుతున్నారు. కనగానపల్లి మండలం యలకుంట్ల వద్ద చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రెండు రోజుల క్రితం తాగునీటి కోసం హంద్రీ–నీవా కాలువ వద్ద తూమును ఎత్తి నీటిని సమీపంలోని వంకలోకి వదిలారు. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి నీటిని బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. హంద్రీ–నీవా కాలువలో పారుతున్న కృష్ణా జలాలు కాలువకు కాంక్రీట్ లైనింగ్‌తో పెరగని భూగర్భ జలాలు చెరువులు, కుంటలకు వదలని నీరు.. బీళ్లుగా మారుతున్న పొలాలు -
చెరువులకు తక్షణమే నీళ్లివ్వాలి
అనంతపురం ఎడ్యుకేషన్: తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో పంటలను కాపాడేందుకు చెరువులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా జిల్లాలోని చెరువులకు నీరు విడుదల చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 180 టీఎంసీల నుంచి 112 టీఎంసీలకు పడిపోయిందని తెలిపారు. అయినప్పటికీ 835 అడుగుల వరకు నీటిని డ్రా చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారని, పవర్ జనరేషన్ జరగని పరిస్థితుల్లో హంద్రీ–నీవాకు 3.5 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. శ్రీశైలం డ్యాంలో 854–840 అడుగుల మధ్య సుమారు 26 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సమయంలో వెలిగొండ, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నీటి విడుదల కొనసాగితే హంద్రీ–నీవాకు మరో 9 టీఎంసీల వరకు నీటిని తీసుకునే అవకాశం ఉందన్నారు. 840–830 అడుగుల మధ్య కూడా హంద్రీ–నీవా, కల్వకుర్తి, ముచ్చుమర్రి ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉందని, దీంతో మరో 4.5 టీఎంసీల వరకు హంద్రీ–నీవాకు నీరు పొందవచ్చన్నారు. ఈ లెక్కన ఇప్పటికీ శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా దాదాపు 17 టీఎంసీల నీటిని తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. ట్రయల్ రన్‌కే నీరు ఎందుకు? వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదని, ప్రధాన సొరంగం నిర్మాణం పూర్తయినా కాలువల వ్యవస్థ ఇంకా పూర్తి కావాల్సి ఉందని ప్రకాష్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్లో భాగంగా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితుల్లో, ఆ నీటిని తగ్గించి హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ద్వారా రాయలసీమ జిల్లాలకు మళ్లించాలని కోరారు. ఎండిపోతున్న పంటలు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో హంద్రీ–నీవా నీటిపై ఆధారపడిన చెరువులు ఉన్నాయని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. నీరు లేక చీనీ, అరటి, మిరప, టమాట తదితర పంటలు ఎండిపోతున్నాయని, భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు పంటలను వదిలేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేసి, అక్కడి నుంచి పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న 49 చెరువులకు నీటిని అందించాలని ప్రకాష్‌రెడ్డి కోరారు. హంద్రీ–నీవా కింద ఉన్న అన్ని చెరువులను వెంటనే నింపడంతో పాటు హంద్రీ–నీవా నుంచి పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం గురువారం హంద్రీ–నీవా సీఈ కార్యాలయం ఎదుట జలదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారని చెప్పారు. తొమ్మిది నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తారని వెల్లడించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీలు చియ్యేడు కృష్ణారెడ్డి, బోయ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి బండి పవన్, గోవిందరెడ్డి, నీరుగంటి నారాయణరెడ్డి, ఈశ్వరయ్య, పాపంపేట ప్రసాద్‌రెడ్డి, భానుకోట శివ, ఉప్పరపల్లి శీనా పాల్గొన్నారు. మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ నేడు హంద్రీ–నీవా సీఈ కార్యాలయం ఎదుట జలదీక్ష -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
అనంతపురం అర్బన్: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నవాటిని సత్వరం పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్ విషుణచరణ్తో కలిసి కలెక్టర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జంతులూరు నుంచి కొర్రపాడు వైపు ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం త్వరగా చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే అక్కడున్న పాత బోర్లను మినహాయించి జంతులూరులో ప్రజలకు నూతనంగా మూడు బోర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. యూనివర్సిటీ భూమి వివరాలను సమర్పించాలని బీకేఎస్ తహసీల్దార్ శ్రీధర్‌మూర్తిని ఆదేశించారు. సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కివాడే, ఫ్రొఫెసర్ హనుమాన్ కెనడి, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల దరఖాస్తు గడువు పెంపు అనంతపురం టౌన్: ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తుకు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బరితెగించిన టీడీపీ మూక ● వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటి సీసీ కెమెరాలు ధ్వంసం తాడిపత్రిటౌన్: టీడీపీ మూకలు బరితెగించాయి. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నాయకుడు విజయ్ ఇంటిపై దాడులకు దిగి.. సీసీ కెమెరాలను ధ్వంసం చేశాయి. దౌర్జన్యాన్ని ప్రశ్నించిన విజయ్ తల్లి లోకేశ్వరిపై దూషణలకు దిగింది. వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసపురంలోని పీర్లమాన్యంలో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు విజయ్.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుల బెదిరింపుతో తాడిపత్రిని వదిలి వెళ్లాడు. ప్రస్తుతం ఇంటి వద్ద విజయ్ తల్లి లోకేశ్వరి ఒంటిరిగా జీవిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి విజయ్ ఇంటి పైనున్న సీసీ కెమెరాలను అదే కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు తలారి చంద్ర, హరినాథరెడ్డి, పటాన్ నబీషా ధ్వంసం చేశారు. శబ్దం రావడంతో బయటకు వచ్చిన లోకేశ్వరి ఏమిటీ దౌర్జన్యమని ప్రశ్నించారు. అంతే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కులం పేరుతో దూషిస్తూ మీ బతుక్కు సీసీ కెమెరాలా.. నీ కొడుకు అంతు చూస్తాం. ల..ము.. అంటూ బెదిరించారు. బుధవారం ఉదయం లోకేశ్వరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఆరోహణరావుకు సీసీ ఫుటేజీలతో సహా ఫిర్యాదు చేశారు. నేడు, రేపు మైనారిటీల సంక్షేమ కమిటీ పర్యటన అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనారిటీల సంక్షేమ కమిటీ ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలో పర్యటించనుందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జి.రామసుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ చైర్మన్ మహమ్మద్ నసీర్ అహ్మద్‌తోపాటు సభ్యులు దగ్గుపాటి ప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి, బోడే ప్రసాద్, సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్, షాజహాన్ బాషా, సుందరపు విజయ్‌కుమార్, ఐజక్ బాషా పర్యటనలో పాల్గొంటారని పేర్కొన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్ హాలులో మైనారిటీలకు రిజర్వేషన్ల అమలుపై వీసీతో కమిటీ సమావేశమవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు గార్లదిన్నె ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మైనారిటీ నాయకులు, ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తుంది. అనంతరం సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేయనుంది. రాత్రి అనంతపురం స్టేట్ గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. శుక్రవారం జిల్లాలో మైనారిటీల ప్రయోజనం కోసం చేపట్టిన కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో కలెక్టరేట్లో కమిటీ సమావేశమవుతుంది. అనంతరం కమిటీ విజయవాడకు బయలుదేరి వెళుతుందని రామసుబ్బారెడ్డి వెల్లడించారు. -
బాలికల భద్రతకు భరోసా ఏదీ?
● పాఠాలు చెప్పాల్సిన చోట పాడు పనులు ● ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఘటనలు ● విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే కొందరు గాడి తప్పుతున్నారు. గురువు అంటే తల్లిదండ్రులతో సమానంగా గౌరవించే సమాజంలో.. అదే గురువు స్థానాన్ని అడ్డుపెట్టుకుని కొందరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వస్తుండటం కలవరపెడుతోంది. ఇటీవల కళ్యాణదుర్గం, గార్లదిన్నె అంతకుముందు పామిడి, యల్లనూరు.. ఇలా జిల్లాలో వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు ‘పాఠశాలల్లో పిల్లలకు భద్రత ఉందా?’ అన్న ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. నలుగురు ఉపాధ్యాయులపై చర్యలు కళ్యాణదుర్గం పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో తెలుగు ఉపాధ్యాయుడు రామచంద్రనాయక్‌ను విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. గార్లదిన్నె మోడల్ పాఠశాలలో భౌతికశాస్త్రం బోధించే పీజీటీ చింతా నారాయణ విద్యార్థినులతో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడనే ఫిర్యాదుపై అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా ఆయన్ను సస్పెండ్ చేశారు. పామిడి మండలం అప్పాజిపేట ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు యాదవ్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిని లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. యల్లనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు సస్పెండ్ చేశారు. ‘సస్పెన్షన్’తో కథ ముగియకూడదు బాలికల భద్రత విషయంలో ‘ఘటన జరిగింది.. సస్పెండ్ చేశాం’ అనే విధానం కాకుండా శాశ్వత పరిష్కారంపై విద్యాశాఖ దృష్టి పెట్టాలి. ప్రతి పాఠశాలలో బాలికలు నిర్భయంగా ఫిర్యాదు చేసే వ్యవస్థను బలోపేతం చేయాలి. విద్యార్థులతో క్రమం తప్పకుండా భద్రత, మంచి–చెడు స్పర్శ, ఫిర్యాదు మార్గాలపై అవగాహన కల్పించాలి. ఆరోపణలు, ఘటనలపై నిష్పక్షపాతంగా విచారించి, నిజమని తేలితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. పాఠశాల గేటు దాటిన ప్రతి బాలిక సురక్షితంగా ఇంటికి చేరుతుందన్న నమ్మకాన్ని తల్లిదండ్రులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గురువు చేతిలో పుస్తకం ఉండాలి.. పిల్లల భవిష్యత్తును మలిచే బాధ్యత ఉండాలి.. భయపెట్టే ప్రవర్తనకు, వికృత చేష్టలకు మాత్రం చోటుండకూడదు. ఇది ఒక్కో పాఠశాల సమస్య కాదు.. పిల్లల భద్రతకు సంబంధించిన సామాజిక సమస్య. వరుస ఘటనల నేపథ్యంలో ఇప్పటికై నా విద్యాశాఖ మేల్కొని కఠినమైన పర్యవేక్షణ, స్పష్టమైన బాధ్యత, వేగవంతమైన చర్యలతో బాలికలకు భద్రత కల్పించాలి. -
సంక్షేమ పథకాలన్నీ టీడీపీ వారికేనా?
● ‘దిశ’ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ నిలదీత అనంతపురం న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అధికార టీడీపీ వారికి మాత్రమే అమలు చేయడమేంటని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ నిలదీశారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్సీ హాలులో బుధవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ‘దిశ’ కార్యదర్శి కలెక్టర్ ఆనంద్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, సీఈఓ విజయలక్ష్మి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కేవలం టీడీపీ వారికే అన్న భావనకు తావిస్తోందన్నారు. ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని అధికారులకు హితవు చెప్పారు. కొత్త పింఛన్ల మంజూరు అధికార పార్టీ వారికే ఉంటుందని ప్రకటించడం సమంజసం కాదన్నారు. అలవికాని నిబంధనలతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఒంటరి మహిళ, దివ్యాంగుల ఎంపికలో అమలు చేస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉందని ఆమె సభ దృష్టికి తెచ్చారు. ఎల్–నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రోత్సాహకాలు లేకపోవడంతో డ్వాక్రా రుణాలు తీసుకోవడానికి మహిళలు సుముఖంగా లేరన్నారు. తోటలను ఎలా కాపాడుతారు? దిశ కమిటీ చైర్మన్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎల్–నినో పరిస్థితుల నేపథ్యంలో ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడటానికి ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయా అంటూ హార్టికల్చర్ అధికారిని ప్రశ్నించారు. ఏదో సమాధానం చెప్పబోతుంటే.. దిశ కార్యదర్శి, కలెక్టర్ జోక్యం చేసుకున్నారు. ‘కాలువ నీటితో చెరువులను నింపితే భూగర్భ జలం పెరిగి.. బోరు బావుల్లో నీరు వస్తుందం’టూ సమాధానం చెప్పకుండా వినూత్నంగా మీరు ఏమైనా తోటలు ఎండిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారా అని సూటిగా ప్రశ్న సంధించారు. చర్యలు తీసుకోవాల్సిన ఉన్నత స్థాయి అధికారి, ప్రజాప్రతినిధి ఈ విధమైన ప్రశ్నలు రావడంతో ఉద్యాన శాఖ అధికారి మౌనం దాల్చారు. -
జీజీహెచ్‌కు ఎక్స్‌రే యంత్రం వితరణ
అనంతపురం సిటీ: జిల్లా సర్వజనాస్పత్రికి శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద ఉన్న మోబిస్ ఇండియా మోడ్యూల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేయూతనందించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అత్యంత ఖరీదైన స్కాన్మొబైల్ డీఆర్ లైట్ ఎక్స్‌రే పరికరాన్ని వితరణ చేసింది. ఈ యంత్రం పనితీరును మోబిస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యాంగ్యోంగ్–డ్యూక్, హెచ్ఆర్జీఏ విభాగాధిపతి పి.ఎన్.శ్రీనివాస్, కంపెనీ సీఎస్ఆర్ ఇన్చార్జ్, ప్రముఖ న్యాయవాది సింధూజ పరిశీలించి, బుధవారం జీజీహెచ్ రేడియాలజీ విభాగానికి అందజేశారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ మోబిస్ కంపెనీ అందించిన స్కాన్మొబల్ డీఆర్ లైట్ ఎక్స్‌రే పరికరం హై ఫ్రీక్వెన్సీతో మంచి పనితీరును కనబరుస్తుందన్నారు. గ్రామ కదలలేని స్థితిలో మంచంపై ఉన్న రోగులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. క్యాజువాలిటీ ఎమర్జెన్సీ, ఏఎంసీయూ విభాగాల్లో ఈ యంత్రం సేవలను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ పరిపాలన అధికారి, డిప్యూటీ కలెక్టర్ వి.మల్లికార్జునరెడ్డి, జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలలో మంటలు
గుంతకల్లు: స్థానిక హనుమేష్‌నగర్‌లో వైవీఆర్ క్యాంపు కార్యాలయం సమీపంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో బుధవారం మంటలు చెలరేగాయి. ఉదయం పాఠశాల స్టోర్ రూమ్ నుంచి పొగలు రావడం గుర్తించిన స్థానికులు వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డికి తెలియజేశారు. ఆమె వెంటనే ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే స్టోర్‌రూమ్‌లోని డస్ట్బిన్లు, పాత పుస్తకాలు, ఫర్నీచర్ కాలి బూడిదయ్యాయి. ఇటీవల పాఠశాల సమీపంలో రాత్రి పూట గంజాయి బ్యాచ్, ఆకతాయిలు తిరుగుతున్నారు. వారే స్టోర్ రూమ్‌కు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. గదిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌కు ఆస్కారమే లేదన్నారు. పోలీసులు రాత్రి గస్తీ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆటో దగ్ధం గుత్తి రూరల్: మండలంలోని చెర్లోపల్లి శివారులో సేవాగఢ్ క్రాస్ వద్ద బుధవారం 67వ నంబర్ జాతీయ రహదారిపై మంటలు చెలరేగి సీఎన్జీ ఆటో దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుత్తి నుంచి ప్రయాణికులతో ఆటో గుంతకల్లుకు బయలుదేరింది. సేవాగఢ్ క్రాస్ వద్ద ఆటోలో నుంచి మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ ఆటోను రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులతో కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అదుపు కాలేదు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏడీఎఫ్‌ఓ అశ్వర్థ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. గుంతకల్లు నుంచి సంఘటన స్థలానికి అగ్ని మాపక వాహనం వచ్చేలోగా ఆటో మంటల్లో దగ్ధమైంది. రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత ఆటో డ్రైవర్ రాముడు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం ● పోలీసుల ప్రాథమిక నిర్ధారణ బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురం గ్రామం వద్ద అనంతపురం– తాడిపత్రి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును 120 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు గుర్తించారు. కారును శ్రీధర్‌రెడ్డి నడపగా, ముందు భాగంలో వినయ్‌కుమార్, మధ్య సీట్లలో హరిత, నవనీత కూర్చున్నారు. ముందుభాగంలోని ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో వినయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మధ్యలోని ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఓపెన్ అయినా ఎడమవైపు డోరు తెరచుకోవడం, కారు నుంచి హరిత కింద పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తలకు బలమైన గాయాలైన నవనీతను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు, ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ‘కౌశలం’ను సద్వినియోగం చేసుకోండి అనంతపురం అర్బన్: కౌశలం ప్లేస్మెంట్ డ్రైవ్‌లో పిలుపు అందుకున్న యువత ఈనెల 18న జరగనున్న ఇంటర్వ్యూకి హాజరై సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీఐ, డిప్లోమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. కౌశలం అసెస్మెంట్ పరీక్షను సంబంధిత స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల్లో పూర్తి చేసి ప్లేస్మెంట్ కాల్ అందుకున్న అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. అర్హులైన వారికి ఇప్పటికే సమాచారం అందించారన్నారు. ఉద్యోగ వివరాలిలా.. ఉద్యోగం: ల్యాప్‌టాప్ అసెంబ్లింగ్, ప్రొడెక్షన్ అసోసియేట్ కంపెనీ: ఏవీఎస్ఏఆర్ హెచ్ఆర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పని ప్రదేశం: శిక్షణ డిగ్జాన్–పాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, కాంచీపురం, తమిళనాడు వేతనం: రూ.2.18 లక్షల నుంచి రూ.2.30 లక్షలు (ఏడాదికి) -
‘ఉపాధి’ నిధులు మింగేశారు!
కుందుర్పి: మండలంలోని తెనగల్లు గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. మాజీ సర్పంచ్ చెన్నరాయుడు, ఆయన భార్య, మాజీ ఎంపీటీసీ గవిసిద్ద భార్య కమలమ్మ, గత ఏడాది పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్ రాధమ్మ భర్త శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు వెంటేశులు భార్య కవిత, కల్యాణ్ భార్య దీపతో పాటు మరో 56 మంది 2 నెలలుగా ఒక్క రోజు కూడా పనులకు వెళ్లకున్నా ఖాతాల్లో బిల్లులు జమయ్యాయి. మొత్తంగా రూ.8 లక్షలు అక్రమంగా జమైనట్లు తెలుస్తోంది. దీనిపై మండల వైఎస్సార్సీపీ నాయకులు, తెనగల్లు గ్రామస్తులు బుధవారం ఆ శాఖ పీడీ సలీంతో పాటు స్థానిక ఎంపీడీఓ లక్ష్మీశంకర్‌కు ఫిర్యాదు చేశారు. బోగస్ బిల్లులను రికవరీ చేయని పక్షంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎంపీడీఓ లక్ష్మీశంకర్ మాట్లాడుతూ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు బోగస్ బిల్లులను రికవరీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగరాజు, మండల కన్వీనర్ రాయుడు, వాల్మీకి మాజీ డైరెక్టర్ పాలాక్షి, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు వన్నూర్రెడ్డి, సర్పంచులు తిప్పేస్వామి, లింగప్ప, చేనేత విభాగం డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ లింగప్ప, దివాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. సిడిమాను ఉత్సవం
రాయదుర్గంటౌన్: పట్టణంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం సిడిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కోటలోని మారెమ్మ ఆలయం, నేసేపేటలోని దండుమారెమ్మ, కొల్లాపురమ్మ ఆలయాల వద్ద సిడిమానుకు యువకుడిని కట్టి తిప్పారు. దుగ్గిలమ్మ జాతర మరుసటి రోజు సిడిమాను ఉత్సవం నిర్వహించడం ఆచారం. కోటమారెమ్మ ఆలయం వద్ద జరిగిన ఉత్సవానికి రాయదుర్గం నియోజకవర్గంతోపాటు సరిహద్దు కర్ణాటకలోని గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు. సాయంత్రం 6 గంటలకు సిడికి యువకుడిని కట్టి మూడుసార్లు తిప్పారు. సిడిమానుకు భక్తులు అరటిపండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. -
ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు రిక్తహస్తం
అనంతపురం: అధికారం చేపట్టి 28 నెలలు గడిచినా ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం రిక్తహస్తం చూపుతోందని మాజీ మేయర్ వసీం, వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా భేగ్ విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మైనార్టీ ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్ష అందిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. మసీదుల అభివృద్ధి, మౌజమ్, ఇమామ్‌లకు జీతాల పెంపు, 50 ఏళ్లకే పింఛన్, ఈద్గా స్థలాలు, శ్మశాన వాటికలకు కాంపౌండ్ వాల్, నూర్ బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు, వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ తదితర హామీలు అటకెక్కించారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కితే, ముస్లిం మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పర్యటించనున్న లెజిస్లేచర్ కమిటీ మైనార్టీల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. గుంతకల్లు ప్రాంతంలో మైనార్టీ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టల్ భవన పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయని, అలాంటి భవనాన్ని ఇతర పాఠశాల అవసరాలకు ఉపయోగించడం సముచితం కాదన్నారు. అనంతపురంలో గతంలో మైనార్టీ స్కూల్, జూనియర్ కాలేజ్, హాస్టల్ నిర్మాణం కోసం రూ.32 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ పనులు వేగవంతం కాలేదన్నారు. మైనార్టీ హాస్టల్ స్థానంలో నూతన భవనాలను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఇషాక్, రహంతుల్లా, నాయకులు ఖాదర్, ఏ1 రఫీ, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. -
పండుగ పూట విషాదం
శింగనమల: వినాయక చవితి పండుగను ఆనందంగా చేసుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా విషాదం నిండింది. రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. డ్యాన్స్ చేస్తూ షాక్‌కు గురై.. శింగనమల మండలంలోని లోలూరు కురుబ కాలనీలో యువకులు వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం రాత్రి యువకులు, కుటుంబ సభ్యులు నృత్యాలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. డ్యాన్స్ చేస్తున్న నాగలింగ కుమారుడు ప్రతాప్ (20)కు వినాయక మండపానికి తీసుకున్న విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై కిందపడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ప్రతాప్ మృతి చెందాడు. నాగలింగకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒక్కొగానొక్క కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. హెచ్చెల్సీలో యువకుడి గల్లంతు బొమ్మనహాళ్: వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ఓ యువకుడు హెచ్చెల్సీలో గల్లంతైన ఘటన బుధవారం సాయంత్రం ఎల్బీ నగర్ గ్రామ శివారులోని గొడిసెలపల్లి రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్ఐ నబీరసూల్ తెలిపిన మేరకు.. ఉప్పరహాళ్ క్రాస్ వద్ద నివాసం ఉంటున్న శీనా కుమారుడు సాయిభరత్ (22) గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్నాడు. అందరూ కాలువలో స్నానం చేస్తుండగా సాయిభరత్ కూడా దూకాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్థానికులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. ప్రతాప్ (ఫైల్), నిమజ్జన వేడుకల్లో సాయిభరత్ (వృత్తంలో) వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి శింగనమల మండలం లోలూరులో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి బొమ్మనహాళ్ మండలం ఉప్పరహాళ్ క్రాస్ వద్ద హెచ్చెల్సీలో యువకుడి గల్లంతు -
ఆశలు.. అడియాసలు
గుంతకల్లు రూరల్: రెండు నెలలు గడుస్తున్నా చినుకు నేల రాలకపోవడం, మండే ఎండలు వెరసి సాగు చేసిన పంటలు క్రమంగా ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన సింగరాయ సుంకన్న అనే రైతు బుధవారం తన పొలంలో సాగు చేసిన వేరుశనగ పంటను దున్నేశాడు. రెండు నెలల క్రితం రూ.1.12 లక్షల వ్యయంతో బయటి మార్కెట్లో 8 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేసి బోరు కింద ఐదెకరాల్లో పంట సాగు చేపట్టాడు. ఎరువులు, క్రిమి సంహారక మందులు తదితర వాటి కోసం అదనంగా మరో రూ.30 వేలు ఖర్చు చేశాడు. పంట సాగు చేపట్టిన నాటి నుంచి చినుకు జాడ లేకపోవడం, మండే ఎండలు తోడవడంతో భూగర్భ జలాలు తగ్గి ఉన్న రెండు బోర్లలోనూ నీరు ఇంకిపోయింది. దీంతో సాగు చేసిన పంట క్రమంగా ఎండిపోతోంది. వర్షం కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూసిన రైతు సుంకన్న విసిగిపోయి చివరకు బుధవారం పంటను తొలగించాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పు చేసి మరీ సాగు చేపడితే చివరకు ఏమీ మిగల్లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతులు అతలాకుతలమవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. రైలు పట్టాలపై ఫిష్‌ప్లేట్ ఉంచిందెవరు? తాడిపత్రి రూరల్: రైల్వేట్రాక్‌పై అనుమానాస్పదంగా ఫిష్‌ప్లేట్ కనిపించిన ఘటనపై పోలీసు కేసు నమోదైంది. అప్‌గ్రెడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని బుగ్గ గ్రామం నుంచి జూటూరు వరకు గూడ్స్ ద్వారా ముడి సరుకుల రవాణా కోసం అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ రైల్వేలైన్ వేయించింది. ఈ నెల 14న సాయంత్రం ముడి సరుకుతో ఫ్యాక్టరీ నుంచి గూడ్స్ రైలు వెళుతుండగా, పట్టాలపై ఫిష్‌ప్లేట్ (రైల్వే ట్రాక్‌లో రెండు పట్టాల చివరలను కలపడానికి, బిగించడానికి ఉపయోగించేది) కనిపించింది. లోకోపైలట్ అప్రమత్తమై అత్యవసర బ్రేకులు వేసినా గూడ్స్ బండి ఫిష్‌ప్లేట్‌ను ఢీకొని 10 మీటర్ల వరకు లాక్కెళ్లింది. ఘటనపై అప్‌గ్రెడ్ పోలీసుస్టేషన్లో అల్ట్రాటెక్ కంపెనీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రామక్రిష్ణారావు ఫిర్యాదు చేశారు. ఫిష్‌ప్లేట్‌ను ఎవరైనా కావాలనే ఉంచారా..? అనే కోణంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వివాహిత అనుమానాస్పద మృతి డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): మండలంలోని మురడి గ్రామంలో సంధ్య (22) అనే వివాహిత బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన మేరకు.. శెట్టూరు మండలం మంగంపల్లికి చెందిన సంధ్యకు మురడి గ్రామానికి చెందిన తిప్పేస్వామితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. బుధవారం రాత్రి సంధ్య ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే భర్త తిప్పేస్వామి, అత్తామామలు, బంధువులు, స్థానికుల సహకారంతో ఆమెను రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
ఆధిపత్యపోరులో అంతమొందించారు
గుంతకల్లు: ట్రాన్స్జెండర్ల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు దారుణహత్యకు గురయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజూమున గుంతకల్లులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మస్తాన్పేట్లోని రెడ్ ట్యాంక్ వద్ద మూడు రోజుల క్రితం వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ప్రారంభోత్సవానికి అపర్ణ అనే ట్రాన్స్ జెండర్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. చిత్ర అనే మరో ట్రాన్స్‌జెండర్ సన్నిహితుడిగా ఉన్న బోయ వీరేష్ ఇది జీర్ణించుకోలేక ఫ్లెక్సీలను చించేశాడు. ఆ సమయంలో చిన్నపాటి గొడవ జరి గింది. వాస్తవానికి చిత్ర, అపర్ణ మధ్య కొన్నినెలలుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం అపర్ణ వర్గం ర్యాలీ కూడా నిర్వహించింది. ఇదిలా ఉండగా.. అపర్ణ వర్గానికి చెందిన వికాష్ తన స్నేహితుడితో కలిసి మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో బెంచికొట్టాల సమీపంలోని బోయ వీరేష్ ఇంటి మీదుగా ద్విచక్రవాహనంలో వెళ్తుండగా.. వారిని వీరేష్ అడ్డుకున్నాడు. వాదనకు దిగి గొడవ పెట్టుకున్నాడు. వికాష్పై వీరేష్‌తో పాటు పలువురు దాడి కూడా చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన వికాష్ తన స్నేహితులు, బంధువులతో కలసి బుధవారం తెల్లవారుజూమున మూడు గంటల సమయంలో వీరేష్ ఇంటిపై దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న వీరేష్ తమ్ముడు చరణ్ అలియాస్ జగన్ ప్రతిదాడికి యత్నించాడు. ఈ క్రమంలో వికాష్ సమీప బంధువులు చరణ్‌ను కొడవలితో నరికారు. మెడపై, తలపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే వీరేష్ తలపై దాడి చేయడంతో బలమైన గాయమైంది. వీరితో పాటు వికాష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరేష్‌ను మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలించగా, వికాష్‌ను కర్నూలుకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై వన్‌టౌన్ సీఐ మనోహర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ● హత్యకు గురైన చరణ్ రాడ్ బెండింగ్ కూలీగా పని చేసేవాడు. భార్య ఐశ్వర్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను గతంలో వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. హత్యకు గురైన చరణ్ అలియాస్ జగన్ (ఫైల్) చరణ్ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, బంధువులు ట్రాన్స్జెండర్ల మధ్య వర్గపోరు ఇరువర్గాల ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
పీఈటీ కుటుంబానికి రూ.3.11 లక్షల సాయం
అనంతపురం ఎడ్యుకేషన్: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) సి.మనోజ్‌కుమార్ కుటుంబానికి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అండగా నిలిచింది. సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ.3,11,786 ఆర్థిక సాయం అందజేశారు. డీఎస్సీలో పాఠశాల సహాయకుడు (వ్యాయామ విద్య)గా ఎంపికై గుత్తి మండలంలోని ఏపీఆర్డబ్ల్యూఆర్ సేవాగఢ్ పాఠశాలలో చేరిన మనోజ్‌కుమార్ (26) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిన్న వయసులోనే తోటి ఉపాధ్యాయుడిని కోల్పోవడం బాధాకరమని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. మనోజ్‌కుమార్ కుటుంబాన్ని తమ సొంత కుటుంబంగా భావించిన జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. ఈ మేరకు సేకరించిన రూ.3,11,786 చెక్కును జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆయ్యూబ్ హుస్సేన్ చేతుల మీదుగా బుధవారం మనోజ్‌కుమార్ తండ్రి సి.మద్దిలేటికి అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఇ.సిరాజుద్దీన్, కోశాధికారి జి.జగదీశ్వరయ్య, ఉపాధ్యక్షురాలు కె.సమీరా, సంయుక్త కార్యదర్శి ఎ.జ్యోతి, సభ్యులు గట్టు నాగరాజు, కుమారరాజు, సత్యనారాయణ, రమేష్‌బాబు, నాగరాజు, ముస్తఫా, నందకుమార్, శకుంతల, కోటప్ప, రాణి పాల్గొన్నారు. -
అనంతపురంలో కారు బీభత్సం
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద టాటా సఫారీ కారు అదుపుతప్పి ఓ హోటల్లోకి దూసుకెళ్లి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అనంతపురం–తాడిపత్రి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో స్నేహితులు హరిత (20), నవనీత(20) మృతి చెందారు. వీరిద్దరు ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సులుగా పనిచేస్తున్నారు. గుత్తి మండలానికి చెందిన రామాంజనేయులు,సాలమ్మల కుమార్తె హరిత (20) అనంతపురంలోని ఓ నర్సింగ్ కళాశాల మూడో సంవత్సరం చదువుతూ త్రిపుర ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. తాడిపత్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన నారాయణస్వామి, విజయ దంపతుల కుమార్తె నవనీత(20) కూడా త్రిపుర ఆస్పత్రిలోనే నర్సుగా పని చేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరు స్నేహితులయ్యారు. ఇద్దరు ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. దుర్ఘటన జరిగిందిలా...: సోమవారం రాత్రి వీరు తమ స్నేహితులైన త్రిపుర ఆస్పత్రి ల్యాబ్‌లో పనిచేసే వినయ్ కుమార్, ఆస్పత్రిలో బీమా విభాగంలో పనిచేసే శ్రీధర్‌రెడ్డితో కలిసి టాటా సఫారీ (ఏపీ40ఈజెడ్1611)లో బయటకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా రోటరీపురం సమీపంలోని ప్లై ఓవర్‌పై స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా శ్రీధర్రెడ్డిరెడ్డి అతివేగంగా కారు నడపడంతో అదుపుతప్పిన కారు సమీపంలోని హోటల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిపోయింది. హరిత అక్కడికక్కడే మృతి చెందగా, నవనీత, శ్రీధర్‌రెడ్డి, వినయ్ కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవనీత మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వినాయక వైభవం
అనంతపురంలోని కమలానగర్లో పంచముఖ గణపతి రాయదుర్గంలో వినాయకునికి కరెన్సీ హారం తాడిపత్రిలో పర్యావరణ వినాయకుడువినాయక చవితిని పురస్కరించుకుని జిల్లా అంతటా బొజ్జగణపయ్య కొలువుదీరాడు. వేడుకలలో రెండో రోజు మంగళవారం ప్రత్యేక పూజలు, అన్నదానాలు, ప్రసాదాల పంపిణీ జరిగింది. గజాననుడి జన్మవృత్తాంతంతో పాటు పలు ఘట్టాలను తెలిపే విధంగా రూపుదిద్దుకున్న విగ్రహాలు.. చెడు వ్యవసనాలకు బానిసైతే జీవితాలు నాశనమవుతాయని తెలిపి జాగరూకతం చేసే ప్రతిమలు.. సమాజ హితోపదేశంతో ఆలోచింపజేసే విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినాయక మంటపాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. – అనంతపురం కల్చరల్ -
జొన్నల పంపిణీకి చర్యలు
అనంతపురం అగ్రికల్చర్: ప్రత్యామ్నాయ విత్తనాల కింద జొన్నలు పంపిణీ చేయడానికి వీలుగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ నేతృత్వంలో మంగళవారం కలెక్టరేట్ మినీకాన్ఫరెన్స్ హాలులో పర్చేజ్ కమిటీ సమావేశమై చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీడ్స్ ద్వారా ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ జరుగుతున్నా.. జాబితాలో జొన్నలు లేనందున... జిల్లా స్థాయిలోనే విత్తనాల ధరలు నిర్ణయించే అంశంపై సమావేశం నిర్వహించారు. జొన్నలతో పాటు సజ్జలు కూడా 80 శాతం రాయితీతో రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో వ్యవసాయశాఖ, మార్కెటింగ్, శాస్త్రవేత్తలతో పాటు పలు విత్తన కంపెనీలతో ధరల ఖరారుపై సమాలోచనలు చేశారు. విత్తన జొన్నలు కిలో రూ.220 ప్రకారం, సజ్జలు కంపెనీలను బట్టి రూ.250 నుంచి 300 వరకు ప్రతిపాదించారు. కమిటీలో ప్రతిపాదించిన ధరలను కమిషనరేట్‌కు పంపి అనుమతులు రాగానే 80 శాతం రాయితీతో పంపిణీకి చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. బైక్ రేసింగ్‌లో తాడిపత్రి యువకుడి సత్తా తాడిపత్రిటౌన్: ఈ నెల 12, 13 తేదీల్లో జరిగిన జాతీయస్థాయి బైక్ రేసింగ్ పోటీల్లో తాడిపత్రి యువకుడు హర్ష సత్తా చాటి ద్వితీయస్థానంలో నిలిచాడు. గన్నెవారిపల్లి కాలనీకి చెందిన గోపాల్, వరలక్ష్మి దంపతుల కుమారుడైన హర్ష తాడిపత్రిలోని సాయి విజేత స్కూల్లో పదవ తరగతి వరకు చదివి, ఇంటర్ విజయవాడలోని శ్రీచైతన్యలో పూర్తి చేశాడు. 2022లో బెంగళూరులో బీటెక్ చదువుతూనే 2024 నుంచి చైన్నెలోని ఆర్ఏసీఆర్లో బైక్ రేసింగ్ శిక్షణ పొందాడు. జాతీయ స్థాయిలో బైక్ రేసింగ్‌లో ప్రతిభ కనబరిచిన హర్షను తల్లిదండ్రులతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. పేలుడు సామగ్రి స్వాధీనంపెద్దవడుగూరు : పేలుడు సామగ్రిని నిల్వ ఉంచి అక్రమంగా విక్రయిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 2,500 డిటోనేటర్లు పట్టుబడినట్లు ఎస్ఐ రాఘవేంద్రప్ప తెలిపారు. కొండుపల్లి చుట్టూ నిర్వహిస్తున్న మైనింగ్ గనుల్లో యజమానులు అనుమతులతో కూడిన అనుభవజ్ఞులతో పేలుళ్లు జరపడానికి డిటోనేటర్లను వినియోస్తున్నారు. అయితే కొండుపల్లికి చెందిన రంగస్వామి, యాడికి మండలానికి చెందిన బ్లాస్టర్ రాంభూపాల్‌రెడ్డి అనే వ్యక్తులు అక్రమాలకు తెగబడి కొండుపల్లి సమీపంలోని వశీమ్రాజా మినరల్స్‌లో పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు మంగళవారం దాడి చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఉమ్మడి ‘స్థానిక’ పోలింగ్ కేంద్రాలు 2,741 అనంతపురం న్యూ టౌన్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో ఓటర్లు తమ ఓట్లను వేసేందుకు పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి వెల్లడించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రజల సమాచార నిమిత్తం జిల్లా పరిషత్ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 63 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల పరిధిలో 2,741 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు. అనంతపురం జిల్లాలోని 31 మండలాలకు గాను 1,507 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా శ్రీసత్యసాయి జిల్లాలోని 32 జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల్లో 1,234 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ మొత్తం 2,741 పోలింగ్ స్టేషన్ల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25,18,110 మంది ఓటర్లు 63 మంది జిల్లా ప్రాదేశిక సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. -
‘తల్లి’డిల్లిన హృదయాలు
బుక్కరాయసముద్రం/తాడిమర్రి:అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వారి జీవితం ఆనందంగా సాగిపోవాలని ఆకాంక్షించారు. అలాంటి ‘ఆశల దీపాలు’ ఒక్కసారిగా ఆరిపోయాయని తెలుసుకున్న ఆ హృదయాలు ‘తల్లి’డిల్లిపోయాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బిడ్డలు కళ్ల ముందే విగతజీవులుగా పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాయి. గుండెలవిసేలా రోదించాయి. వారి ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద అనంతపురం–తాడిపత్రి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కన్నవాళ్లకు తీరని శోకం మిగిల్చింది. ఇద్దరూ నర్సులే గుత్తి మండలానికి చెందిన రామాంజనేయులు, సాలమ్మల కుమార్తె హరిత (20) అనంతపురంలోని ఓ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుకుంటూ త్రిపుర ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఇదే ఆస్పత్రిలో తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన నారాయణస్వామి, విజయ దంపతుల కుమార్తె నవనీత (20) కూడా నర్సుగా పని చేస్తోంది. వీరివురూ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నారు. త్రిపుర ఆసుపత్రిలోనే ల్యాబ్‌లో పనిచేసే వినయ్ కుమార్, ఆస్పత్రిలోని ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేసే శ్రీధర్ రెడ్డిలు హరిత, నవనీతతో స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. సోమవారం రాత్రి టాటా సఫారీ వాహనంలో శింగనమలకు వచ్చిన నలుగురూ తిరిగి మంగళవారం తెల్లవారుజామున అనంతపురానికి బయలు దేరారు. కారు నడుపుతున్న శ్రీధర్ రెడ్డి మార్గమధ్యంలోని రోటరీపురం గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్‌పై స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా అతివేగంగా వెళ్లడంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కల చెట్లను ఢీకొన్న అనంతరం ఓ హోటల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన హరిత అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీకేఎస్ సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన నవనీత, శ్రీధర్ రెడ్డి, వినయ్ కుమార్‌ను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవనీత మృతి చెందింది. మా బిడ్డలను చంపేశారు.. ప్రమాద వార్త తెలుసుకున్న హరిత, నవనీత తల్లులు విజయ, సాలమ్మతో పాటు వారి బంధువులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న కుమార్తెల మృతదేహాల వద్ద గుండెల విసేలా రోదించారు. తమ బిడ్డలకు శ్రీధర్ రెడ్డి, వినయ్‌కుమార్‌లు మాయ మాటలు చెప్పి హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్లి చంపేశారని ఆరోపించారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఘటనపై బీకేఎస్ సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో రోదిస్తున్న యువతుల తల్లులు భీతావహంగా మారిన ఘటనాస్థలి, చిత్రంలో హరిత మృతదేహం నిడిగల్లులో విషాదం నవనీత మృతితో తాడిమర్రి మండలంలోని నిడిగల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న కుమార్తె మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు. వైఎస్సార్ సీపీ నాయకులు మదమంచి మల్లికార్జున నాయుడు, గుజ్జల హనుమంతులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సుల దుర్మరణం అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డల మృతితో హతాశయులైన కన్నవారు మృతదేహాల వద్ద కన్నీరు మున్నీరైన తల్లులు -
‘తెలుగు మహిళ’పై టీడీపీ నేత దాడి
● ఇంటి స్థలం వివాదంలో ఘటన ● అసభ్యపదజాలంతో దూషిస్తూ జుట్టుపట్టుకుని కొట్టిన వైనం కళ్యాణదుర్గం: తెలుగు తమ్ముళ్ల అరాచకాలు రోజురోజుకూ హద్దులు దాటుతున్నాయి. ఇన్నాళ్లూ ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేసిన ‘పచ్చ’ మంద ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ మహిళా కార్యకర్తపై దాడికి తెగబడింది. ఒకటిన్నర సెంటు ఖాళీ స్థలానికి సంబంధించిన వివాదంలో టీడీపీ మండల మాజీ కన్వీనర్ కీలకపాత్ర పోషించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వన్నప్ప వద్ద నుంచి కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన టీడీపీ మండల మాజీ కన్వీనర్ డీకే రామాంజనేయులు కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే మొత్తం స్థలం తనదేనంటూ సోమవారం జేసీబీతో చదును చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సదరు స్థలం తమదని అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగమణి అడ్డుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలో నాగమణి, ఆమె కోడెలు కళ్యాణిపై డీకే రామాంజనేయులు బూతులతో రెచ్చిపోయాడు. అసభ్య పదజాలంతో వారిని దూషిస్తూ వారిపైకి రాళ్లతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కుటుంబ సభ్యులతో కలిసి వారిపై పైపులతో దాడికి యత్నించాడు. ఇంటి నుంచి బయటికి వచ్చిన నాగమణి మరోసారి జేసీబీకి అడ్డుపడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన డీకే రామాంజనేయులు ఆమెను జట్టుపట్టుకుని తీవ్రంగా కొట్టాడు. ఇదంతా గ్రామస్తులు కళ్లెదుటే జరుగుతున్నా... వారించే సాహసం చేయలేదు. కాగా సదరు స్థలం వివరాలు రెవెన్యూ రికార్డుల్లో లేవు. ఏ ఒక్కరూ తమకు చెందినట్లుగా ఎలాంటి ఆధారాలూ తీసుకురాలేదని రెవెన్యూ అధికారులు స్పష్టంచేశారు. ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు స్పందించారు. ఇరు వర్గాలను వారి వద్ద ఉన్న స్థలానికి సంబంధించిన రికార్డులను తీసుకు రావాలని సూచించినట్లు సమాచారం. అమిలినేని ఇలాకాలో రెచ్చిపోతున్న ‘తమ్ముళ్లు’ కళ్యాణదుర్గంలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం పెరిగిపోయింది. ఇటీవల కళ్యాణదుర్గం నార్త్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై తెలుగు టీచర్ రామచంద్ర నాయక్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఘటనపై పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో బాలిక తల్లిదండ్రులను రాజీ కుదుర్చేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా ఉండి రాజకీయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం 3వ తరగతి చదువుతున్న ఓ బాలికను లోబర్చుకునేందుకు ఓ జేసీబీ డ్రైవర్ యత్నించగా దేహశుద్ధి చేసి, స్థానికులు సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అయితే సదరు ఘటనలో కేసు లేకుండా ఉండేందుకు టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి రాజకీయానికి తెర లేపారనే ఆరోపణలు వినిస్తున్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ టీడీపీ నేతలు జోక్యం చేసుకుంటూ సొంత పార్టీ కార్యకర్తలపైన, సామాన్య ప్రజలపైన ప్రతాపం చూపుతూ రెచ్చిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగమణి, కళ్యాణిలపై దాడి చేస్తున్న టీడీపీ మండల మాజీ కన్వీనర్ డీకే రామాంజనేయులు -
క్షుద్రపూజల కలకలం
కళ్యాణదుర్గం: పట్టణంలోని స్థానిక మారెంపల్లి కాలనీ వాసులకు ఆరాధ్యదైవంగా ఉన్న తాటిమాను మారెమ్మ ఆలయం వద్ద వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు స్థానికులు, భక్తుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆలయంలో జరిగిన దొంగతనం, అమ్మవారి చేయి ధ్వంసం కాగా, ఇటీవల ఆలయ ప్రాంగణంలో క్షుద్రపూజలు వెలుగుచూడటం కాలనీవాసులను ఉలిక్కి పడేలా చేస్తోంది. విగ్రహం ధ్వంసం...ఆభరణాల చోరీ కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి అమ్మవారి చేయిని విరగ్గొట్టారు. విగ్రహంపైన ఉన్న వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన నుంచి భక్తులు తేరుకోకముందే నాలుగు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం వెనుక భాగంలో క్షుద్రపూజలు నిర్వహిస్తుండటాన్ని కాలనీ వాసులు గుర్తించారు. పూజా సామగ్రి, ఇతర ఆనవాళ్లు నిత్యం దర్శనమిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 20 మందికి పైగా కాపలా ఉన్నా.. క్షుద్రపూజలు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేందుకు కాలనీ వాసులు, భక్తులు, ఆలయ పూజారులు నాలుగు రోజుల క్రితం రాత్రి సమయంలో సుమారు 20 మందికిపైగా ఆలయ ఆవరణంలో కాపలాగా ఉన్నారు. అయితే ఆగంతకులు అదే రాత్రి క్షుద్రపూజలు ముగించుకుని వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదయం నిద్రలేచి చూసిన భక్తులు పూజల ఆనవాళ్లు, వాడిన పూజా సామగ్రిని చూసి భయాందోళన చెందుతున్నారు. పీఠాధిపతులను ఆశ్రయించిన కాలనీ వాసులు మారెమ్మ ఆలయంలో జరుగుతున్న వరుస పరిణామాలతో తీవ్ర భయాందోళనకు గురైన కాలనీ పెద్దలు, భక్తులు, ఆలయ నిర్వాహకులు ఇటీవల పలు ప్రముఖ పీఠాధిపతులను కలిసి ఆలయంలో జరిగిన చోరీలు, క్షుద్రపూజలపై వివరించినట్లు సమాచారం. చేపట్టాల్సిన శాంతి పూజలు, దోష నివారణ చర్యలపై సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్షుద్రపూజల నేపథ్యంలో పోలీసులు రాత్రి సమయాల్లో గస్తీ చేపట్టి దుండగులను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కూడేరు: గుర్తు తెలియని వ్యక్తి తన షర్టుతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడేరు మండల పరిధిలోని ఉదిరిపికొండ–శివరాంపేట గ్రామాల మధ్య అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. మంగళవారం రహదారి వెంట వెళుతున్న వాహనదారులకు దుర్వాసన రావడంతో చెట్టు దగ్గర పరిశీలించగా నల్లగా మారిపోయి చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి కనిపించాడు. పోలీసులకు సమాచారమందిచండంతో సీఐ రాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మనిషి ఊదెక్కి, పురుగులు పట్టి ఉన్నాడు. ఒక భుజంపై ఆర్కే అని మరొక భుజంపై మేఘా అని కన్నడలో పచ్చతో రాసిన అక్షరాలున్నాయి. అక్కడ ఇతరత్రా ఏ ఆధారాలు లభించలేదు. దీంతో జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లకు అతని ఆచూకీ కోసం సమాచారమందించారు. అతని శరీర పరిస్థితిని బట్టి 4–5 రోజులు క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని, 35–40 ఏళ్లలోపు వయసు ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. రైలు కింద పడి బేల్దారి.. గుత్తి: గుత్తి ఆర్ఎస్లోని గౌతమేశ్వరాలయం సమీపంలో మంగళవారం బేల్దారి వెంకటేసులు (54) గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లులోని ఉమామహేశ్వర నగర్‌కు చెందిన వెంకటేసులు ఇటీవల ఆదోనికి మకాం మార్చాడు. రెండు సంవత్సరాల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో మనోవేదనకు గురైన ఆయన మానసిక రోగిగా మారాడు. మద్యానికి బానిసయ్యాడు. అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. మంగళవారం స్థానిక గౌతమేశ్వరాలయం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కీ మ్యాన్ శ్రీనివాసులు గమనించి కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నేమకల్లు అంజన్న ఆదాయం రూ.11.69 లక్షలు బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా రూ.11.69 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్త శ్రీనాథ్శెట్టి, ఈఓ నరసింహారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సేవా టికెట్ల ద్వారా రూ.1.70 లక్షలు, తాత్కాలిక హుండీల ద్వారా రూ.3.95 లక్షలు, అన్నదాన విరాళాల రూపంలో రూ.6.04 లక్షలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. జీర్ణోద్ధారణ పనులు జరుగుతున్న సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్వరలో భూమి పూజ తర్వాత ఆలయ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తుల్లో అపోహలు కలిగించేలా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీటీ ఆసుపత్రి ఎదుట ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు. మంగళవారం ఉదయం పూజ నిమిత్తం ఆలయానికి వెళ్లిన అర్చకులకు వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం, ఆలయ తాళం తీసి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఆలయంలోని పవిత్రమైన మంగళ సూత్రం, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. వీటి విలువ రూ. 2 లక్షలకు పైగా ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నిత్యం జన సంచారం ఉండడంతో పాటు పేరుగాంచిన ఆలయంలో దొంగతనం జరగడంపై స్థానికులు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దొంగల కదలికలు రికార్డయ్యాయి. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో యువకుడి మృత్యువాత గుత్తి రూరల్: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన విక్రమ్(19) అనే యువకుడు మంగళవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతుడి తండ్రి మురార్జీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉప్పర్లపల్లికి చెందిన విక్రమ్ ట్రాక్టర్ హమాలీగా పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. గ్రామ శివారులో నుంచి ట్రాక్టర్లో రాళ్లు లోడ్ చేసుకుని తన ఇంటికి సమీపంలోకి తరలించాడు. రాళ్లు అన్లోడ్ చేస్తున్న క్రమంలో పైనున్న విద్యుత్ తీగలకు ట్రాలీ తగిలింది. దీంతో విద్యుత్ ప్రసరించి ట్రాలీలో ఉన్న విక్రమ్ ఒక్కసారిగా కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విక్రమ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 40 లక్షల విలువైన 21 కిలోల వెండి ఆభరణాలు, కరిగించిన వెండి, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను ఎస్పీ జగదీష్ వెల్లడించారు. వ్యసనాలకు బానిసలై.. అనంతపురం రూరల్ మండలం నందమూరి నగర్‌కు చెందిన కురపాటి సాయికుమార్, అక్కంపల్లికి చెందిన కనుమక్కుల చాంద్‌బాషా, శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం కొడిగినెహళ్లికి చెందిన గుండప్పగారి సూదం ముఠాగా ఏర్పడ్డారు. సర్వీసింగ్ సెంటర్లో వర్కర్, కూలీ పనులు చేసుకునే వీరు వ్యసనాలకు బానిసలయ్యారు. జల్సాలను తీర్చుకునేందుకు దేవాలయాలను టార్గెట్‌గా చేసుకున్నారు. కాపలాలేని దేవాలయాలను ఎంచుకొని ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడేవారు. సీసీ కెమెరాలు ఉన్నా.. వాటిలో రికార్డు కాకుండా స్ప్రే ద్వారా లెన్స్‌ను బ్లర్ చేయడం, కొన్ని చోట్ల డీవీఆర్‌లను ఎత్తుకెళ్లారు. కంబదూరు మండలం రాంపురం మారెమ్మ ఆలయంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుల వివరాలు వెల్లడయ్యాయి. అనంతరం వారిని అరెస్టు చేసి విచారించగా... కంబదూరుతో పాటు బ్రహ్మసముద్రం, శెట్టూరు, పామిడి, బుక్కరాయసముద్రం, రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయం, రొద్దం, కర్ణాటకలోని తుమకూరు, కొరటగెరె, క్యాససంద్ర తదితర చోట్ల దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రూరల్ సీఐ నీలకంఠ, ఎస్ఐ లోకేష్, ఏఎస్ఐ గంగాధర, సిబ్బందిని ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు. -
‘ట్రెల్లీస్’ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
అనంతపురం అర్బన్: నగరంలోని ‘ట్రెల్లీస్’ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత బాలిక తల్లి డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించేందుకు మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. పోక్సో కేసు వివరాలను బయటపెట్టిన యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించిన నలుగురు విలేకరులపైనా విచారణ చేయాలన్నారు. డీఈఓ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని కోరారు. సీజ్ చేయాల్సిందే.. సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకున్న ట్రెల్లీస్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ ఓ.ఆనంద్‌ను మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాలుగు రోజులైనా డీఈఓ కమిటీ ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికై నా పాఠశాలను సీజ్ చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వీరేంద్ర, బండారు శంకర్, మంత్రి సుదర్శన్, ప్రతిభ భారతి, చంద్రచర్ల హరి, కొడవండ్ల నరేష్, రమణకుమార్, ఎంఎండీ ఇమామ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రేపు అర్చకుల గ్రీవెన్స్ అనంతపురం కల్చరల్: జిల్లా దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17న అర్చక స్వాముల గ్రీవెన్సు నిర్వహిస్తున్నట్లు ఎండోమెంటు అధికారిణి బి.సుధారాణి తెలిపారు. స్థానిక మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండరామాలయం వేదికగా ఉదయం 10.30 గంటల నుంచి జరిగే గ్రీవెన్సులో అర్చకులు పాల్గొనాలన్నారు. ● అర్చకులకు అనేక సమస్యలున్నాయని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని దేవాలయాల అర్చకులు తరలి రావాలని ఏపీ అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పులమాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. యథేచ్ఛగా చెరువు మట్టి దోపిడీ శెట్టూరు: మండల కేంద్రంలోని చెరువు నుంచి రెండు రోజులుగా వందలాది ట్రాక్టర్ల మట్టిని యథేచ్ఛగా ఓ వ్యక్తి తరలిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకోకపోవడం గమనార్హం. స్థానికులు ప్రశ్నిస్తే ‘నా ఇష్టం.. నాకు పలుకుబడి ఉంది.. నన్నెవరూ అడ్డుకోలేరు’ అంటూ రుబాబు చేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రం నుంచి వలస వచ్చిన సదరు వ్యక్తి స్థానిక వనరులను కొల్లగొడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే మట్టి తవ్వుతున్నారని స్థానికులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపించారు. మండల వ్యాప్తంగా పలుచోట్ల యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు పోతున్నారని స్థానికులు వాపోయారు. మండల కేంద్రంలోని చెరువులో సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై ఎమ్మార్పీఎస్ నాయకులు తహసీల్దార్ ఈశ్వరమ్మకు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వన్నూరుస్వామి, మండల అధ్యక్షుడు గౌరయ్య, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుంటారా?
● వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ అనంతపురం: ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని వారిపై నిఘా ఉంచడం అప్రజాస్వామిక చర్య అని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు అన్నారు. ఆ హక్కును వినియోగించుకుంటున్న విద్యార్థులు, నిరుద్యోగులను నేరస్తులుగా చిత్రీకరించడం భావ్యం కాదన్నారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, సైబర్ విభాగాల పేరుతో నిరుద్యోగ యువతకు సంబంధించిన డిజిటల్ నెట్‌వర్క్‌లను మ్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. నిరుద్యోగులు చురుగ్గా ఉండే వాట్సాప్ గ్రూపులు, అడ్మిన్ల వివరాలు, సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వారి ఫొటోలు, వీడియోలతో రికార్డులు తయారు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మార్గదర్శకత్వం వహించే కోచింగ్ సెంటర్లు, అధ్యాపకులు, యూట్యూబర్లపై తనిఖీల పేరుతో ఒత్తిడి తీసుకువస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను రాజకీయ స్వప్రయోజనాలు, నిరుద్యోగుల పర్యవేక్షణ కోసం వాడటం అత్యంత విచారకరమని వ్యాఖ్యానించారు. ‘యువత ఫోన్లలోకి తొంగిచూడడం కాదు.. వారి భవిష్యత్తులోకి ప్రభుత్వం చూడాలి. ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు కల్పిస్తారో, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారో, నిరుద్యోగ భృతి హామీ పరిస్థితి ఏమిటో ముఖ్యమంత్రి స్పష్టమైన సమాధానం చెప్పాలి‘ అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘డీఆర్సీ’ సమావేశం నిర్వహించే తీరిక లేదా?
● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజం ఉరవకొండ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు మూలంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ విషయంపై సమీక్షించేందుకు కనీసం డీఆర్సీ (జిల్లా సమీక్ష కమిటీ) సమావేశం నిర్వహించే తీరిక లేకపోవడం అన్యాయమంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి భరత్ రాయలసీమ వాసి అయినా, రైతాంగాన్ని ఆదుకోవడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కనీసం సమీక్ష నిర్వహించే తీరిక ఆయనకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఉత్సవ విగ్రహాల్లా మారారన్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి ఎద్దడితో పాటు పశువులకు నీరు, పశుగ్రాసం అందకుండా పోయాయన్నారు. జిల్లాలో 40 లక్షల పశుసంపద ఉందని, ఇందులో 2 లక్షల ఎద్దులు, గేదెలు 1.80 లక్షలు, గొర్రెలు 30 లక్షల వరకూ ఉన్నాయన్నారు. ఒక్కో పశువుకు 30 కిలోల గ్రాసం అవసరం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో కిలో గ్రాసం దొరికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ముగ్గురు మంత్రులు కనీసం రైతాంగంలో ఆత్మస్థ్యైరం నింపే ప్రయత్నం చేశారా అంటూ నిలదీశారు. ఇప్పటికై నా మేల్కొని జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. జాతీయస్థాయి పోటీలకు ఖాదర్‌పేట విద్యార్థిని పామిడి: ఖాదర్‌పేట జెడ్పీహైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆర్.ప్రణయ జాతీయ స్థాయి సబ్–జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం పురుషోత్తం బాబు, పీడీ ఎస్.శిరీష తెలిపారు. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రణయ ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంద న్నారు. అక్టోబర్ 3 నుంచి 7వ తేదీ వరకు చత్తీస్‌ఘడ్‌లోని భిలాయిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ప్రణయ పాల్గొంటుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని హెచ్ఎం, పీడీతో పాటు స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య, సెక్రెటరీ వెంకటేష్ అభినందించారు. -
అనంత ఘోర ప్రమాదం: యువతి స్పాట్ డెడ్.. ఆస్పత్రిలో మరొకరు
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్‌ను ఢీకొట్టి ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అందులో ఉన్న ఓ యువతి అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గాయపడ్డ మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉదయం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి అనంతపురం వస్తున్న టాటా సఫారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్‌ను ఢీకొట్టి.. అక్కడి హోటల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని గుత్తికి చెందిన హరితగా పోలీసులు గుర్తించారు.అనంతపురం హౌసింగ్ బోర్డుకు చెందిన శ్రీధర్‌రెడ్డి, సింగనమల మండలం సలకం చెరువుకు చెందిన కుమార్, గుత్తికి చెందిన హరితతో పాటు మరో యువతి ప్రమాద సమయంలో కారులో ఉన్నారు. మరో యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ఇద్దరు యువకులకు కూడా గాయాలు కావడంతో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ముగ్గురిలో మరణించిన మరొకరు ఎవరనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ప్రమాద సమయంలో కారు ఎందుకు అదుపుతప్పిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌కు నిద్రమత్తు వచ్చిందా? లేదంటే మద్యం సేవించి వాహనం నడిపారా? అనే కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ప్రియుడితో పట్టాలపై ముచ్చట్లు.. ఇంతలో విషాదం -
కరువు సహాయక చర్యలు చేపట్టండి
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయం, రైతుల పరిస్థితులు అధ్వానంగా ఉన్నందున చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పశువుల మార్కెట్‌ను సీపీఐ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పంటలు లేక, పశుగ్రాసం లేక పాడి ఆవులు, గేదెలను అయినకాటికి అమ్ముకుంటున్నట్లు పలువురు రైతులు వాపోయారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ... ఎల్‌నినో తీవ్రంగా ఉన్నందున జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష వైఖరికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాప్తాడు రూరల్: రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ ధ్వజమెత్తారు. కరువు ప్రభావంతో పంటలు ఎండిపోవడం, సాగునీరు అందకపోవడం, పశుగ్రాసం కొరత ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సీపీఐ, రైతు సంఘాల ప్రతినిధి బృందం అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామం వద్ద ఎండిపోయిన దానిమ్మ తోటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ -
రైతుల జీవితాలతో ఆడుకోవద్దు
బుక్కరాయసముద్రం/ పుట్లూరు: రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతూనే ఉన్నారు.. అయినా ప్రభుత్వంలో చలనం లేదు.. రాష్ట్రంలో ఎల్–నినో ప్రభావం వల్ల వర్షాలు లేవంటున్నారు.. కూటమి ప్రభుత్వం రైతులకు గుక్కెడు నీరు అందించలేకపోతే ఎలా? రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు. పరిపాలన చేతకాకపోతే వెంటనే దిగిపోండి’ అని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదివారం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి, దయ్యాలకుంటపల్లిలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎండిపోయిన వేరుశనగ పొలాలు, చీనీ తోటలను, అలాగే పుట్లూరు మండల కన్వీనరు మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి పొలాలను శైలజానాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. సాగునీరు వదులుతారనే ఆశతో 3.5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశానని, ఇప్పుడేమో నీళ్లు ఇవ్వలేమంటున్నారని చెన్నంపల్లికి చెందిన మహిళా రైతు సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక, బోర్లల్లో నీరు రాక ఆరు ఎకరాల్లోని చీనీ పంట ఎండిపోతోందని మరో రైతు వెంకటరామిరెడ్డి వాపోయారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని అన్నారు. వ్యవసాయ రంగంపై తీవ్ర నిర్లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చలేనప్పుడు.. సాగునీరు అందించలేనప్పుడు.. రైతుల తరఫున ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడతారా అంటూ విమర్శించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువనేత డాక్టర్ సాకే రిత్విక్, గార్లదిన్నె మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, చామలూరు రాజగోపాల్, జయరామిరెడ్డి, మంత్రి ఆంజినేయులు, భాస్కర్‌రెడ్డి, ఉట్టి కాటమయ్య, సాకే రామాంజినేయులు, నాగయ్య, శ్రీనివాసరెడ్డి, మంజునాథ్‌రెడ్డి, శ్యాం సుందర్‌రెడ్డి, సురేష్‌బాబు, లక్ష్మిరెడ్డి, నాగరాజు, నల్లపరెడ్డి, మనోహర్‌రెడ్డి, భాస్కర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. పుట్లూరు మండలంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్, జిల్లా రైతు విభాగం కార్యదర్శి శివారెడ్డి, జిల్లా కార్యదర్శి విష్ణునారాయణ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి దుర్గం రామాంజినేయులు, శింగనమల నియోజకవర్గ అధ్యక్షులు అంజి, పుట్లూరు మండల రైతు విభాగం అధ్యక్షులు రమణారెడ్డి, అనుబంధ విభాగాల నాయకులు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సాంబశివారెడ్డి, మనోహర్, ఓబుల్‌రెడ్డి, భీమేష్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, పోల్‌రెడ్డి, నారాయణస్వామి, రామ్మోహన్, రైతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి శైలజానాథ్ -
ఐచర్ ఢీకొని ఇంటర్ విద్యార్థిని దుర్మరణం
యాడికి: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన గుత్తి – తాడిపత్రి జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు... పెద్దవడుగూరు మండలం భీమునిపల్లికి చెందిన కంబగిరి రాముడు, రాజేశ్వరి దంపతులు వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె వనజ (16) ఉన్నారు. దినసరి కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వనజ తాడిపత్రిలోని కేజీబీవీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే గత వారం రోజులుగా వనజ అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకొచ్చి తాడిపత్రిలోని ఓ ఆస్పత్రిలో చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం కూడా ఆస్పత్రిలో వనజను చెక్ చేయించి తల్లిదంద్రలతో పాటు ఆమె కూడా ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలు దేరారు. యాడికి మండలంలోని గుత్తి – తాడిపత్రి జాతీయ రహదారిపై పెండేకల్లు సమీపంలో ఐచర్ వాహనం వేగంగా వస్తుండటంతో బైక్‌పై నుంచే తన తండ్రికి విషయాన్ని చెప్పింది. ఆయన వాహనాన్ని ఆపాడు. అయితే ఐచర్ (జీజే27టీజీ1290) వాహనం ఎక్కడ ఢీ కొంటుందోనని హైవేపై పరుగెత్తే ప్రయత్నం చేయగా వనజను ఐచర్ ఢీ కొంది. ఈ ఘటనలో విద్యార్థిని అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఘటన తర్వాత వాహనాన్ని అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. స్థలం కబ్జా చేశారు.. న్యాయం చేయండయ్యా.. పామిడి: గుత్తి ఆర్ఎస్లోని తమ మూడుసెంట్ల ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని, న్యాయం చేకూర్చాలని పామిడికి చెందిన పేద దళిత దంపతులు పీ రజని, వరప్రాద్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వివరాలమేరకు.. గుత్తి ఆర్ఎస్లోని చెట్నేపల్లి పరిధిలోని సర్వేనంబర్ 208–ఏ1 లోని ప్లాట్ నంబర్ 41లోని మూడు సెంట్ల స్థలాన్ని 40 ఏళ్ల క్రితం తమ జేజమ్మ రమణమ్మకు ప్రభుత్వం పట్టా కేటాయించిందన్నారు. ఆమె తదనంతరం తన భర్త వరప్రసాద్ నుంచి ఆ మూడుసెంట్ల స్థలాన్ని రజని పేర పట్టా పొందానన్నారు. అయితే గుత్తి ఆర్ఎస్లోని ఆ స్థలాన్ని పక్కనే ఉన్న ఆదినారాయణ కుటుంబం ఆక్రమించుకొని ప్రహరీ నిర్మించారన్నారు. ప్రశ్నించిన తమపై ఆదినారాయణతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలసి కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారన్నారు. రజనీ గాయపడగా గుత్తి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినట్లు పేర్కొన్నారు. దీనిపై గుత్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా సంబంధితా పోలీసు ఉన్నతాఽధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని దళిత దంపతులు కోరుతున్నారు. -
నీళ్లు రాక పంట ఎండుతోంది
నాకు 4.78 ఎకరాల పొలం ఉంది. రెండు బోర్లు ఉండగా నీళ్లు వస్తాయనే ఆలోచనతో 2 ఎకరాల్లో వేరుశనగ, మరో 2.78 ఎకరాల్లో కంది సాగు చేశా. అయితే వర్షాలు రాక బోర్లలో నీళ్లు క్రమేణా తగ్గిపోతున్నాయి. మోటార్ ఆన్ చేయగానే 10 నిమిషాలు అలా వచ్చి తర్వాత గుక్కపడుతున్నాయి. గంట తర్వాత ఆగిపోతున్నాయి. కనీసం వేరుశనగను కాపాడుకుందామన్నా సాధ్యం కావడం లేదు. రెండు పంటలు ఎండుముఖం పట్టాయి. – రైతు భాస్కరరెడ్డి, పీటీఆర్ పల్లి, కళ్యాణదుర్గం మండలం -
పీఏబీఆర్‌లో 3 టీఎంసీలు దాటిన నీటి మట్టం
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లో నీటి మట్టం 3 టీఎంసీలు దాటింది. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీటి లభ్యత బాగా తగ్గిపోతోంది. తాగునీటి సమస్య తలెత్తే పరిస్థితి ఉంది. పీఏబీఆర్ డ్యాంలో ఏర్పాటైన సత్యసాయి, శ్రీరామిరెడ్డి, అనంత , ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాది గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా పీఏబీఆర్ డ్యాంలోకి తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా 150 , జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువ ద్వారా 450 క్యూసెక్కులు చొప్పున నీరు సరఫరా అవుతోంది. తాగునీటి ప్రాజెక్టులకు రోజూ 55 క్యూసెక్కులు, నీటి ఆవరి , లీకేజీల రూపంలో మరో 55 క్యూసెక్కుల నీరు బయటకు వెళుతోంది. అవుట్ ఫ్లో కంటే ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో డ్యాంలో నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. ఆదివారం నాటికి డ్యాంలో 3.512 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
భూగర్భంలో కల్లోలం
డేంజర్ బెల్స్..అనంతపురం అగ్రికల్చర్: భూగర్భ జలాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. నైరుతిలో కదలిక లేక వర్షాలు మొహం చాటేశాయి. జూన్ 15 తర్వాత వంకలు ప్రవహించే వర్షం ఒక్కరోజు కూడా నమోదు కాలేదు. దీంతో భూగర్భజలాలు క్రమంగా పతనమవుతూ ప్రమాదఘంటికలు మోగిస్తున్న పరిస్థితి నెలకొంది. 2.20 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంటలు ఎండుముఖం పట్టాయి. పెట్టుబడి కూడా చేతికివచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ప్రత్యామ్నాయం, రబీకి కూడా అనుకూల వాతావరణం లేదు. మున్ముందు పట్టు, పాడి, పశుపోషణ, పండ్లతోటల మనుగడకు ముప్పు తప్పదనే ఆందోళన నెలకొంది. 500 నుంచి 800 అడుగుల లోతు వరకు కొత్తగా బోర్లు వేయిస్తున్నా అందులో సగానికి పైగా ఫెయిల్ అవుతున్నాయి. 15.19 మీటర్లుగా నమోదు .. భూగర్భ జలశాఖ ఇటీవల జిల్లా వ్యాప్తంగా 91 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫిజోమీటర్ల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం సగటు నీటి మట్టం 15.19 మీటర్లుగా నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి నీటిమట్టం తగ్గిపోవడం గమనార్హం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల 32 మండలాల్లో 60 నుంచి 70 వరకు వర్షపాత విరామాలు(డ్రైస్పెల్స్) నమోదయ్యాయి. మంచి వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన సమయంలో బలమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలాగుంటే వచ్చే వేసవికి భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పతనం కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. డేంజర్లో 9... ఒత్తిడిలో 12 మండలాలు నీటి వాడకం అధికంగా ఉన్నందున ఇప్పటికే 9 మండలాలను ‘డేంజర్ జోన్’లోకి చేర్చారు. తాడిపత్రి, రాయదుర్గం, డి.హీరేహాళ్, కణేకల్లు, పుట్లూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి, శెట్టూరు మండలాలు డేంజర్లో ఉండగా... నార్పల, యల్లనూరు, వజ్రకరూరు, శింగనమల, గుత్తి, బ్రహ్మసముద్రం, కూడేరు, బెళుగుప్ప, గుమ్మఘట్ట, కంబదూరు, పామిడి, బొమ్మనహాళ్ తదితర 12 మండలాలు తీవ్ర ఒత్తిడి జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పెద్దపప్పూరు మాత్రమే సేఫ్ జోన్లో ఉండగా మరో 10 మండలాల్లో మోస్తరుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నగరూరులో 66.32 మీటర్లుగా నమోదు.. ప్రస్తుతం సగటు నీటి మట్టం 15.19 మీటర్లుగా నమోదైంది. గతనెలలో 14.58 మీటర్లుగానూ, గతేడాది ఇదే సమయంలో 10.71 మీటర్లుగా భూగర్భజలాలు ఉన్నట్లు నమోదైంది. గతేడాదితో పోల్చితే 4.48 మీటర్లు లోతుకు పతనం కావడం ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 248.8 మి.మీ గానూ 50 శాతం తక్కువగా 123 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో నీటి వనరుల లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. ఈ సీజన్లో ఒకట్రెండు సార్లు కొన్ని మండలాలు మినహా చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లే వర్షాలు కురవకపోవడంతో నదీ పరివాహక ప్రాంతాలు కూడా ఒట్టిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం కనిపించనంత లోతుకు పడిపోయింది. ఈ సీజన్లో వర్షాల రూపంలో 29 టీఎంసీల నీళ్లు ప్రవహించగా అందులో 3.48 టీఎంసీలు మాత్రమే భూగర్భంలో ఇంకిపోయినట్లు అధికారులు తెలిపారు. యాడికి మండలం నగరూరు ఫిజోమీటర్‌లో 66.32 మీటర్లు, అలాగే శెట్టూరు మండలం చెర్లోపల్లిలో 56.15 మీటర్లు, పుట్లూరులో 43.70 మీటర్లు ఇలా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్న పరిస్థితి నెలకొంది. మున్ముందు ఎదురయ్యే పరిస్థితులపై రైతులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి పతనమైన గంగమ్మ ఎల్–నినో వర్షాభావంతో క్షీణిస్తోన్న భూగర్భజలం డేంజర్లో తొమ్మిది, తీవ్ర ఒత్తిడిలో 20 మండలాలు తాజా సగటు నీటిమట్టం 15.19 మీటర్లుగా నమోదు -
దంపతుల మధ్య చిన్నపాటి గొడవ
● మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య నల్లచెరువు: మండల కేంద్రంలోని విజయలక్ష్మి కాలనీలో నివాసముంటున్న వివాహిత రుబీనా (27) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు... విజయలక్ష్మి కాలనీలో ఆటోడ్రైవర్ మన్సూర్, రుబీనా దంపతులు నివాసముంటున్నారు. వారికి కుమారుడు రియాన్, కుమార్తె ఫైజ ఉన్నారు. అయితే చిన్న పిల్లలు అల్లరి చేస్తున్నారని వారిని రుబీనా మందలించింది. ఈ విషయంపై దంపతుల మధ్య ఆదివారం చిన్నపాటి గొడవ జరిగింది. భర్త మన్సూర్ ఇంటి వరండాలో పిల్లలతో కలిసి ఉండగా గొడవ కారణంగా మనస్తాపం చెందిన రుబీనా ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసి లోపల గడి పెట్టుకుంది. ఇంట్లో నుంచి గట్టిగా కేకలు వినపడడంతో వెంటనే మన్సూర్ ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని రుబీనా మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మక్బూల్ బాషా తెలిపారు. సమస్య పరిష్కరించడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం పెద్దపప్పూరు: ప్రభుత్వం తనకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని మరొకరు కబ్జా చేస్తున్నారు. న్యాయం చేయాలని అధికారులను బతిమలాడినా పట్టించుకోలేదంటూ ఓ రైతు మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. మండలంలోని శింగనగుట్టపల్లికి చెందిన రామాంజినేయులు శనివారం రెవిన్యూ, పోలీస్ అధికారుల వద్దకు వెళ్లాడు. తన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలగొగ్గిన ఆర్ఐ ఉదయ్‌కుమార్ తన ఇంటికి వచ్చి ఇతరులు ఆ స్థలంపై అభ్యంతరాలు తెలిపారని, ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన రామాంజినేయలు తనకు న్యాయం జరగదని భావించి ఆదివారం తన పొలంలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన ఆత్మహత్యకు ఆర్ఐ ఉదయ్‌కుమార్, అదే గ్రామానికి చెందిన ఒబన్నగారి నాగరాజు, చెత్తప్పగారి వీరయ్య, ఉల్లికల్లు వీరయ్య, పుల్లారెడ్డి కారణమని, వారికి న్యాయస్థానం తగిన శిక్షవేయాలంటూ పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఆయన్ను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసి మృతి గార్లదిన్నె: మండల పరిధిలోని కల్లూరు పెన్నానది బ్రిడ్జి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు.. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన నలుగురు యువకులు, బెంగళూరు నుంచి జీప్‌లో మంత్రాలయానికి బయలుదేరారు. అయితే కల్లూరు వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని జీప్ ఢీకొంది. దీంతో జీప్‌లోని అభిలాష్ (23) అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నపరెడ్డి, రేవంత్కుమార్రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. -
నిర్విఘ్నం.. దశ భుజం
రాయదుర్గంటౌన్: ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలన్నా ముందుగా అందరికీ గుర్తొచ్చేది వినాయకుడే. పూజల్లో తొలిస్థానం ఆయనదే. అంతటి మహిమ గల గణేశుడి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాధారణంగా వినాయకుడి విగ్రహం ఎలా ఉంటుందని ఎవరిని అడిగినా కళ్లు మూసుకుని ఠక్కున చెప్పేస్తారు. అయితే దశభుజ గణపతి విగ్రహాన్ని మాత్రం ఎక్కువ మంది చూసుండరు. ఇది దేశంలోనే అరుదైన మహాగణపతి విగ్రహం. కొండపైకి వెళ్లే దారిలో... రాయదుర్గం పట్టణంలోని దశభుజ గణపతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. రాయదుర్గం కొండపైకి వెళ్లే దారిలో పట్టణంలోని ఆత్మకూరు వీధిలో దశభుజగణపతి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఏకశిలపై దాదాపు 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో దశభుజాలతో వినాయకుడ్ని మలిచారు. ఇక్కడి గణపతికి మొత్తం పది చేతులుంటాయి. ఎడవైపున 5 చేతులు, కుడివైపున 5 చేతులతో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో భక్తులకు దర్శనమిస్తుంటారు. కుడి వైపు మొదటి చేతిలో నారీకేళం, రెండో చేతిలో చక్రం, మూడో చేతిలో త్రిశూలం, నాలుగో చేతిలో ధనుస్సు, ఐదో చేతిలో అంకుశం ఉంటాయి. ఎడవైపున మొదటి చేతిలో భార్య సిద్ధి, రెండో చేతిలో శంఖం, మూడో చేతిలో పవిత్రం, నాలుగో చేతిలో శరం, ఐదో చేతిలో ఖడ్గంతో స్వామివారు కనిపిస్తుంటారు. ఆది, మంగళవారాల్లో పూజలు.. సిద్ధ వినాయకుడి ఆలయాన్ని కొందరు మహా గణపతి ఆలయం అని కూడా పిలుస్తుంటారు. ఈ విగ్రహం రాయదుర్గం కోట నిర్మాణ సమయంలో మలచబడి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విగ్రహంలో వినాయకుడి తొండం కుడివైపునకు ఉండడం మరో విశేషం. ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి దశభుజ గణపతి ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు వస్తుంటారు. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. రాయదుర్గంలో అరుదైన దశభుజ మహాగణపతి విగ్రహం 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో స్వామివారి దర్శనం -
ఎండిన పంట తొలగింపు
గుత్తి రూరల్: మండలంలోని గాజులపల్లిలో ఎండిన వేరుశనగ పంటలను రైతులు తొలగిస్తున్నారు. ఆదివారం గ్రామంలోని సుమారు 25 మంది రైతులు తమ పంటలను తొలగించారు. సాధారణంగా సెప్టెంబర్ మాసంలో తోటలన్నీ పచ్చదనంతో కళకళలాడాల్సింది. అయితే ఎల్‌నినో ప్రభావంతో మొక్కల్లో ఎదుగుదల లేక ఎండి పోతున్నాయి. కనీసం పశువులకు మేతైనా లభిస్తుందని గ్రామంలోని రైతులు వేరుశనగ పంటలు తొలగిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు హనుమంతురెడ్డి మాట్లాడుతూ వేరుశనగ మొక్కలు ఎండిపోయి ఏ మాత్రం కాపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట దిగుబడి రాక పెట్టుబడి సుమారు రూ.4 లక్షలు నష్టపోయానని వాపోయారు. పంట తొలగింపునకు అదనంగా కూలీ ఖర్చులు వచ్చాయన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌లో చదవడం అదృష్టం
● టీటీడీ మాజీ జేఈఓ శ్రీనివాసరాజు పరిగి: కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌లో చదవడం తాము చేసుకున్న అదృష్టమని టీటీడీ మాజీ జేఈఓ, తెలంగాణ రాష్ట్ర ‘రెరా’ (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చైర్మన్ శ్రీనివాసరాజు అన్నారు. ఆదివారం కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరాజుతో పాటు నాటి పూర్వ విద్యార్థులకు ప్రిన్సిపాల్ నరేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పూర్వ విద్యార్థులు సరస్వతీ దేవి విగ్రహానికి పూజలు చేసి నాటి ప్రార్థనా గీతాలను ఆలపించారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదిలో కలయతిరిగి నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. డీజేలు పూర్తిగా నిషేధం అనంతపురం సెంట్రల్: వినాయక పండగ సందర్భంగా, నిమజ్జనం సమయంలో డీజేలు వాడడం నిషేధమని ఎస్పీ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీజే సిస్టం సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శబ్ద కాలుష్య నివారణలో భాగంగా సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. 5 డీజే సిస్టంలు స్వాధీనం ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలతో ఊరేగింపులు చేస్తున్న ఐదు డీజే సిస్టమ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
హోల్డ్‌లోనే ‘ఫ్రీహోల్డ్’
అనంతపురం అర్బన్: అసైన్డ్ భూములు సాగు చేస్తున్న రైతులకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. 2003కు ముందు అసైన్డ్ అయిన భూములకు యాజమాన్య హక్కు కల్పించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 563 గ్రామాలకు గాను తొలివిడతగా 114 గ్రామాల్లో ఫ్రీహోల్డ్‌కు సంబంధించి అసైన్డ్ భూముల వివరాలు సిద్ధం చేశారు. ప్రభుత్వం మారడం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫ్రీహోల్డ్ భూముల ప్రక్రియను పరిశీలన పేరుతో నిలిపివేసింది. ఆ ప్రక్రియ పూర్తయినప్పటికీ యాజమాన్య హక్కులు కల్పించడంపై ఏడాదిగా నాన్చుడు ధోరణి అనుసరిస్తూ వస్తోంది. అసైన్డ్ భూములు 3.03 లక్షల ఎకరాలు జిల్లావ్యాప్తంగా 563 రెవెన్యూ గ్రామాల్లో 2003కు ముందు 96 వేల మంది రైతులకు అసైన్డ్ చేసిన భూములు 3,03,370.55 ఎకరాలు. ఇందులో 1954, జూన్ 18 ముందు వాటిని, 22ఏ జాబితా, చుక్కల భూముల జాబితాలో ఉన్న వాటికి కాకుండా మిగిలిన అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్ చేసి యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఫ్రీహోల్డ్‌కు 36వేల ఎకరాలు సిద్ధం జిల్లాలో 563 గ్రామాలకు సంబంధించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 114 గ్రామాల్లో అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్ ప్రక్రియ నిర్వహించి 36,659 ఎకరాలను ఫ్రీహోల్డ్‌కు సిద్ధం చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. భూములను ఫ్రీ హోల్డ్ చేసి యాజమాన్య హక్కు కల్పించే కార్యక్రమాన్ని నిలిపివేసి పరిశీలనకు ఆదేశించింది. దీంతో తహసీల్దారు స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి వరకు మరోమారు పరిశీలన చేసి 36,659 ఎకరాల్లో 26,132 ఎకరాలు చట్టబద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. గుర్తించిన 26 వేల ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో ఎటూ తేల్చకుండా సాగదీస్తూ వస్తోంది. ఇక ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ రిజిస్ట్రేషన్‌శాఖకు ఉత్తర్వులు ఉండడంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. చివరికి అసైనీదారు చనిపోతే వారసులు మ్యుటేషన్ కూడా చేసుకోలేని పరిస్థితి.ఊరిస్తూ.. దాటవేస్తూ.. ఫ్రీహోల్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తోంది. ఫ్రీహోల్ భూములకు మోక్షం కల్పిస్తున్నాం అదిగో... ఇదిగో అంటూ ఏడాదిగా రైతులను ఊరిస్తూ వస్తోంది. ఇప్పటికీ అదే ధోరణితో ముందుకు పోతోంది. ఫ్రీహోల్ భూములకు క్లియరెన్స్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మరోసారి ఊరిస్తూ అదే తరహాలో ప్రకటన చేసింది. ఈసారైనా ఫ్రీహోల్డ్‌కు మోక్షం కల్పిస్తుందా..? లేక ఎప్పటిలాగానే సాగదీస్తుందా అనేది వేచిచూడాలి. ఫ్రీహోల్డ్‌కు సిద్ధం చేసింది 36 వేల ఎకరాలు చట్టబద్ధంగా ఉన్నట్లు గుర్తించింది 26 వేలు పరిశీలన పూర్తయినప్పటికీ వీడని ‘చంద్ర’గ్రహణం యాజమాన్య హక్కులు కల్పించడంలో సర్కారు నాన్చుడు ధోరణి -
ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి
గార్లదిన్నె: పంటలు పండక, రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వం, వ్యవసాయశాఖాధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మర్తాడులో వర్షాలు లేక ఎండిపోయిన చీనీ, వేరుశనగ పంట పొలాలను రాంభూపాల్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం తక్షణ సాయం కింద పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టాల్లో ఉన్నా ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కరువుపై ఈనెల 20, 21, 23 తేదీల్లో సీపీఎం ఆధ్వర్యంలో బృందాలు పర్యటిస్తాయన్నారు. -
ఆశలన్నీ పంటల బీమాపైనే..
అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో ఉపద్రవం కారణంగా రెండు నెలలకు పైగా జిల్లా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 32 మండలాల్లోనూ సుదీర్ఘ వర్షపాత విరామాలు (డైస్పెల్స్) నమోదయ్యాయి. అతికష్టమ్మీద సాగులోకి వచ్చిన 2.38 లక్షల హెక్టార్ల పంట దిగుబడులపై ఆశలు వదులుకున్న రైతులు ఏమి చేయాలో దిక్కుతోచక ఇప్పుడు పంటల బీమాపై భారం మోపారు. కానీ చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా పంటల బీమా ద్వారా సాయం అందించకపోవడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2024 ఖరీఫ్‌కు సంబంధించి కేంద్రం రూ.130 కోట్లు పరిహారం ఇచ్చినట్లు చెబుతున్నా... అందుకు సరైన లెక్కలు చూపడం లేదు. ఇలా పరిహారంపై అనుమానాలు ఉన్నా... గత రెండేళ్లు ఒక ఎత్తు కాగా... ఇప్పుడు ఎల్–నినో తీవ్రత కారణంగా పరిస్థితి దయనీయంగా ఉన్నందున పంటల బీమాపై గంపెడాశలు పెట్టుకున్నారు. వాతావరణ బీమా పథకం కింద వేరుశనగ, పత్తి, చీనీ, దానిమ్మ, టమాట, అరటి పంటలకు వర్తింపజేశారు. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం లాంటి ఆన్లైన్ వాతావరణ డేటా ఆధారంగా పరిహారం లెక్కలోకి తీసుకుంటారు. వాతావరణ బీమా కింద పంటలకు ప్రీమియం కూడా ఎక్కువే అయినా 87 వేల మంది రైతులు 1.25 లక్షల హెక్టార్ల పంటలకు ప్రీమియం చెల్లించారు. ఇక పంట కోత ప్రయోగాల ఫలితాలు అంటే పంట దిగుబడులు ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం, వరి, ఎండుమిరప పంటలకు వర్తింపజేశారు. ప్రధానంగా గ్రామం యూనిట్‌గా దిగుబడులు లెక్కించి కంది పంటకు బీమా వర్తింపజేశారు. దీంతో కంది పంటకు బీమా అధికంగా చేయించారు. ఇలా ఫసల్‌బీమా కింద 1.53 లక్షల మంది రైతులు 2.45 లక్షల హెక్టార్ల పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించారు. ఇలా రెండు పంటల బీమా పథకాల కింద 2.40 లక్షల మంది రైతులు 3.70 లక్షల హెక్టార్ల పంటలకు బీమా చేయించారు. మొత్తంగా రూ.3,200 కోట్లు విలువ చేసే పంట ఉత్పత్తులకు బీమా చేయించి రూ.52 కోట్లు మేర తమ వాటా కింద ప్రీమియం చెల్లించారు. పంటల బీమా చేయించడంలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కర్నూలు, సత్యసాయి జిల్లాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు బీమా చేయించిన పంటలన్నీ ఈ–క్రాప్‌లో నమోదైతే తప్ప బీమా వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వేరుశనగ, కంది, ఎండుమిరప, వరి రైతుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019–2024 మధ్య ఐదేళ్లూ వాతావరణబీమా, ఫసల్‌బీమా పథకాలు ఉచితంగా అమలు చేశారు. రైతుల మీద ప్రీమియం భారం మోపకుండా సాగు చేసిన పంటలను ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేశారు. నిబంధనల మేరకు అత్యంత పారదర్శకంగా పరిహారం కూడా అందించడంతో రైతులు సంతోషంగా సేద్యపు పనులు చేశారు. అలా ఐదేళ్ల కాలంలో పంటల బీమా కింద జిల్లా రైతులకు ఏకంగా రూ.1,160 కోట్ల పరిహారం అందించారు. 2024లో అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసిన చంద్రబాబు సర్కారు.. బీమా భారం మోపడంతో పాటు ప్రీమియం చెల్లింపునకు కూడా ఇబ్బందులు పడేలా చేయడం, కంటితుడపుగా పరిహారం ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్–నినో ఎఫెక్ట్.. వర్షాభావంతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం రూ.3,200 కోట్లు విలువ చేసే పంట ఉత్పత్తులకు బీమా కష్టకాలంలోనూ రూ.52 కోట్ల ప్రీమియం చెల్లించిన రైతులు జగన్ హయాంలో ఉచిత బీమాతో సాంత్వన బీమా పరిధిలోకి 3.70 లక్షల హెక్టార్ల పంటలు -
ఓ మహిళ విషయంలో వివాదం.. ఏడుగురికి గాయాలు
సాక్షి, అనంతపురం: ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మైలారంపల్లి గ్రామంలో ఓ మహిళకు సంబంధించిన విషయంపై ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడినట్లు సమాచారం.ఘర్షణలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా ఇరువర్గాల మధ్య వివాదం సద్దుమణగలేదు.దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇరువర్గాలు మరోసారి గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణంగా మారడంతో.. ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అక్కడ భద్రత ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి.. -
ఏపీటీఎఫ్–1938 అనుబంధ కమిటీల ఎన్నిక
అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీటీఎఫ్–1938 జిల్లా అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం జిల్లా ఉపాధ్యాయ భవన్లో జిల్లా అధ్యక్షుడు జి.రవీంద్ర అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. సబ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా పి.జగదీష్ (బ్రహ్మసముద్రం), అకడమిక్ కమిటీ కన్వీనర్‌గా ఎస్.గురుమూర్తి (కంబదూరు), సభ్యులుగా డి.బాబా ఫకృద్దిన్ (గుంతకల్లు), డి.పాండురంగ వరప్రసాద్ (ఉరవకొండ), ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా జి.రవికుమార్ (కుందుర్పి), సభ్యులుగా సి.మనోహర్ (కణేకల్లు), క్రమశిక్షణ కమిటీ కన్వీనర్‌గా తిరుపాల్ నాయక్ (అనంతపురం అర్బన్), మహిళా కమిటీ కన్వీనర్‌గా బండి సరిత (బెళుగుప్ప), సభ్యులుగా డి.శ్రీదేవి (కళ్యాణదుర్గం), కె.నాగజ్యోతి (నార్పల) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జి.రవీంద్ర, ప్రధాన కార్యదర్శి బి.హనుమప్ప మాట్లాడుతూ సంఘ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు సభ్యత్వ నమోదును విస్తరించాలని కోరారు. భవన నిధి సేకరణకు ప్రాధాన్యమివ్వాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ బకాయిలతోపాటు పలు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా నాయకత్వం ద్వారా పోరాడతామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.అశోక్ నాయక్, ఐఫియా శాశ్వత సభ్యుడు సత్యప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడు సాకే భాస్కర్, అదనపు కార్యదర్శి పోతులయ్య, సీనియర్ నాయకులు బుటారి వెంకటేశులు, బి.సి.తిన్నప్ప, చెన్నకేశవులు, జిల్లా ఉపాధ్యక్షులు వజీర్ భాష, నాగరాజు, జిల్లా కార్యదర్శి హనుమంతు పాల్గొన్నారు. మద్యం షాపులను రెన్యూవల్ చేసుకోండి అనంతపురం సెంట్రల్: రాష్ట్ర ప్రభుత్వం 2026–27కు సంబంధించి మద్యం షాపుల రెన్యూవల్ కోసం గెజిట్ విడుదల చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ ఎస్కేడీ ప్రసాద్ తెలిపారు. శనివారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి. రామ్మోహన్‌రెడ్డితో కలిసి నగరంలోని మద్యం షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 138 మద్యం షాపులకు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతమున్న లైసెన్స్ ఫీజుపై 38 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియకు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉందన్నారు. రెన్యూవల్ చేసుకోని మద్యం దుకాణాలకు మరలా లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐ జయనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని దాడి.. వ్యక్తిపై కేసు తాడిపత్రి రూరల్: ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో దాడికి దిగిన వ్యక్తిపై కేసు నమోదైంది. అప్‌గ్రెడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని సజ్జలదిన్నె వద్దగల ఆదివిష్ణు గ్రానైట్ ఫ్యాక్టరీలో స్థానిక రాగితోటపాలెంకు చెందిన రమేష్, చాకలి రమేష్‌లు పని చేసేవారు. తరుచుగా రమేష్‌కు చాకలి రమేష్ ఫోన్ చేసి పనులకు పురమాయిస్తుండేవాడు. దీంతో విసిగిపోయిన రమేష్ ఫోన్ లిఫ్టు చేసేవాడు కాదు. దీంతో ఆగ్రహించిన చాకలి రమేష్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమేష్ వద్దకు వెళ్లి ఘర్షణకు దిగాడు. కులం పేరుతో దూషించి రాయితో దాడి చేశాడు. తలకు తీవ్రగాయమైన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
అర్హులకు పింఛన్ అందించకుంటే ఉద్యమమే
అనంతపురం: ‘కరువు పీడిత అనంతపురం జిల్లాలో పింఛన్ డబ్బుతో కుటుంబాలను పోషించుకుంటున్న కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. టీడీపీకి ఓటు వేయలేదని పింఛన్లకు ఎంపిక చేయకపోతే అర్హులతో కలిసి ఉద్యమం చేపడతాం’ అని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కళ్యాణదుర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సచివాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులతో గంటల తరబడి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఉద్యోగులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులను ఆహ్వాని స్తుంటే, ఆ ప్రక్రియను సచివాలయాల్లో కాకుండా కేవలం ‘ప్రజావేదిక’లోనే పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని తన వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను పింఛన్ అర్హత జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తున్నారనే అనుమానముందన్నారు. తమ పార్టీ వారినే కాకుండా సీపీఎం, సీపీఐ తదితర పార్టీల సానుభూతి పరులై పింఛన్‌కు అర్హత ఉన్న వారిని ఎంపిక చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పింఛన్ అనేది ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రజల పన్నుల డబ్బుతో అమలు చేసే సంక్షేమ కార్యక్రమమని, సురేంద్రబాబు లేదా చంద్రబాబు సొంత నిధులు కావని మండిపడ్డారు. నారా వారి కానుక అని సొంత సొమ్ము ఇస్తే ఎక్కడైనా ఇచ్చుకోవచ్చని, తమకు అభ్యంతరం లేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సమీక్షలు, పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ వ్యవహారంపై కలెక్టర్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్లు అందాయని గుర్తు చేశారు. నేడు కేవలం టీడీపీ మద్దతుదారులకే ఇస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పింఛన్ బాధితుల తరఫున పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, గోళ్ల సూరి, కృష్ణమూర్తి, దొడగట్ట మురళి, విజయ్ కుమార్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సాకే రామాంజినేయులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం.. నిర్వీర్యం
మహోన్నత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్– ఐసీడీఎస్) ఆచరణలో నిర్వీర్యమవుతున్నాయి. అంతులేని అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడంతో ఈ కార్యక్రమ లక్ష్యం కాస్త నీరుగారి పోతోంది. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. అనంతపురం సిటీ: చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులోని పోషకాహార లోపం, ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి అవసరాలను పరిష్కరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐసీడీఎస్ పథకం అమలులో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పిల్లలకు అనుబంధ పోషణ, రోగనిరోధక టీకాలు, ప్రీ–స్కూల్ విద్య అందించడం లక్ష్యంగా 1975లో ఈ పథకం ప్రారంభమైంది. అనంతరం అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లీపిల్లల సంపూర్ణ అభివృద్ధి కోసం సమగ్ర సేవల ప్యాకేజీని అందించే ప్రపంచంలోని అతిపెద్ద ప్రాయోజిత కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతులేని అలసత్వం.. పేదరికం, అవగాహన లేమి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు పోషకాహార లోపంతో బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి వారిలో ప్రసవ సమయం హైరిస్క్‌గా మారి తల్లీబిడ్డల ప్రాణానికే ముప్పు వాటిల్లుతోంది. గర్భం దాల్చిన పేద మహిళలకు పోషకాహారం అందించాల్సిన ప్రభుత్వం.. కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. గత ప్రభుత్వంలో అందించిన సంపూర్ణ పోషకాహారం కిట్లను సైతం పంపిణీ చేయడంలో ప్రభుత్వం అంతులేని అలసత్వం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలు పోతున్నా పట్టదా..? అనంతపురంలోని సర్వజనాస్పత్రికి ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణులు కాన్పు కోసం వస్తుంటారు. ఇక్కడ ప్రతి నెలా వందల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే ప్రసవం కోసం జీజీహెచ్‌కు వచ్చేవారిలో రక్తహీనతతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. రక్తంలో హిమోగ్లోబిన్ పది గ్రాముల శాతం కంటే తక్కువగా ఉంటే రక్తహీనతగా, ఏడు గ్రాములు, అంతకంటే తక్కువగా ఉంటే తీవ్రమైన రక్తహీనతగా పరిగణిస్తారు. జీజీహెచ్‌కు వచ్చే గ్రామీణ గర్భిణులు ప్రతి వంద మందిలో ఆరు గ్రాముల కంటే హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న వారు 15 మందికి పైగా ఉంటున్నట్లు సమాచారం. సాధారణంగా హిమోగ్లోబిన్ 9 గ్రాముల కంటే తక్కువగా ఉంటే ప్రసవం కష్టతరం (రిస్క్)గా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇక ఆరు గ్రాముల కంటే తక్కువ ఉన్నవారిని హైరిస్క్‌గా పరిగణించి రెండు, మూడు యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వస్తోందని అంటున్నారు. సమగ్రంగా వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో కేవలం సరైన పోషకాహారం అందక రక్తహీనతతో బాధపడుతూ ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారంటే అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. రక్తహీనత తీవ్ర రూపం మహిళాశిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మధ్య సమన్వయ లోపం కారణంగా గర్భిణులకు పోషకాహారం సక్రమంగా అందడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటీవ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా మ్యాపింగ్ సక్రమంగా సాగలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేద గర్భిణులకు పోషకాహారం అందించడమనేది అందని ద్రాక్షగానే మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గర్భిణులకు సంపూర్ణ పోషకాహార కిట్లను అందించేవారు. ఇందులో పాలు, కందిపప్పు, చిక్కీలు, నూనె, బియ్యం, కోడిగుడ్లు వంటివి ఉండేవి. ప్రస్తుతం రేషన్‌బియ్యం, పుచ్చిపోయిన కందిపప్పు, నాసిరకంగా ఉండే రాగిపిండి వంటివి సరఫరా చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. దీంతో గర్భిణుల్లో రక్తహీనత సమస్య మరింత తీవ్ర రూపం దాల్చి మాతాశిశు మరణాలకు దారి తీస్తోంది. ఇప్పటికై నా ఐసీడీఎస్ అధికారులు స్పందించి మాతాశిశు సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆశించిన ఫలితాలనివ్వని ఐసీడీఎస్ గర్భిణులకు అందని పోషకాహారం పథకం అమలుపై అధికారుల అలసత్వం పెరుగుతున్న రక్తహీనత బాధితులు కొనసాగుతున్న మాతాశిశు మరణాలు -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రాప్తాడు రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని అయ్యవారిపల్లి క్రాస్ సమీపంలో జాతీయ రహదారి–44పై శనివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన కోనేపల్లి ఆదినారాయణరెడ్డి (61) బస్సులకు అవసరమైన విడిభాగాలు తీసుకురావడానికి ఉదయం బైకులో రాప్తాడు ఆటోనగర్‌కు వచ్చాడు. విడిభాగాలు తీసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తూ అయ్యవారిపల్లి క్రాస్ వద్ద అనంతపురం వైపు వెళ్తుండగా బెంగళూరు వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆదినారాయణరెడ్డి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కథల పోటీలకు ఆహ్వానం అనంతపురం కల్చరల్: రాయలసీమ సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో సాగే కథా రచన పోటీలను నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి తెలిపారు. రాయలసీమ ఉద్యమనేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి స్మారకార్థం నిర్వహిస్తున్న కథల పోటీలకు రచనలు నవంబర్ 10లోపు పంపాలని కోరారు. రూ.20 వేల వరకు నగదు బహుమతులందిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 9963917187 నంబర్లో సంప్రదించాలన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కండి ● సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అనంతపురం అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని సీపీఐ నాయకులు, శ్రేణులకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శులు పి.నారాయణ స్వామి, వేమయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి రామకృష్ణతో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, కార్యవర్గ సభ్యుడు సి.జాఫర్ హాజరయ్యారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాక్షేత్రంలో విఫలమయ్యారన్నారు. తక్షణం రైతుల రుణాలను మాఫీ చేయాలన్నారు. పంట నష్ట పరిహారం, బీమా అందించాలన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే నినాదంతో డిసెంబరు 1,2,3 తేదీల్లో జైలు భరో తలపెట్టామని, కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడి, సభ్యులు కాటమయ్య పాల్గొన్నారు. కూలి పనులకు వెళ్లి కానరాని లోకాలకు పామిడి: రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని పాళ్యం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏకుల నారాయణస్వామి, ఏకుల సువర్ణమ్మ (46) దంపతులు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. దంపతులిరువురూ వ్యవసాయంతో పాటు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. సువర్ణమ్మ శనివారం శంకర్‌కు సంబంధించిన వరిమడిలో కలుపు మొక్కల తొలగింపునకు కూలీగా వెళ్లింది. సాయంత్రం పనులు ముగించుకుని ట్రాక్టర్ ఇంజిన్‌కు వెనుక ట్రాలీలా ఏర్పాటు చేసుకున్న టైరుబండిలో కూర్చుని ఇంటికి తిరుగు పయనమైంది. ఉన్నఫళంగా ట్రాక్టర్ ఇంజిన్ ఉక్కుకు ఉన్న పిన్ తెగిపోవడంతో టైరు బండి బోల్తా పడింది. ఈ క్రమంలోనే బండి చక్రం కిందపడిన సువర్ణమ్మ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో ఉన్న మిగతా 8 మంది మహిళా కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. మృతురాలి భర్త ఏకుల నారాయణస్వామి ఫిర్యాదు మేరకు పామిడి పోలీసులు కేసు నమోదు చేశారు. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ బొమ్మలసత్రం: రెండు తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ 93 కేసుల్లో నిందితునిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగను నంద్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ సుస్మిత నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. గత నెల 20వ తేదీన స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని మహానంది కాలనీలో చోరీ జరిగింది. ఒక ఐఫోన్, వాచ్, స్కూటీ అపహరించినట్లు బాధితులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అధునాతన సాంకేతికత ద్వారా దర్యాప్తు చేపట్టి ఆచూకీ గుర్తించారు. జిల్లాలోని వెస్ట్ కోడిపల్లెకు చెందిన శివగా గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 93 దొంగతనాల కేసుల్లో ఉన్నట్లు అంగీకరించాడు. చోరీ చేసిన సెల్ ఫోన్, వాచ్, స్కూటీలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. -
గవిమఠం ఉత్తరాధికారినే పీఠాధిపతిగా నియమించాలి
ఉరవకొండ: స్థానిక గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామినే అధికారికంగా పీఠాధిపతిగా నియమించాలని కర్ణాటక, తెలుగు రాష్ట్రాల మఠం భక్తులు, వీరశైవ, జంగమ, లింగాయత్ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. శనివారం స్థానిక గవిమఠం ఆవరణంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. గవిమఠానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రాతినిధ్యం లేని కల్యాణ స్వామి ఒక చట్టబద్ధత లేని నామినేషన్ డీడ్‌ను చూపుతూ తానే ఉత్తరాధికారి అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ కరిబసవరాజేంద్రస్వామి విధులకు ఆటంకం కల్గిస్తున్నాడన్నారు. పరిపాలన వ్యవహారాలు, కార్యక్రమాల్లో తలదూర్చి, వివాదాలు సృష్టిస్తూ మఠం ప్రతిష్టను దిగజారుస్తున్నాడన్నారు. 1975లోనే గవిమఠం పీఠాధిపతులు శివైక్య చెన్నబసవరాజేంద్రస్వామి, మఠం ఉత్తరాధికారిగా కరిబసవస్వామిని చేసేందుకు నామినేషన్ డీడ్ రాసి చట్టబద్ధంగా ఆమోదం కోసం దేవదాయ శాఖ కమిషనర్‌కు పంపగా, కమిషనర్ ధ్రువీకరించి 2005 జనవరి 1 నుంచి మఠం ఉత్తరాధికారిగా కరిబసవరాజేంద్రస్వామిని నియమించారన్నారు. అయితే, మఠం పీఠాధిపతుల వద్ద కల్యాణస్వామి ఉత్తరాధికారిపై తప్పడు ప్రచారం చేసి దురుద్దేశంతో నామినేషన్ డీడ్ రాయించుకుని కమిషనర్ వద్దకు ఆమోదం కోసం పంపాడన్నారు. ఆ నామినేషన్‌ను కమిషనర్ ఆమోదించకుండా, ధార్మిక పరిషత్ ఆదేశాల మేరకు మఠం విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గవిమఠం ఉత్తరాధికారిగా కరిబసవరాజేంద్రస్వామే కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అధికారిక ఉత్తర్వులతో కొనసాగుతున్న ఉత్తరాధికారి విధులకు ఆటంకం కల్గిస్తున్న కల్యాణస్వామిపై ధార్మిక పరిషత్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం
● యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అనంతపురం ఎడ్యుకేషన్: పోరాటాలు, ఉద్యమాల ద్వారానే ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. శనివారం అనంతపురంలోని నేతాజీ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వారు మాట్లాడారు. అంతర్ జిల్లా పునర్విభజన, వేతన సవరణ సంఘం సాధన, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, పెండింగ్ డీఏలు, ఆర్థిక బకాయిల సాధన కోసం ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన వేతన సవరణ, డీఏలు, ఆర్థిక బకాయిలపై యూటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. రణభేరి కార్యక్రమాలతో పాటు ఏపీ జేఏసీ ఏర్పాటు వరకు, జేఏసీతో కలిసి 12వ వేతన సవరణ సంఘం కోసం ముఖ్యమంత్రితో చర్చల వరకు జరిగిన పరిణామాలను ఉపాధ్యాయులకు వివరించామని తెలిపారు. టెట్ విషయంలోనూ యూటీఎఫ్ అనేక పోరాటాలు చేసిందన్నారు. సమగ్ర శిక్షలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్న శారీరక విద్యా ఉపాధ్యాయులకు కనీస వేతన శ్రేణి వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, నాయకులు శ్రీనివాసులు, రామకృష్ణనాయక్, అర్జున్శేఖర్, రవికుమార్, చంద్రమోహన్, రామాంజనేయులు పాల్గొన్నారు. -
ఆస్తి పంచివ్వలేదని ఆత్మహత్యాయత్నం
● తల్లి, ఇద్దరు బిడ్డలను రక్షించిన పోలీసులు శింగనమల: ఆస్తి పంపకాలు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ తల్లి తన కుమారుడు, కుమార్తెతో కలిసి చెరువులోకి దూకేందుకు యత్నించిన ఘటన శింగనమల వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీ భర్త ఆంజనేయులు 10 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి ఒక కుమారుడు (16 ఏళ్లు), కుమార్తె (17 ఏళ్లు) సంతానం. ఇటీవల చాకలి లక్ష్మీకి ఆస్తి పంపకాలు చేసివ్వకుండా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన బిడ్డలతో కలిసి శనివారం శింగనమల చెరువు వద్దకు చేరుకుని ఆత్మహత్యకు యత్నించింది. సమీపంలో రోడ్డు పని చేస్తున్న కూలీలు వీరిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ ఆశోక్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ బాషా, పీసీ సంపత్‌లు ఘటనాస్థలికి చేరుకుని తల్లీబిడ్డలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ ప్రసాద్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు. -
దళిత రైతుపై దౌర్జన్యం దుర్మార్గం
● సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ అనంతపురం అర్బన్: ‘‘విద్యుత్ ట్రాన్స్మిషన్ ఏర్పాటు కోసం బొమ్మనహాళ్ మండలంలో దళిత రైతుపై దౌర్జన్యం చేసి పంటను ధ్వంసం చేయడం దుర్మార్గం. పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దారుణ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలి’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ అన్నారు. శనివారం స్థానిక గణేనాయక్ భవన్లో జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్పతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. బొమ్మనహాళ్ మండలం శ్రీదరఘట్ట గ్రామంలో రిసోనియా అనే ప్రైవేటు కంపెనీకి కారుచౌకగా భూములను కట్టబెట్టారన్నారు. ఎల్బీనగర్కు చెందిన అమర్, రామసుబ్బమ్మ, లక్ష్మిదేవి, సుంకన్న తదితర పేద రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దారుణమన్నారు. పెద్దసంఖ్యలో పోలీసులతో వెళ్లి భయాందోళన సృష్టిస్తూ పచ్చని పంటలను నాశనం చేయడం సర్కారు నిరంకుశత్వానికి పరాకాష్ట అంటూ ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లాలో అక్కడి కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ (ఆర్సి.బి5.1298/2024) ప్రకారం ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణ క్రమంలో నష్టపోతున్న రైతులకు సెంటుకు రూ.85 వేల చొప్పున పరిహారంతో పాటు జాతీయ రహదారి సమీప భూములకు అదనంగా 150 శాతం ధర, ఆర్ఓఆర్ పరిహారం 30 శాతం, పంటలు, బోరుబావులకు నష్ట పరిహారాన్ని నిర్ణయించారన్నారు. నంద్యాల తరహాలో ఈ జిల్లాలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దళితుడైన సుంకన్నతో పాటు ఇతర రైతులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. చేతికి వచ్చిన మొక్కజొన్న పంటను జేసీబీతో ధ్వంసం చేశారన్నారు. ఈ దారుణానికి పాల్పడిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వెంటనే కేసు నమోదు చేయాలన్నారు. కలెక్టర్, ఎస్పీ స్పందించి విచారణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శివర్గ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు. -
పట్టా భూముల్లో పరిటాల పెత్తనం
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత పెరిగింది. వాయువ్య దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చీనీ టన్ను రూ.15,500 అనంతపురం మార్కెట్ యార్డులో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.15,500, కనిష్టం రూ.7 వేలు పలికాయి. ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026సాక్షి, పుట్టపర్తి: పరిటాల కుటుంబం దౌర్జన్యాలు, దుర్మార్గాలకు అంతేలేకుండా పోతోంది. నమ్మి ఓట్లేసిన జనాన్ని నట్టేట ముంచేందుకు సిద్ధమైంది. పరిటాల కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరుల దుర్మార్గాలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. తాజాగా సొంతమండలం రామగిరిలోని రైతుల పట్టా భూములపై పరిటాల కుటుంబం పెత్తనం చేస్తోంది. ‘‘ఎవడి భూమైతే మాకేంటి...మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం’’ అంటూ దౌర్జన్యంగా వ్యవహరిస్తోంది. అంతా మేమే చేసుకుంటామని హామీ.. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం దుబ్బార్లపల్లి, ముత్యాలంపల్లి, మక్కినవారిపల్లి, చిన్నకొండాపురం, పెద్ద కొండాపురం, నసనకోట, రెడ్డివారిపల్లి గ్రామాలతోపాటు కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో సోలార్, విండ్ పవర్ గ్రిడ్ టవర్లు నిర్మించేందుకు జేఎస్‌డబ్ల్యూ, అమరరాజ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం స్థానికంగా ఉన్న నాయకులను కలిసి టవర్ల నిర్మాణాలకు భూసేకరణ చేపట్టాలని ఆయా కంపెనీలు భావించాయి. ఈ క్రమంలో పరిటాల కుటుంబీకులను కలవగా...తాము అడిగినంత ఇస్తే అంతా తామే చూసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సదరు కంపెనీలు అంగీకరించడంతో రామగిరి మండలంలో సోలార్ విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. పరిటాల తిప్పన్న ఆధ్వర్యంలో పనులు.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువు పరిటాల తిప్పన్న టవర్ల నిర్మాణ పనులు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఒక్కో టవర్ నిర్మాణానికి కాంట్రాక్టర్ రూ.కోటికిపైగా అంచనాలు వేయగా, ఈ ప్రాంతంలోనే వంద టవర్లకుపైగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఒక టవర్ కేబుల్వైర్తోపాటు నిర్మాణానికి మూడు ఎకరాల భూమి కావాల్సి ఉండగా, రామగిరి మండలంలో అధికారులు నామమాత్రంగా సర్వేలు చేసి కాంట్రాక్ట్ పనులు అప్పగించారని బాధిత రైతులు వాపోతున్నారు. కర్ణాటక రైతులకు భారీగా పరిహారం.. రామగిరికి సమీపంలోనే కర్ణాటక సరిహద్దు ఉంటుంది. రామగిరి మండలంలో టవర్లు నిర్మిస్తున్న కంపెనీలే అక్కడా రైతుల భూముల్లో సోలార్ టవర్లు నిర్మిస్తున్నాయి. కర్ణాటక రైతులకు ఒక్కో టవర్ నిర్మాణానికి భూమి తీసుకున్నందుకు రూ.40 లక్షలు ఇస్తున్నాయి. అలాగే విద్యుత్ తీగలు పొలంలో ఎంత మేర వెళ్తే అంత మేర మీటర్‌కు రూ.30 వేల చొప్పున సపరేట్గా డబ్బులు ఇస్తున్నారు. కానీ రామగిరి మండలంలో ఇలాంటి ఒప్పందాలేమీలేవు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఎవరిని కలవాలో, ఎవరికి తెలపాలో కూడా తెలియడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం రామగిరి మండలంలోని రైతుకు సమాచారం ఇవ్వకుండానే వారి భూముల్లో యంత్రాల సాయంతో పెద్దపెద్ద గుంతలు తవ్వి కరెంట్ స్తంభాలు వేసేందుకు సిద్ధపడుతున్నారు. తమకు న్యాయం జరగకపోతే అందరం కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగుతామని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. అరకొర ఇచ్చేందుకు ప్లాన్.. ఇప్పటికే సోలార్ టవర్ల నిర్మాణాలు చేపట్టిన పరిటాల కుటుంబం... విషయం పెద్దదైతే రైతులకు అరకొర ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘‘ఇక్కడేం పండుతుంది.. ఎకరం రూ.3 లక్షలు కూడా పలకదు.. టవర్ కోసం మహా అయితే 20 సెంట్లు తీసుకుంటారు. మీరడిగితే రూ.2 లక్షలకు మించి ఇవ్వరు. మా ద్వారా వెళితే..రూ.5 లక్షల వరకూ ఇప్పిస్తాం..అందరినీ తీసుకురా’’ అంటూ ఆయా గ్రామాల్లోని బాధిత రైతులకు తమ అనుచరుల ద్వారా చెప్పిస్తున్నారు. రామగిరి మండలంలో సోలార్ విద్యుత్ టవర్ల నిర్మాణం రైతులకు తెలియకుండానే భూముల్లో నిర్మాణ పనులు ప్రశ్నించిన రైతులపై పరిటాల బంధువుల దౌర్జన్యం ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో రైతులు రూ.వందలకోట్ల ప్రాజెక్ట్‌కు అన్నీ తామై వ్యవహరిస్తున్న ‘పరిటాల’ నోరెత్తితే తంతారయ్యా కర్ణాటకలో ఒక్కో టవర్ నిర్మాణానికి రూ.40 లక్షలు ఇస్తున్నారు. ఇక్కడేమో మాకు కనీసం సమాచారం ఇవ్వలేదు. మా పొలంలో టవర్ నిర్మించడంతో పాటు లైను లాగుతున్నారు. దీంతో పంటలు పెట్టుకోలేం. ఆ భూములను ఎవరూ కొనరు. ఏం చేయాలయ్యా. మేమూ టీడీపీ వాళ్లమే. మా ప్రభుత్వంలోనే మాకు ఇంత అన్యాయం జరుగుతోంది. ఏమైనా అడిగితే పరిటాల బంధువులు తంతారయ్యా. ఏం చేస్తాం..మా ఖర్మ ఇలా ఉంది. – పేరు చెప్పేందుకు భయపడుతున్న దుబ్బార్లపల్లికి చెందిన రైతు ఆవేదన ఇది గ్రామసభల ఊసేలేదు.. కంపెనీల ఏర్పాటు, అభివృద్ధి పనులు, ఇతరత్రా పనులకైనా రైతుల భూములు సేకరించాలంటే ముందుగా గ్రామ సభ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి పనులు చేపడతున్నారో రైతులకు వివరించాల్సి ఉంటుంది. అనంతరం రైతులు, అధికారుల సమక్షంలోనే పరిహారం గురించి చర్చించాల్సి ఉంటుంది. రైతులంతా ఒప్పుకుంటేనే అగ్రిమెంట్ చేసుకుని వారి పొలాల్లో పనులు చేపట్టాలి. కానీ రామగిరి మండలంలోని రైతులకు అలాంటి అవకాశమే లేకుండా పోయింది. సోలార్ విద్యుత్ టవర్ల నిర్మాణం చేపట్టిన కంపెనీలతో ‘పరిటాల’ కుటుంబమే పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. దీంతో వారు గ్రామసభల ఏర్పాటు ఇతరత్రా వ్యవహారాల జోలికి వెళ్లలేదు. అటు కంపెనీ నుంచి భారీగా డిమాండ్ చేస్తున్న పరిటాల కుటుంబీకులు రైతులకు మాత్రం సమాచారం లేకుండానే పనులు ప్రారంభించడం గమనార్హం. దుబ్బార్లపల్లిలో నాలుగు టవర్లు ఏర్పాటవుతుండగా..భూనిర్వాసితులంతా టీడీపీ నాయకులే. కానీ మట్టినమూనాల కోసం గుంతలు తీస్తున్నామని చెప్పి...ఇప్పుడు ఏకంగా టవర్ల ఏర్పాటు కోసం గుంతలు తవ్వుకున్నారు. చిన్నకొండాపురం, పెద్ద కొండాపురం, రెడ్డివారిపల్లిలో తమకు ఇష్టంలేదని రైతులు అభ్యంతరం తెలుపుతున్నా పట్టించుకునే వారే లేరు. రామగిరి మండలం దుబ్బార్లపల్లిలోని ఓ రైతు పొలంలో సోలార్ విద్యుత్ టవర్ నిర్మాణం కోసం జరుగుతున్న పనులివి. రైతుకు తెలియకుండానే పొలంలో భారీగా గుంతలు తవ్వుతున్నారు. గ్రామ సభ నిర్వహించకుండా...పరిహారం తేల్చకుండానే పనులు ప్రారంభించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రామగిరి మండలంలోని దుబ్బార్లపల్లి, ముత్యాలంపల్లి, మక్కినవారిపల్లి, చిన్నకొండాపురం, పెద్ద కొండాపురం, రెడ్డివారిపల్లి గ్రామాల్లోని రైతుల పొలాల్లో దాదాపు వంద సోలార్ విద్యుత్ టవర్ల నిర్మాణానికి ఆయా కంపెనీలు సిద్ధం కాగా, వ్యవహారమంతా పరిటాల కుటుంబీకుల కనుసన్నల్లో సాగుతోంది. దీంతో నోరు మెదపలేని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
జీఎస్‌బీసీకి నీరు వదలాలి
గుంతకల్లు రూరల్: ‘తీవ్ర వర్షాభావం, రోజురోజుకూ అడుగంటిపోతున్న భూగర్భ జలాల కారణంగా గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజల గొంతెండుతుంది. కనీసం ఇప్పటికై నా గుత్తి సబ్ బ్రాంచ్ కెనాల్ (జీఎస్‌బీసీ) ద్వారా నీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చాలి’ అని రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పీడబ్ల్యూడీ కార్యాలయం వద్ద గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల రైతులు ఆందోళన చేపట్టారు. హంద్రీ–నీవా జలాల పంపిణీ తమ చేతుల్లో లేదని అధికారులు చెప్పడంతో అక్కడి నుంచి రాజేంద్రనగర్‌లోని కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం నియోజకవర్గ కార్యదర్శి బాబూరావు, మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శింగనమల నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం శైలజా నాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు అనంత హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నాయకుడు ఒక్కరే గెలిస్తే అది విజయం కాదని, కార్యకర్త గెలిస్తేనే పార్టీ గెలిచినట్టని, పార్టీ గెలిస్తేనే ప్రజల గొంతు బలపడుతుందని అన్నారు. ప్రతి నాయకుడు తన పరిధిలోని గ్రామాలలో బాధ్యత తీసుకోవాలన్నారు. స్థానిక సమస్యలను గుర్తించాలని, వాటిపై అధికారులను ప్రశ్నించాలని, అవసరమైతే ఉద్యమించాలని కోరారు. జెడ్పీ పీఠం సాధించాలి శింగనమల నియోజకవర్గంలోని ఆరు జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలవడంతో పాటు జిల్లాపరిషత్ అధ్యక్షపీఠం సాధించాలని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ సూచించారు. జెడ్పీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాన్ని తీసిన చోటే.. సగౌరవంగా నిలువెత్తు చిత్రపటం పెట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పదవుల కోసం జరిగే ఎన్నికలు కాదని, గ్రామాల్లో ప్రజలతో ఎవరు ఉన్నారు.. ప్రజల కష్టాల్లో ఎవరు నిలబడ్డారు.. ప్రజల సమస్యల కోసం ఎవరు పోరాడారు? అనే దానికి ప్రజలు ఇచ్చే తీర్పు అని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యం ‘స్థానిక’ అభ్యర్థుల ఎంపిక విషయంలో వైఎస్సార్సీపీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం చాలా ముఖ్యమన్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి అందరూ కలిసి పనిచేయాలన్నారు. శింగనమల నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తనూ కలుపుకొని ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, నాయకులు గార్లదిన్నె నారాయణరెడ్డి, బొమ్మన శ్రీరాంరెడ్డి, వంశీ గోకుల్‌రెడ్డి, భోగాతి ప్రతాపరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, ఖాదర్ వలిఖాన్, నాయకులు మంజునాథ్, శ్రీనివాసులు నాయక్, అంకె ముసలన్న, కల్లూరు సూర్యనారాయణ, ఎం నాగేశ్వరరెడ్డి, జయరాం రెడ్డి, ఆదినారాయణ, బోనాల హరికృష్ణ, శ్యాంసుందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నూర్ మహమ్మద్ విష్ణు నారాయణ, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు -
వేతనాలు అందవు.. వెతలు తీరవు
పండగ పూటా పస్తులే అనంతపురం న్యూ టౌన్: ‘ఆర్డబ్ల్యూఎస్ అధికారు లు, శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లు మీకు జీవితాలు ఇవ్వకపోతే.. మా సొంత నిధుల నుంచి మీ కు వేతనాలు చెల్లించి ఆదుకుంటాం.. తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరండి.. ప్రజల దాహం తీర్చండి..’ అంటూ కార్మికులకు టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ ‘నీటి మూటలు’గా నిలిచిపోయింది. సమ్మె విరమించిన తర్వాత జీతాల గురించి ప్రశ్నించిన సుమారు 30 మందిని విధుల నుంచి తొలగించారు. అవస్థలు వర్ణనాతీతం నీలకంఠాపురం శ్రీరామరెడ్డి వాటర్ సప్లై స్కీం ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పీఏబీఆర్, కళ్యాణదుర్గం, రాయదుర్గం, బెళుగుప్ప, పరిగి, హిందూపురం, మడకశిర డివిజన్లో 900 పైగా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. కరోనా సందర్భంలో కూడా తాగునీరు నిరంతరంగా అందించిన ఘనత కార్మికులదే.. ఈ స్కీం లో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం సకాలంలో అందని వేతనాలు, నెలల తరబడి జమ కాని ప్రావిడెంట్ ఫండ్ నిధుల సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ స్కీంలో పనిచేస్తున్న కార్మికులకు కుటుంబ పోషణ భారమైంది. లైన్‌పై పని చేసే లైన్మెన్లు, ఫిట్టర్లు, పంప్ ఆపరేటర్లు, హెల్పర్లు తదితర కార్మికులకు బండిపై వెళ్లేందుకు పెట్రోలుకు కూడా డబ్బులేక అప్పులు చేస్తున్నారు. పిల్లల చదువులు, కుటుంబ పోషణకు పడరానిపాట్లు పడుతున్నారు. పె(గ)ద్దలదే రాజ్యం ఉమ్మడి అనంతపురం జిల్లాలలో 18 ఏళ్ల క్రితం నెలకొల్పిన నీలకంఠాపురం శ్రీరామరెడ్డి వాటర్ సప్లై స్కీం పరిశుభ్రమైన తాగునీరు 10 లక్షల మంది ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏర్పడింది. ఈ స్కీమును కాలక్రమేణా రాజకీయ పె(గ)ద్దల ప్రమేయంతో భాగాలుగా విడగొట్టారు. కార్మికులు జీతాలు అడిగితే కొత్త అగ్రిమెంటు జరగలేదు. అందువల్ల తాము జీతాలు ఇవ్వలేక పోతున్నామంటూ చెబుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు రానందున కార్మికులకు బకాయిలు ఇవ్వలేమని చెబుతున్నారు. అందువల్ల నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు తమ డిమాండ్ల సాధనకై సమ్మెలోకి వెళ్తున్నందున తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు సమ్మె నోటీసులివ్వడం.. వారిని అటు కాంట్రాక్టర్లు.. ఇటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నయానో భయానో దారిలోకి తెచ్చుకొని ‘నీటి మూట’ లాంటి హామీలు ఇవ్వడం.. కార్మికులను తిరిగి ప్రాజెక్టులో పనిచేసేలా దారికి తెచ్చుకోవడం పరిపాటి అయిపోయింది. శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పనిచేసే కార్మికులు వినాయక చవితి పండుగ పూట కూడా జీతాలందక పస్తులతోనే సహ జీవనం చేయాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలలో ప్రశ్నించిన పాపానికి జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడిన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. మడకశిర ప్రాంతంలో ప్రాజెక్టునే నమ్ముకుని బతుకుతున్న సుబ్బరాజు అనే కార్మికుడు గత జూలై నెలలో తినేందుకు పిడికెడు అన్నం లేక గుడిబండ మండలంలో ఓవర్‌హెడ్ ట్యాంక్ ఎక్కి కిందకు దూకి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతని బాధను సెల్‌ఫోన్ ద్వారా విన్న ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు ‘తక్షణమే మీ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఆత్మహత్యకు పాల్పడవద్దు’ అంటూ ఇచ్చిన హామీ సైతం నెరవేరలేదు. శ్రీరామరెడ్డి కార్మికుల ఆకలికేకలు కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్న ప్రజాప్రతినిధులు వంతపాడుతున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు -
పరిహారం పెంచి నిర్మాణాలు చేపట్టండి
బొమ్మనహాళ్: పరిహారం పెంచాకనే నిర్మాణాలు చేపట్టాలంటూ పవర్ గ్రిడ్ టవర్ల పనులను రైతులు అడ్డుకున్నారు. మండలంలోని ఎల్బీ నగర్ సమీపంలో విద్యుత్ పవర్ గ్రిడ్ టవర్ల నిర్మాణం శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో రాయదుర్గం, కళ్యాణదుర్గం రూరల్ సీఐలు వెంకటరమణ, గంగాధర, బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్ ఎస్ఐలు నబీరసూల్, నాగమధు, గురుప్రసాద్రెడ్డితో పాటు భారీగా పోలీసులు మోహరించారు. పోలీసు బందోబస్తు నడుమ టవర్ల నిర్మాణానికి కంపెనీ ప్రతినిధులు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తగిన పరిహారం చెల్లించకుండా బలవంతంగా తమ వ్యవసాయ భూముల్లో పనులు చేపడుతున్నారంటూ బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో ఎకరానికి రూ.12 లక్షలు ఇస్తుండగా, ఇక్కడ రూ.4 లక్షలు ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయమైన పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, అయినప్పటికీ టవర్ ఏర్పాటుకు అధికారులు, కంపెనీ ప్రతినిధులు చర్యలు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవర్ గ్రిడ్ పనులను అడ్డుకున్న రైతులు లక్ష్మీ, సుబ్బమ్మ, అమర్‌తో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం పొలంలో మొక్కజొన్న పంటను తొలగించి పనులు చేపట్టడం గమనార్హం. -
అంతర్జాతీయ రెజ్లింగ్ సెలెక్షన్ ట్రయల్స్‌కు ఎంపిక
పామిడి/అనంతపురం: అంతర్జాతీయ రెజ్లింగ్ సెలెక్షన్ ట్రయల్స్‌కు స్థానిక ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని కొప్పల అనూష ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ అరుణ తెలిపారు. ఈ నెల 20 నుంచి రెండు రోజుల పాటు చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌లో జరగనున్న ట్రయల్స్‌లో అనూష పాల్గొంటుందన్నారు. అండర్–17 కేటగిరీలో 40 కిలోల విభాగంలో కొప్పల అనూష పాల్గొని తన ప్రతిభను చాటుకోనున్నారు. ఈ పోటీల్లోనూ రాణించి దక్షిణ అమెరికాలోని రియో డి జనీరోలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. విద్యార్థిని ప్రయాణ ఖర్చుల నిమిత్తం అధ్యాపకులు చందారూపాన రూ.11,500 వసూలు చేసి అందజేశారు. ● అనూష ప్రయాణ ఖర్చులను తాను భరిస్తానంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భరోసానిచ్చారు. దీంతో శుక్రవారం ఎమ్మెల్యేను అనూష కలిసి కృతజ్ఞతలు తెలిపింది. అనూష వెంట డీఎస్డీఓ మంజుల, భారత కుస్తీ కోచ్ ఎన్.రాఘవేంద్ర ఉన్నారు. -
వైఎస్సార్సీపీలో నిబద్ధతకే పెద్దపీట
కళ్యాణదుర్గం: పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న వారికి పెద్ద పీట వేస్తున్నామని, అలాంటి వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో దించి సమష్టిగా గెలిపించుకుందామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కళ్యాణదుర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, నియోజకవర్గ పరిశీలకుడు మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ రైతు, విద్యార్థి, ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు కూటమి పార్టీల నేతల అవినీతి అక్రమాలు, అరాచకాలు పేట్రేగిపోతున్నాయని, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని సూచించారు. పంచాయతీలలో అభ్యర్థుల ఎంపిక– వారి గెలుపు బాధ్యతలను స్థానిక నాయకులు, కార్యకర్తలే తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గుర్తింపు కార్డులను అందజేశారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సమన్వయకర్త తలారి రంగయ్య పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. ధనార్జనే ధ్యేయంగా అక్రమాలు, దోపిడీలకు తెగబడుతున్నారన్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారన్నారు. ప్రజల పక్షాన నిలిచి, సంక్షేమానికి పాటుపడే వైఎస్సార్సీపీ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సమష్టిగా పనిచేసి గెలిపించుకుందాం వైఎస్సార్సీపీ శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు అనంత పిలుపు -
గ్రామీణ క్రీడాకారులకు ఉపకరించేలా స్కూల్ చాంపియన్‌షిప్
● సీఎం కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆనంద్ ప్రజెంటేషన్ అనంతపురం అర్బన్: గ్రామీణ క్రీడాకారులకు ఉపకరించేలా జిల్లాలో స్కూల్ చాంపియన్ షిప్ అమలు చేశామని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అమరావతిలో జరిగిన సీఎం కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో క్రీడల చాంపియన్‌షిప్ నిర్వహించామన్నారు. పీ–4 విధానంలో క్రీడా ఉపకరణాలు, మెడల్స్ అందించే విధానాన్ని రూపొందించామన్నారు. స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పేరిట రూ.20 లక్షల వ్యయంతో క్రీడా పోటీలు నిర్వహించామని చెప్పారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి అక్కడి నుంచి జాతీయ స్థాయికి వెళ్లేలా క్రీడాకారుల్ని ప్రోత్సహించామన్నారు. -
ఎయిడ్స్ నియంత్రణలో జిల్లాకు అవార్డు
అనంతపురం సిటీ: ఎయిడ్స్ నియంత్రణలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించినందుకు గాను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు ప్రతిష్టాత్మకమైన సక్షం (ఎస్ఏకేఎస్హెచ్ఏఎం) అవార్డు దక్కింది. ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించి యూనిటైడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవీ/ఎయిడ్స్ (యుఎన్ఏఐడీఎస్) సంస్థ 2030 నాటికి 95–95–95 లక్ష్యాలను సాధించాలని సభ్య దేశాలకు దిశానిర్దేశం చేసింది. ఇందులో మొదటి 95లో భాగంగా జిల్లాలో హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందిని గుర్తించడం, రెండో భాగంలో వారికి వంద శాతం సంపూర్ణ చికిత్స అందించడం, మూడో భాగంలో చికిత్స పొందిన వారిలో వంద శాతం వ్యాధిని అణిచివేయడం లక్ష్యాలు కాగా, వీటిని సాధించిన జిల్లాలకు ప్రగతి ఆధారంగా సంఘర్షశీల్, సక్షం, సురక్షిత్, సురక్షిత ప్లస్‌గా విభజించి అవార్డులను ప్రకటించారు. ఈ ప్రగతి ఆధారంగా సంఘర్షశీల్ స్థితి నుంచి సక్షం స్థితికి చేరిన జిల్లా వైద్యాధికారులను అభినందిస్తూ ఈ నెల 8న విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సక్షం అవార్డును ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్‌రాజ్ ప్రదానం చేశారు. శుక్రవారం డీఎంహెచ్ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లును జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ వెంకటరత్నం, సీపీఓ రమణ కలసి అవార్డును అందజేశారు. వివాహిత ఆత్మహత్య శింగనమల: మండలంలోనివె వెస్ట్ నరసాపురం గ్రామంలో ఓ వివాహిత శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ ప్రసాద్ తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన మల్లేశ్వరి(26)కి నార్పల మండలం బొందలవాడకు చెందిన నాగేంద్రతో ఒకటిన్నర సంవత్సరం క్రితం వివాహం జరిగింది. నెలరోజులకే భర్తతో ఉండడం ఇష్టం లేక మల్లేశ్వరి స్వగ్రామం వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాశీపురంలో వృద్ధురాలు.. రాయదుర్గం రూరల్: అనారోగ్యం బారిన పడిన హరిజన లక్ష్మక్క (78) అనే వృద్ధురాలు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన మండలంలోని కాశీపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన మేరకు లేట్ హరిజన గంగన్న భార్య లక్ష్మక్క ఒక్కగానొక్క కుమారుడితో ఉంటోంది. గురువారం రోజు వ్యవసాయ కూలి పనులకు కూడా వెళ్లి వచ్చింది. అయితే రాత్రి అనారోగ్యానికి గురైన ఆమె బాధను భరించలేక, కుమారుడు, కోడలికి చెప్పుకోలేక, శుక్రవారం ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
ఉమ్మడి ‘స్థానిక’ ఓటర్లు 25.18 లక్షలు
● ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం అనంతపురం న్యూ టౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 25.18 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి పి.విజయలక్ష్మి వెల్లడించారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జెడ్పీటీసీ స్థానాల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మొత్తం 847 మండల ప్రాదేశిక (ఎంపీటీసీ) స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో కంటే ఆరు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 841 స్థానాలకు ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకున్నారు. అప్పట్లో జిల్లాలోని పామిడి మండలాన్ని నగర పంచాయతీగా గుర్తించడంతో కొన్ని ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ మండలం నుంచి ఆరు స్థానాలతో కలిపి అనంతపురం జిల్లాలో 450 ఎంపీటీసీ స్థానాలకు పెరిగాయి. ఇదే సమయంలో శ్రీసత్యసాయి జిల్లాలో ఎంపీటీసీ స్థానాల్లో ఎలాంటి మార్పూ లేదు. ప్రస్తుతం అక్కడ 397 మండల ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మహిళా ఓటర్లే ‘కీలకం’ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 25,18,110 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,40,009 పురుషులు కాగా 12,77,947 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తంగా 154 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. అనంతపురం జిల్లాలో 6,73,335 మంది పురుష ఓటర్లు కాగా 6,78,835 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అనంతపురం జిల్లాలో 5,602 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కాగా శ్రీ సత్య సాయి జిల్లాలో మొత్తం 12,77,976 మంది కాగా.. వీరిలో 5,66,776 మంది పురుషులు కాగా 5,99,112 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే శ్రీ సత్యసాయి జిల్లాలో 32,336 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వీరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో కీలకంగా మారనున్నారు. ఇక జిల్లా ప్రాదేశిక స్థానాల విషయంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 63 ఉండగా అనంతపురం జిల్లాలో 31 స్థానాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 32 జిల్లా ప్రాదేశికస్థానాలు ఉన్నట్లు సీఈఓ విజయలక్ష్మి వివరించారు. అందుబాటులో ఓటరు జాబితాలు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో పల్లె ఓటరు తుదిలెక్క తేలింది. అన్ని గ్రామ పంచాయతీల తుది ఓటర్ల జాబితాలను అధికారులు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల వారీగా ఓటర్ల వివరాలతో తుది జాబితాలను సిద్ధం చేసి సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజ నాయుడు తెలిపారు. బీసీలే అత్యధికం అనంతపురం జిల్లాలో మొత్తం ‘స్థానిక’ ఓటర్లలో బీసీలు కీలకంగా మారనున్నారు. 8,02,409 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,97,406 మంది పురుషులు, 4,04,927 మంది మహిళలు, 76 మంది ఇతరులు ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 2,22,628 మంది కాగా.. వీరిలో 1,09,281 మంది పురుషులు, 1,13,313 మంది మహిళలు, 34 మంది ఇతరులు ఉన్నారు. ఎస్టీ ఓటర్లు జిల్లాలో 46,648 మంది ఉన్నారు. వీరిలో 23,334 మంది పురుషులు, 23,313 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు. ఇతర కేటగిరీలకు చెందిన ఓటర్లు 2,62,230 మంది ఉన్నారు. వీరిలో 1,32,430 మంది పురుషులు, 1,29,789 మంది మహిళలు, 11 మంది ఇతరులు ఉన్నారు. పంచాయతీల వారీగా తుది జాబితాలను ప్రజలు పరిశీలించుకోవచ్చు. -
నాణ్యత.. నగుబాటు
అనంతపురం సిటీ: మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలకు చంద్రబాబు సర్కార్ తెరలేపింది. యూనిఫాం పేరుతో అంగన్వాడీ కార్యకర్తలకు ఇటీవల సమకూర్చిన చీరలే ఇందుకు నిదర్శనం. నాణ్యత లేని చీరలు తమకొద్దని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ అధికారులకు వెనక్కు ఇచ్చేస్తుండడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వంలో భేష్! తాము నిర్వర్తిస్తున్న విధుల్లో క్రమశిక్షణ, వృత్తిపరమైన గుర్తింపు, సమానత్వాన్ని ప్రతిబింబించేలా చిరుద్యోగులకు ఏకరూప దుస్తుల (యూనిఫాం) విధానాన్ని గత ప్రభుత్వాలు అమలులోకి తీసుకువచ్చాయి. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాణ్యమైన చీరలను సమకూర్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల చీరల రంగు మార్చి సరఫరా చేసింది. జిల్లాలోని కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఇటీవల అధికారులు అందజేసిన ఈ చీరలు పూర్తి నాసిరకంగా ఉండడంతో వాటిని ధరించేందుకు చాలామంది వెనుకంజ వేశారు. ఒక్కో చీరకు రూ.250కు పైగా వెచ్చించినట్లు సమాచారం. అయితే ఈ చీరలు అంత ఖరీదు చేయవని, రూ.100 లోపే వీటి ధర ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. నాసిరకంగా ఉన్న ఈ చీరలు ధరిస్తే పిగిలి (చిరిగి) పోవడం ఖాయమనే భావన అంగన్వాడీ కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో చీరలు అందుకున్న అంగన్వాడీ కార్యకర్తలు వాటిని అధికారులకు తిరిగి ఇచ్చేయడం మొదలు పెట్టారు. 16 నుంచి ఆర్డీటీ బాలుర క్రికెట్ టాలెంట్ హంట్ అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రికెట్ క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందించే క్రమంలో ఆర్డీటీ చేపట్టిన క్రికెట్ టాలెంట్ హంట్ బాలుర విభాగం ఎంపికలు ఈ నెల 16 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఆర్డీటీ క్రీడా విభాగం డైరెక్టర్ సాయికృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 5కు బాలికల విభాగంలో ఎంపికలు పూర్తి కాగా, 16వ తేదీ నుంచి అక్టోబర్ 7 వరకు బాలుర విభాగంలో ఉమ్మడి జిల్లాలోని 14 మండల కేంద్రాల్లో ఎంపికలు చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటలకు ఎంపిక చేసే ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బాలుర ఎంపిక షెడ్యూల్ ఇలా.. ఈ నెల 16న మడకశిర, 17న పెనుకొండ, 18న హిందూపురం, 22న రాయదుర్గం, 23న కళ్యాణదుర్గం, 24న ఆత్మకూరు, 25న పుట్టపర్తి, 28న గుత్తి, 29న తాడిపత్రి, 30న గుంతకల్లు, అక్టోబర్ 1న ఉరవకొండ, 5న కదిరి, 6న ధర్మవరం, 7న అనంతపురంలో బాలుర ఎంపికలు జరగనున్నాయి. స్టేషన్ నుంచి దొంగ పరారీ? గుత్తి: పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ఓ దొంగ శుక్రవారం పరారైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గుత్తి, గుంతకల్లు, పామిడితో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగను నాలుగు రోజుల క్రితం గుత్తి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో ఉంచి విచారణ చేస్తున్నారు. అయితే పోలీసుల కన్ను గప్పి సదరు దొంగ పరారైనట్లు తెలిసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. -
గంజాయి ముఠా అరెస్టు
గుత్తి: పట్టణ పోలీసులు శుక్రవారం నలుగురితో కూడిన గంజాయి ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ కారును సీజ్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్లో వివరాలను సీఐ రామారావు విలేకరులకు తెలిపారు. రాయదుర్గం, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం ప్రాంతాలకు చెందిన ఎరుకల శ్రీనివాసులు, ఎరుకల సురేష్, ఎరుకల మంజునాథ్, వంశీలు ముఠాగా ఏర్పడి కర్ణాటక రాష్ట్రంలో గంజాయిని కొనుగోలు చేసేవారు. అనంతపురం, గుత్తి, గుంతకల్లు ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకునే వారు. పక్కా సమాచారం రావడంతో సీఐ నేతృత్వంలో పోలీసులు కొత్తపేట సమీపంలోని బ్రిడ్జి వద్ద హైవేపై కారులో వెళుతున్న వీరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,200 గ్రాముల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమో దు చేసి నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ చెప్పారు. కేజీబీవీ బోధన సిబ్బంది తుది మెరిట్ జాబితా విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించి తుది మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేశారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన నియామక ప్రక్రియలో భాగంగా ప్రొవిజనల్ మెరిట్ జాబితా నుంచి రోస్టర్ ప్రకారం 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు. ఆగస్టు 18, 19 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను జిల్లా సమగ్ర శిక్ష వెబ్సైట్ http://samagrashi kshaatp.blogspotలో అందుబాటులో ఉంచి నట్లు ఏపీసీ శైలజ తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో నేరుగా సమర్పించాలని తెలిపారు. గడువు అనంతరం అందే అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోబోమని ఏపీసీ శైలజ స్పష్టం చేశారు. న్యాయం చేయాలంటూ రాస్తారోకో ఉరవకొండ: పట్టణ శివారులోని టీవీ టవర్ సమీపంలో ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం ఉరవకొండ ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కూలీనాలీ చేసుకుని జీవించే తమ కుటుంబాలకు పోషించే దిక్కు లేకుండా పోయిందన్నారు. ఐచర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో సంబంధిత యజమాని నుంచి తమకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో ఉరవకొండ సీఐ మహనంది, ఎస్ఐ జనార్థన్‌నాయుడు అక్కడికి చేరుకున్నారు. కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు శాంతించి మృతదేహాలను స్వగ్రామం వజ్రకరూరుకు తరలించారు. చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి గుత్తి రూరల్: మండలంలోని బేతాపల్లి గ్రామంలో శుక్రవారం టెంకాయ చెట్టుపై నుంచి పడి పృథ్విరాజు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పృథ్విరాజు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అమావాస్య కావడంతో గ్రామ శివారులోని తన తోట వద్ద ఉన్న చెట్టుపై టెంకాయలు తెచ్చేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కి టెంకాయలు, పట్టలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెట్టుపై నుంచి కిందకు పడ్డాడు. ఎంతసేపయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు తోట వద్దకు వెళ్లారు. తీవ్ర గాయాలతో చెట్టు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న పృథ్విరాజును గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే గ్రామంలోని పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన చికిత్సలకు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పృథ్విరాజు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఇంటి పెద్ద దిక్కు మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య మౌనిక, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హోరాహోరీ పోరు.. జార్ఖండ్, ఢిల్లీ విజయం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర తాలిమెరెన్ ఆవో అండర్–19 బాలికల జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (టైర్–1) పోటీలు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం ఢిల్లీ – గుజరాత్, జార్ఖండ్ – బిహార్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ, గుజరాత్ జట్లు తలపడ్డాయి. 40వ నిమిషంలో వేదిక (జెర్సీ నం. 24) తొలి గోల్ చేసి ఢిల్లీకి ఆధిక్యాన్ని ఇచ్చింది. ప్రత్యర్థి గుజరాత్ ఆటగాళ్లను ఎక్కడికక్కడ ఢిల్లీ క్రీడాకారులు సమర్థవంతంగా అడ్డుకుంటూ తమ ఆధిపత్యాన్ని చూపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే స్టోపేజ్ టైమ్ (వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన సమయాన్ని భర్తీ చేయడానికి అదనంగా కేటాయించే సమయం) ఢిల్లీ జట్టుకు కలిసొచ్చింది. ఢిల్లీ క్రీడాకారిణి సునైనా (జర్సీ నం. 99) అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ సాధించి ఢిల్లీకి 3–0తో విజయాన్ని ఖాయం చేసింది. ● మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్, బిహార్ జట్లు తలపడ్డాయి. ఆట ప్రారంభం నుంచే బిహార్‌పై జార్ఖండ్ జట్టు ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. మైదానం నలుమూలలా జార్ఖండ్ క్రీడాకారులు మెరుపు వేగంతో కదులుతూ బిహార్ జట్టు క్రీడాకారులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆట ప్రారంభమైన తొలి రెండో నిమిషంలోనే 15వ నంబర్ జెర్సీ ధరించిన జార్ఖండ్ క్రీడాకారిణి అద్భుత గోల్‌ను సాధించి జట్టు క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపింది. అనంతరం 49వ నిమిషంలోనూ మరో గోల్ సాధించింది. ఆట 22వ నిమిషంలో కొనసాగుతుండగా 8వ నంబర్ జెర్సీ ధరించిన క్రీడాకారిణి ఓ గోల్, 18వ నంబర్ జెర్సీ ధరించిన మరో క్రీడాకారిణి ఇంకో గోల్ చేశారు. దీంతో జట్టు 4–0 గోల్స్ ఆధిక్యంలో ఉండగా స్టోపేజ్ టైమ్ కలిసి వచ్చింది. దీంతో 8వ నంబర్ జెర్సీ ధరించిన క్రీడాకారిణి మరో గోల్ సాధించడంతో 5–0 గోల్స్ తేడాతో జార్ఖండ్ జట్టు విజయ కేతనం ఎగుర వేసింది. బిహార్ క్రీడాకారిణికి ఎల్లో కార్డ్ జార్ఖండ్ క్రీడాకారుల దూకుడుతో సహనం కోల్పోయిన బిహార్ క్రీడాకారిణి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో రెఫరీ ఎల్లో కార్డు చూపారు. ఆట 83వ నిమిషంలో కొనసాగుతుండగా బిహార్‌కు చెందిన 9వ నంబర్ జెర్సీ ధరించిన క్రీడాకారిణి తన ప్రత్యర్థిని ప్రమాదకర రీతిలో కిందపడేసింది. దీంతో బిహార్ క్రీడాకారిణిని హెచ్చరిస్తూ రెఫరీ ఎల్లో కార్డు చూపారు. మ్యాచ్‌లను ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి డానియల్ ప్రదీప్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు దాదా ఖలందర్ పర్యవేక్షించారు. -
విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి
తాడిపత్రి రూరల్: మండలంలోని బ్రహ్మణపల్లి వద్ద వ్యవసాయ పొలంలో విద్యుత్ షాక్‌కు గురై బాషా (45) అనే వ్యక్తి మృతి చెందాడని అప్‌గ్రెడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. గ్రామంలో సురేష్‌రెడ్డికి చెందిన మోటార్ పనిచేయకపోవడంతో స్టార్టర్‌ను రిపేరీ చేస్తున్న సమయంలో బాషా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడన్నారు. వెంటనే చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇసుక అక్రమ డంప్ గుట్టు రట్టు శింగనమల: మండలంలోని సలకంచెరువు వద్ద కూతలేరు వంక నుంచి అక్రమంగా ఇసుకను తరలించి ఒక టీడీపీ నాయకుడు నిల్వ చేసుకున్న డంప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఉల్లికల్లు సమీపంలోని పెన్నానది నుంచి రోజూ టీడీపీ నాయకులు ఇసుక అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కూతలేరు వంక నుంచి ఓ టీడీపీ నాయకుడు ఇసుకను భారీగా తరలిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అధికార అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ‘పచ్చ’ పార్టీ నాయకుల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
దళితులపై అమిలినేని అనుచరుల దాడి
కళ్యాణదుర్గం రూరల్: కామక్కపల్లిలో శుక్రవారం రాత్రి దళితులపై ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు దాడి చేశారు. మారెమ్మ జాతర నేపథ్యంలో గ్రామస్తులు శుక్రవారం ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. అందులో భాగంగా గ్రామంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి గేట్ వాల్వ్‌ను తమ కాలనీ వైపు తిప్పినందుకు దళిత సామాజిక వర్గానికి చెందిన తిమ్మరాజు, ఆంజనేయులు, శశికుమార్‌లపై అదే గ్రామానికి చెందిన అమిలినేని అనుచరులైన నాగేంద్ర, హనుమేష్, చిన్న, నాగభూషణ్ కులం పేరుతో దూషిస్తూ దాడిచేశారు. ఈ దాడిలో గాయపడ్డ తిమ్మరాజు, అంజినేయులు, శశికుమార్ కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను డీఎస్పీ రవిబాబు పరామర్శించి, గొడవకు గల కారణాలపై ఆరా తీశారు. దాడిచేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. -
రాయలసీమకు నీరేదీ..?
● ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభల్లో వక్తల గళం అనంతపురం ఎడ్యుకేషన్: రాయలసీమకు సాగునీరు అందించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తగినంత నీటిని విడుదల చేయాలంటూ వక్తలు గళమెత్తారు. అఖిల భారత రైతు–కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 9వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం అనంతపురం నగరంలోని డాక్టర్ అంబేడ్కర్ విజ్ఞాన భవన్లో ప్రారంభమయ్యాయి. తొలుత అంబేడ్కర్ భవన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారుల నృత్య ప్రదర్శనతో సాగిన ర్యాలీలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు రామ్‌కుమార్, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ప్రభాకర్ ఎర్రజెండాను ఎగురవేశారు. అనంతరం ప్రారంభ సభను ఇండ్ల ప్రభాకర్, ఎం.దుర్గాప్రసాద్, ఎస్.వి.వి.సత్యనారాయణ అధ్యక్షవర్గంగా నిర్వహించారు. రామ్‌కుమార్ మాట్లాడుతూ రాయలసీమకు సాగునీరు అందించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని, గోదావరి, కృష్ణా నదుల నుంచి రాయలసీమకు నీటి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభల్లో రైతాంగ సమస్యలతో పాటు రాయలసీమ సాగునీటి సమస్యపై లోతుగా చర్చించి కార్యాచరణ రూపొందించాలని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రారంభోపన్యాసం చేశారు. రాయలసీమలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల ద్వారా ఆశించిన స్థాయిలో సాగునీరు అందడం లేదని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రాజెక్టుల పూర్తి ప్రయోజనం రైతులకు దక్కడం లేదని పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బి.దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ప్రాంతంలో సాగునీటితో పాటు తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. మహాసభలో ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఐలయ్య ప్రసంగించారు. -
ముగిసిన ‘సర్’ దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా చేపట్టిన ఓటరు నమోదు, ఓటు తొలగింపు, వివరాల మార్పునకు సంబంధించి దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. దరఖాస్తులు, అభ్యంతరాలను అక్టోబరు 5వ తేదీలోపు పరిష్కరిస్తారు. అక్టోబరు 9వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఓటరు నమోదుకు (ఫారం–6) 27,766 దరఖాస్తులు అందగా ఇప్పటి వరకు 12,485 పరిష్కరించారు. 15,281 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. ఓటు తొలగింపునకు (ఫారం–7) 2,50,558 దరఖాస్తులు రాగా 2,50,219 పరిష్కరించారు. 369 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఓటు వివరాల మార్పునకు 20,181 దరఖాస్తులు అందగా 12,005 పరిష్కరించారు. 8,176 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. వీటన్నింటినీ అక్టోబరు 5వ తేదీలోపు పరిష్కరిస్తారు. మొక్కుబడిగా ఓటరు నమోదు.. 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలనేది ఎన్నికల కమిషన్ ప్రధాన లక్ష్యం. కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించి 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 18 ఏళ్లు దాటిన యువత 1.20 లక్షలు ఉన్నట్లు అంచనా. ఈ ఏడాది మే నుంచి గురువారం వరకు ఓటరు నమోదుకు 27,766 దరఖాస్తులు అందాయి. వీటిలోనూ 18 ఏళ్లు నిండిన యువత మాత్రమే కాకుండా ఇతరులూ ఉన్నారు. దీన్ని బట్టి యువతను ఓటరుగా నమోదు చేయడంపై జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించలేదనే విషయం స్పష్టమవుతోంది. అక్టోబరు 5 వరకు పరిశీలన ఓటర్ల తుది జాబితా అక్టోబరు 9వ తేదీన ప్రచురణ -
వరి, మిర్చి సాగు చేయొద్దు
కణేకల్లు: హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ పరిధిలోని ఆయకట్టు భూముల్లో వరి, మిర్చి పంటలు ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయరాదని హెచ్చెల్సీ ఈఈ పార్థసారథి, డీఈఈ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ (189 కిలోమీటర్ నుంచి 144 కిలోమీటర్ వరకు)ను ఈఈ, డీఈఈలు గురువారం పరిశీలించారు. అనంతరం ఈఈ విలేకర్లతో మాట్లాడారు. హెచ్చెల్సీ, జీబీసీ కింద ఆరుతడి పంటలకే నీరిస్తున్నట్లు వెల్లడించారు. వరి, మిర్చి పంటలు సాగు చేసి నష్టపోవద్దన్నారు. సెప్టెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు డిస్ట్రిబ్యూటరీలకు నీటి సరఫరా నిలిపేస్తామని, ఆ తర్వాత పునరుద్ధరిస్తామన్నారు. కర్ణాటక ప్రభుత్వం నవంబర్ 10లోపు నీటిని పూర్తిగా డ్రా చేసుకోవాలని నిర్ణయించిందని, తాము కూడా ఆ రాష్ట్రంతో సమానంగా నీరు డ్రా చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో జేఈ మారుతిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి రైతూ ఈ–పంట నమోదు చేసుకోండి శెట్టూరు: ప్రతి రైతు పంట నమోదును తప్పని సరిగా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని చిన్నంపల్లిలో ఆయన పర్యటించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షం లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. పంట పొలాల్లో తేమశాతం నిలుపుకోవడానికి జీవామృతం, యూరియా, పొటాషియం నైట్రేట్ ిపిచికారీ చేసుకోవాలన్నారు. వర్షాలు లేక బోరుబావులు సైతం ఎండిపోతున్నాయని, రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలైన ఉలవ, కొర్ర, సజ్జ, జొన్న వంటి పంటలు సాగు చేసుకోవాలన్నారు. పంట బీమా ఆధారంగానే మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ ఇతర ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను తప్పని సరిగా చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఎల్లప్ప, మండల వ్యవసాయ అధికారిణి వాసకిరాణి, ఏఓలు శ్రవన్‌కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన సాధించాలి బుక్కరాయసముద్రం: సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎన్ఆర్ఎల్ఎం (నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్) మేనేజర్ పంకజ్ సుయల్, ఎన్ఆర్పీ స్వామి నాథన్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఎన్ఆర్ఎల్ఎం ఢిల్లీ బృందం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రతి మహిళ సంఘంలో చేరాలని, దీని ద్వారా కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. డీఆర్డీఏ ఏపీడీ రాధారాణి, సెర్ప్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మి ప్రసాద్‌రెడ్డి, పీఈ శోభా, డీపీఎంయూ సత్య నారాయణ, ఏపీఎం అనితాదేవి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో.. నిమ్మ!
రాయదుర్గం: ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలోనూ పెను మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో నిమ్మకాయల వినియోగం ఎక్కువైంది. సరైన వర్షాలు కురవకపోవడంతో నిమ్మకాయల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో నిమ్మకాయల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఒక్కో నిమ్మకాయ రూ.10, చిన్నవైతే రూ.20కి మూడు ఇస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్తా రూ.16 వేల వరకూ... గతేడాది ఇదే సమయానికి 80 కిలోల నిమ్మ బస్తా రూ.4 వేల నుంచి 8 వేలు పలికింది. తాజాగా కాయల నాణ్యతబట్టి రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పైకి ఎగబాకింది. మార్కెట్లోకి ఆశించిన స్థాయిలో కాయలు రావడం లేదు. చిన్నవైన సరే కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 640 ఎకరాల్లో మాత్రమే... జిల్లాలో గార్లదిన్నె, పెద్దపప్పురు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో సుమారు 640 ఎకరాల్లో మాత్రమే నిమ్మసాగు చేపట్టారు. ప్రతి ఏటా నష్టాలు మూటకట్టుకుంటున్న రైతులకు ఈ ఏడా ధరలు కాస్త ఊరిస్తున్నా దిగుబడులు కొంపముంచాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన మార్కెట్లకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి నిమ్మ బస్తాల దిగుమతి జరుగుతుంది. అన్నీ చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బోర్లలో నీరు అడుగంటి దిగుబడులు దెబ్బతిన్నాయి. ఈ నెల ఆఖరకు ఒక్కో నిమ్మకాయ రూ.20 పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు కిలో రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతున్నాయి. ఆందోళనలో కూల్‌డ్రింక్ వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా 2,478 కి పైగా చిన్న, పెద్ద కూల్ డ్రింక్ దుకాణాలు వెలిశాయి. సోడ, నన్నారి ఇతర కూల్ డ్రింక్స్లోకి నిమ్మ రసం కలుపుతుంటారు. నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో నిమ్మకాయ రూ.10 తో కొనుగోలు చేసి సోడా ఎలా అమ్ముకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు ఒక్కో నిమ్మకాయ రూ.10 చిన్న వైతే రూ.20 కి మూడు ఇబ్బందుల్లో వినియోగదారులు -
చికిత్స పొందుతూ కూలీ మృతి
బ్రహ్మసముద్రం: మండల పరిధిలోని గుడిపల్లి గ్రామానికి చెందిన గొర్ల శ్రీనివాసులు (55) అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శ్రీనివాసులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే తనకున్న ఎకరా పొలంలో టమాట పంటను సాగు చేశాడు. అయితే గిట్టుబాటు ధర లేక టమాట మార్కెట్లో అమ్ముడు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మనస్తాపం చెందాడు. ఇందులో భాగంగానే 7న ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం పరిస్థితి విషమించడంతో శ్రీనివాసులు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. -
ఫుడ్ జోన్లో గొడవ.. కత్తిపోటుకు యువకుడు బలి
ద్వారకా తిరుమల: చాయ్ బిస్కెట్ ఫుడ్‌జోన్‌లో జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. తోటి కార్మికుడు కత్తితో పొట్టలో పొడవడంతో తీవ్రంగా గాయపడిన కోనెటి గంగాధరరావు (35) చికిత్స అనంతరం విశ్రాంతి పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్‌లో ఈనెల 8న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన గంగాధరరావు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన ఏలూరు శివశంకర్ లక్ష్మీనగర్‌లో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ చాయ్ బిస్కెట్ ఫుడ్ జోన్లో పనిచేస్తున్నారు. వీరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో 15 రోజులుగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 8న రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆ సమయంలో శివశంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గంగాధరరావును పొట్టలో పొడిచి పరారయ్యాడు. వెంటనే ఫుడ్ జోన్ యజమాని భలే విజ్ఞేశ్వరరావు గాయపడిన గంగాధరరావును నల్లజర్లలోని పీహెచ్‌సీకి తరలించగా వైద్యులు చికిత్స అందించి మూడు కుట్లు వేశారు. అనంతరం అతడిని ఫుడ్ జోన్‌లోని రెస్ట్ రూమ్‌కు తరలించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో గంగాధరరావు మృతి చెందాడు. భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకా తిరుమల ఎస్ఐ టి.సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
కోర్టు వాయిదాకొచ్చి.. పరలోకాలకు
ఉరవకొండ/వజ్రకరూరు: కోర్టులో వాయిదా ముగించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తున్న ముగ్గురిని మృత్యువు కబళించింది. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారు విగత జీవులుగా మారడం విషాదం నింపింది. వివరాలు.. వజ్రకరూరు గ్రామానికి చెందిన కణేకల్లు జైనుల్లా (45), మహబూబ్‌బాషా (32), భగవాన్ మహ్మద్‌రఫీ (30)లు గురువారం ఉదయం టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంలో ఉరవకొండ కోర్టుకు కేసు వాయిదా నిమిత్తం వచ్చి సాయంత్రం తిరుగు ప్రయాణయ్యారు. ఉరవకొండ దాటగానే టీవీటవర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం వీరిని బలంగా ఢీకొంది.వాహనానికి ఇరుక్కున్న ముగ్గురినీ అర కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలైన వారు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. దద్దరిల్లిన ఉరవకొండ ఆస్పత్రి.. మృతదేహాలను ఉరవకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. వారి రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. ఒకేసారి ముగ్గురి మరణంతో వారి స్వగ్రామం వజ్రకరూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉరవకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బైకును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం ముగ్గురు వ్యక్తుల దుర్మరణం -
గంజాయి ముఠా అరెస్ట్
ఆత్మకూరు: గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గురువారం ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని హంద్రీ నీవా కెనాల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంతపురం రూరల్ ఇన్చార్జ్ డీఎస్సీ చంద్రశేఖర్, ఇటుకులపల్లి సీఐ హేమంత్‌కుమార్ వివరాలు తెలియజేశారు. వాహనాల తనిఖీలో భాగంగా గురువారం కళ్యాణదుర్గం నుంచి రెండు ద్విచక్ర వాహనాల్లో నలుగురు వ్యక్తులు రాగా అనుమానంతో వారిని తనిఖీ చేశామన్నారు. వారి దగ్గర 1.5 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలను, మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయిస్తున్న కాకిమాని రాజు, (బళ్లారి టౌన్), నల్లబోతుల సుంకన్న (అనంతపురం), ఎడవాల మహేష్ (అనంతపురం)తో పాటు బాలుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలియజేశారు. మహేష్‌పై ఇప్పటికే రెండు మర్డర్ కేసులు కూడా ఉన్నాయన్నారు. నలుగురిలో ఇద్దరిని కిట్ల ద్వారా పరీక్షించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు, ఇటుకలపల్లి ఎస్ఐలు లక్ష్మణరావు, విజయ్‌కుమార్, ఏఎస్ఐ దస్తగిరి, గౌస్, కానిస్టేబుళ్లు హరి, విజయ్, చౌడప్ప, అశోక్, హర్ష తదితరులు పాల్గొన్నారు. 1.5 కిలోల గంజాయి స్వాధీనం -
జాతీయ స్థాయి సైన్స్‌ఫెయిర్ పోటీలకు ఎంపిక
కణేకల్లు: జాతీయస్థాయి సైన్స్‌ఫెయిర్ పోటీలకు మండలంలోని హనకనహళ్ జెడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని పూజారి మానస తయారు చేసిన ‘సోలార్ స్కేర్క్రో (సౌర దిష్టిబొమ్మ)’ ప్రాజెక్ట్ ఎంపికై ంది. ఫిజికల్ సైన్స్ టీచర్ చంద్రమునయ్య సమక్షంలో మానస ఈ ప్రాజెక్ట్‌ను తయారు చేసింది. ఇటీవల ఆన్లైన్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాజెక్ట్ గురించి వివరించడంతో సైన్స్‌ఫెయిర్ అథారిటీ వారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఢిల్లీలో అక్టోబర్ 11, 12, 13వ తేదీల్లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ప్రాజెక్ట్‌ను ప్రదర్శించనున్నట్లు హెచ్ఎం వేణుగోపాల్, సైన్స్ టీచర్ తెలిపారు. ఎలా పని చేస్తుందంటే? రైతులు తాము సాగు చేసిన పంటలను రక్షించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం, దిష్టిబొమ్మలు పెట్టడం, డబ్బాలో గులక రాళ్లు వేసి అల్లాడించడం వంటివి చేస్తుంటారు. విద్యుత్ తీగలు, ముళ్ల కంచెలతో పక్షులు, జంతువులకు ముప్పు వాటిల్లుతుంది. మానస తయారు చేసిన ప్రాజెక్టుతో అలాంటివేవీ ఉండవు. సోలార్‌తో పని చేసే ఈ స్కేర్క్రో ముందుభాగంలో అమర్చిన అల్ట్రాసోనిక్ సెన్సార్ నిరంతరం శబ్ద తరంగాలను వాతావరణంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఏదైనా పక్షి లేదా జంతువు పొలంలోకి రాగానే తరంగాలు జంతువును తాకి ఆ సంకేతాలు పరికరానికి అందుతాయి. ఈ క్రమంలో మోటార్లు తిరిగి దిష్టిబొమ్మ చేతులు వేగంగా పైకి, కిందికి కదిలి శబ్దం రావడంతో జంతువులు, పక్షులు భయపడి పారిపోతాయి. ఇది పూర్తిగా ఆటోమేటిక్ (స్వయంచాలక) వ్యవస్థ కావడంతో రైతుల శ్రమ, సమయం ఆదా అవుతాయి. పర్యావరణానికీ హాని కలగదు. -
13న ఫ్లాగ్షిప్ పరీక్ష
● యూపీఎస్సీ ఆధ్వర్యంలో రెండు కేంద్రాల్లో నిర్వహణ అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఫ్లాగ్షిప్ పరీక్ష ఈనెల 13న జరగనుంది. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 352 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణపై డీఆర్ఓ ఎ.మలోల గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల కేంద్రంగా కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (సీడీఏ) పరీక్ష మూడు సెషన్లుగా జరుగుతుందన్నారు. కేఎస్ఎన్ యూజీ, పీజీ మహిళ కళాశాల కేంద్రంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావెల్ అకాడమీ (ఎన్ఏ) పరీక్ష రెండు సెషన్లుగా జరగుతుందన్నారు. సీడీఏ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు రెండో సెషన్, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడో సెషన్ జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు 155 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అలాగే ఎన్డీఏ, ఎన్ఏ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు 197 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఘర్షణ పెద్దవడుగూరు: గుత్తి పరిధిలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ అనే విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయాన్ని విద్యార్థులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. విజయ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కళాశాలకు చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. యాజమాన్యంతో చర్చించి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాఘవేంద్రప్ప తెలిపారు. టీచర్ సస్పెన్షన్ గార్లదిన్నె: మండల పరిధిలోని మోడల్ స్కూల్లో పీజీటీ ఫిజిక్స్ టీచర్‌గా పని చేస్తున్న నారాయణపై వేటు పడింది. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఇటీవల కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓ అయూబ్ హుస్సేన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా టీచర్ నారాయణను సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు. మద్యం షాపులను రెన్యూవల్ చేసుకోండి హిందూపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత మద్యం షాపుల లైసెన్సులను మరో సంవత్సరం పాటు రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని, అందువల్ల మద్యం షాపుల లైసెన్సుదారులు తమ షాపులను రెన్యూవల్ చేసుకోవాలని అనంతపురం జిల్లా ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్కేడీవీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో స్థానిక సీఐ లక్ష్మీదుర్గయ్యతో కలిసి పట్టణంలో మద్యం షాపు లైసెన్సుదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మద్యం షాపుల రెన్యూవల్‌కు సంబంధించి విధి విధానాలను ఆయన వివరించారు. రెన్యూవల్ చేసుకోకపోతే ఆ షాపును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. -
ఆశలు ఆ‘వరి’
బొమ్మనహాళ్: ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తుంగభద్ర జలాశయం నిండకపోవడంతో నీరు ఎక్కువ అవసరమయ్యే వరి, మిరప వంటి పంటలు సాగు చేయవద్దని, తాగు నీటికే తొలి ప్రాధాన్యమని అధికారులు ప్రకటించారు. అయితే అంతకుముందే నారు మడులు సిద్ధం చేసుకున్న కొందరు రైతులు బోరుబావుల కింద నాట్లు వేశారు. ఆ నీరు సరిపోకపోవడంతో పైర్లు కుళ్లిపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక గొర్రెలకు వదిలేస్తున్నారు. మండలంలోని ఉద్దేహాళ్ గ్రామం వద్ద ఓ రైతు నారుకు నీరు అందకపోవడంతో గొర్రెలకు వదిలేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
క్రీడల్లో ఎస్కేయూ ఖ్యాతిని చాటిచెప్పాలి
● క్రీడాకారులకు టీఏ, డీఏల పెంపు : వీసీ జ్యోతికుమార్ అనంతపురం: జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో ఎస్కేయూ ఖ్యాతిని చాటిచెప్పే క్రీడాకారులకు వర్సిటీ యాజమాన్యం భారీ తాయిలాలను ప్రకటించింది. గురువారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వార్షిక క్రీడా మండలి సమావేశం వీసీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడారు. జాతీయ, జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనే ఎస్కేయూ విద్యార్థులు, కోచ్‌లు, మేనేజర్ల టీఏ, డీఏలను ఈ విద్యా సంవత్సరం నుంచి పెంచుతున్నట్లు వివరించారు. 400 మీటర్ల పరుగు పందెంలో జోనల్ స్థాయిలో పతకం సాధిస్తే రూ. 25 వేలు, జాతీయ స్థాయిలో పతకం గెలిస్తే రూ. 50వేలు నగదు పురస్కారాలను అమెరికాలో స్థిరపడిన డాక్టర్ ఆనంద్ ముసునూరి సౌజన్యంతో అందిస్తామన్నారు. వర్సిటీలోని స్టేడియంలో బాస్కెట్‌బాల్ కోర్టు పునరుద్ధరణ, కబడ్డీ, ఖో–ఖో కోర్టులకు ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు క్రీడాకారుల సౌకర్యార్థం ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఖేలో ఇండియా, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌కు ఎంపికై న క్రీడాకారులకు ప్రయాణ ఖర్చులతో కూడిన ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సమావేశంలో వర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ బి. అనిత, ప్రిన్సిపాల్ డి.ఆంజనేయులు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, క్రీడా మండలి కార్యదర్శి ఎం.వి. శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకం.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ – సైన్స్ కళాశాలలోని 28 విభాగాల్లో తరగతులు నిరంతరాయంగా సాగేందుకు, విద్యా కార్యకలాపాలను మెరుగు పరిచేందుకు 80 మంది అకాడమిక్ కన్సల్టెంట్లను నియమించారు. పోస్టర్ల ఆవిష్కరణ.. ఎస్కేయూలోని అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇన్వెస్టర్స్ మీట్–2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను గురువారం ఆ వర్సిటీ వీసీ జ్యోతికుమార్ ఆవిష్కరించారు. -
చీనీ రైతు కంటతడి
అనంతపురం అగ్రికల్చర్/యల్లనూరు: ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీగా ఖ్యాతినొంది, ఉద్యానహబ్‌గా రూపాంతరం చెందుతున్న కీలక తరుణంలో జిల్లాలో పండ్లతోటలు ముప్పుబారిన పడుతున్నాయి. నెలల తరబడి వర్షాలు లేక బోరుబావులు ఎండుముఖం పట్టాయి. కొత్తగా బోర్లు తవ్విస్తున్నా 10 శాతం కూడా ఫలితం కనిపించడం లేదు. దీంతో రైతులు దిక్కులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. 2.96 లక్షల ఎకరాల్లో తోటలు.. జిల్లాలో 2.96 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉద్యాన తోటలు విస్తరించాయి. అత్యధికంగా చీనీ తోటలు 90 వేల ఎకరాలు, మామిడి 35 వేలు, అరటి 35 వేలు, టమాట 40 వేలు, దానిమ్మ 12 వేల ఎకరాలు.. ఇలా 31 మండలాల పరిధిలోనూ తోటలు విస్తరించాయి. ఏటా 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు, రూ.15 వేల కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతున్నట్లు ఉద్యానశాఖ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు సర్కారు రైతులకు నీటి భద్రత కల్పించడంలో విఫలం కావడంతో కష్టాలు తప్పడం లేదు. రెండేళ్లుగా రైతులకు పరిహారం ఇవ్వలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. తోటలు ఎండుతున్నా అటువైపు చూసే పరిస్థితి కనిపించడం లేదు. తోటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి తడులు ఇస్తున్నా ఏ మూలకూ చాలడం లేదని రైతులు వాపోతున్నారు. ఆదుకున్న జగన్.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అన్నదాతలను ఆదుకున్నారు. జిల్లాలో యల్లనూరు మండలంలోని కోమటికుంట్ల, గరుగుచింతలపల్లికి చెందిన చీనీ రైతులకే రూ. 1.70 కోట్ల పరిహారం అందించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఒక్కో రైతుకు రూ.4 లక్షల వరకు ఖాతాల్లో జమ చేయగా, ప్రస్తుత సర్కారు ఇప్పటికీ పైసా ఇవ్వకపోవడం గమనార్హం. వర్షాలు లేక, బోర్లలో నీళ్లు రాక ఎండుతున్న ఉద్యాన తోటలు పంటలను కాపాడుకునేందుకు రైతుల అష్టకష్టాలు నీటి భద్రత కల్పించడంలో చంద్రబాబు సర్కారు విఫలం ఉన్న మూడు బోర్లలో నీళ్లు తగ్గిపోయాయి. కొత్తగా బోరు వేసినా అర ఇంచు కూడా పడలేదు. ట్యాంకర్లతో తడి ఇద్దామంటే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక 5 ఎకరాల్లో 8 ఏళ్ల కిందట సాగు చేసిన 600 చీనీ చెట్లను ఇదిగో ఇలా పుట్లూరుకు చెందిన రైతు వై.వీరశేఖర్‌రెడ్డి జేసీబీ ద్వారా తొలగించేశాడు. గతంలో మూడు పంటలు తీసుకున్నానని, ప్రస్తుతం బోర్లలో నీళ్లు తగ్గిపోవడంతో ఈ దుస్థితి తలెత్తిందని వీరశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పాడు. ఇంకా రెండు ఎకరాల్లో మూడేళ్ల చెట్లు ఉన్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే రెండు మూడు నెలల్లో వాటిని కూడా తొలగించాల్సి ఉంటుందంటూ నిట్టూర్చాడు. -
రేపు జాతీయ లోక్ అదాలత్
అనంతపురం: జిల్లాలో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈ.భీమారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో రాజీ పడదగ్గ కేసులను నిర్ధారించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో సంఖ్యాపరంగా ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేటట్లు కృషి చేయాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 20 రోజులుగా నీరివ్వకుంటే ఎలా బతకాలి? యాడికి: 20 రోజులుగా నీరివ్వకుంటే ఎలా బతకాలి? అంటూ పిన్నేపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్య తీర్చే వరకు ఇలానే కూర్చుంటామని స్పష్టం చేశారు. పిన్నేపల్లి గ్రామస్తుల ఆందోళనతో గుత్తి–తాడిపత్రి మార్గంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ గోపాలుడు సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆందోళనకారుతో మాట్లాడారు. ఈఓ గీత మాట్లాడుతూ పిన్నేపల్లిలో ప్రతి ఇంటికీ రెండు రోజుల్లో నీరందేలా చర్యలు తీసుకుంటామని, అంతవరకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని తెలపడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. ట్రెల్లీస్ స్కూల్‌పై విచారణ ● ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీ అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురంలోని ట్రెల్లీస్ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు వచ్చిన అభియోగాలపై జిల్లా విద్యాశాఖ స్పందించింది. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు జిల్లా విద్యాశాఖ అధికారి అయ్యూబ్ హుస్సేన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ముగ్గురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించనుంది.బాలిక తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది వైఖరి తదితర అంశాలపై విచారణ చేపట్టి సమగ్ర నివేదికను విద్యాశాఖకు అందజేయనుంది. ప్రత్యేక కమిటీ అందించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. -
కన్నీరే ‘మిగిలింది’..
ఉరవకొండ: ఆశలు అడియాసలయ్యాయి. అప్పు చేసి, రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలు మట్టిలోనే కలిసిపోతుంటే రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఉరవకొండ మండలం షేక్షానుపల్లికి చెందిన అయ్యప్పరెడ్డి 7 ఎకరాల్లో వేరుశనగ పంట సాగుచేసి తీవ్ర వర్షాభావంతో బోరు బావుల్లో నీరు లేక పంటను గొర్రెలకు వదిలేశాడు. రూ.3 లక్షలు నష్టపోయినట్లు రైతు వాపోయాడు. అలాగే విడపనకల్లు మండలంలో వందలాది ఎకరాల్లో సాగు చేసిన కంది, మిర్చి పంట 80 రోజులవుతున్నా వర్షాలు రాకపోవడంతో ఎండిపోతున్నాయి. కొంత పంటను దున్నేస్తూ మరికొంత పంటను పశువులకు రైతులు వదిలేస్తున్నారు. -
చీనీ చెట్ల నరికివేత
కూడేరు: మండల పరిధిలోని ఉదిరిపికొండకు చెందిన రైతు గొల్ల మల్లికార్జునకు చెందిన పొలంలో బుధవారం రాత్రి చీనీ చెట్లను నరికి వేశారు. గురువారం ఉదయం మల్లికార్జున పొలంలోకి వెళ్లగా చీనీ చెట్లు నరికి ఉండడాన్ని గుర్తించాడు. వెంటనే ఈ ఘటనపై రైతు కూడేరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు మల్లికార్జున మాట్లాడుతూ తన పక్క పొలం రైతులు వెంకటేశులు, ఉమాపతిలే చెట్లు నరికి వేశారని తెలిపారు. తమ పొలాల పరిధిలో గాలి మర ఫ్యాన్ ఏర్పాటు అవుతోందన్నారు. వారిద్దరూ డబ్బుకు ఆశ పడి సర్వే చేయించామని, తన పొలంలో వారికి భూమి వస్తుందని బుధవారం దైర్జన్యంగా రాళ్లు పాతినట్లు పేర్కొన్నారు. ఆ రాళ్లను తొలగించాననే కోపంతోనే చెట్లు నరికి ఉంటారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
ఉరవకొండ/వజ్రకరూరు: అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. వజ్రకరూరుకి చెందిన కణేకల్లు జైనుల్లా(45), మహబూబ్‌బాషా(32), భగవాన్ మహ్మద్‌రఫీ(30) ద్విచక్రవాహనంపై ఉరవకొండకు కోర్టు కేసు నిమిత్తం గురువారం వచ్చారు. వాయిదా ముగించుకుని∙స్వగ్రామం బయలుదేరారు. ఉరవకొండ దాటగానే టీవీ టవర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్రవాహనాన్ని దాదాపు అర కిలోమీటరు మేర ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆ స్కూల్ నాదే.. ఆ వైపు వెళ్లకండి!
అనంతపురం: నగరంలోని ట్రెల్లీస్ పాఠశాలలో బాలికపై అక్కడ పనిచేస్తున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి వేధించాడన్న అభియోగాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో తరగతి చదువుతున్న బాలిక బాత్రూంకు వెళ్లిన సమయంలో అక్కడ శుభ్రత పనులు చేసే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ తర్వాత కూడా బాలికను వేధించాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్ద బాలిక ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లి ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ‘చిన్న విషయం’గా ఎలా చూస్తారు? తమ కుమార్తెపై జరిగిన అఘాయిత్యాన్ని పాఠశాల యాజమాన్యం చిన్న విషయంగా చూస్తోందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కరస్పాండెంట్ వడ్ల శ్రీకాంత్ , డైరెక్టర్ అనిల్ తేజ తమ ఫిర్యాదుపై సరిగా స్పందించలేదన్నారు. ప్రశ్నిస్తే తమకు రాజకీయ, పోలీసు అధికారుల అండ ఉందంటూ బెదిరించారన్నారు. పోలీసులను ఆశ్రయించినప్పటికీ సమస్యను చిన్నదిగా చూడటం బాధ కలిగించిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. ఆ స్కూల్ నాదే.. ఆ వైపు వెళ్లకండి! అనంతపురం సెంట్రల్: నగరంలో ట్రెల్లీస్ స్కూల్లో వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఓ ద్వితియ శ్రేణి టీడీపీ నాయకుడు పెద్దస్థాయిలో మంత్రాంగం నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రెలీస్సూ్కల్ యాజమాన్యం జీసస్ నగర్, బళ్లారి బైపాస్ రోడ్డులో బ్రాంచులు నడుపుతోంది. గత 20 రోజులుగా స్కూల్లో విద్యార్థులపై వరుస ఘటనలు జరుగుతున్నాయి. గత నెల 22న బళ్లారి బైపాస్ బ్రాంచ్‌లో 10వ తరగతి చదువుతున్న హర్షిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థి విచక్షణా రహితంగా దాడి చేశాడు. కంటి వద్ద బలమైన గాయమైంది. పిల్లలు కొట్టుకున్నా.. విద్యార్థికి తీవ్ర గాయమైనా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా టీసీ తీసుకొని వెళ్లిపోండి అంటూ బెదిరించారు. దీంతో బాధిత విద్యార్థి తల్లి నాగలక్ష్మి న్యాయం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీజగదీష్ ను కలిసి వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇక ఇటీవల బాత్రూమ్కు వెళ్లిన ఓ బాలికపై అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించాడు. రంగంలోకి టీడీపీ నేత ట్రెల్లీస్ యాజమాన్యంపై చర్యలు లేకుండా ఉండేందుకు అధికార టీడీపీకి చెందిన నేత రంగంలోకి దిగాడు. సదరు స్కూల్లో తనకూ వాటా ఉందని పోలీసులతో బేరసారాలకు దిగాడు. ఇందుకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పేరు వాడుకొని పోలీసు స్టేషన్లలో దుప్పటి పంచాయితీలు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం రాణినగర్లో జరిగిన డీజే వివాదంలో కూడా అటు పోలీసులకు.. ఇటు బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఇతనికి పోలీసులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపస్తున్నాయి. అందులో భాగంగానే ట్రెల్లీస్ స్కూల్‌యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. పోలీసులు చట్టపరంగా కేసు నమోదు చేశామని చెబుతున్నా... నిందితుని అరెస్ట్.. యాజమాన్యంపై కేసులు నమోదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: స్కామ్‌పై సర్కారు సైలెన్స్! -
ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి పెళ్లి
అనంతపురం: ప్రేమకు లింగభేదాలు కూడా అడ్డురావని నిరూపించారు జాను, వంశీ. ట్రాన్స్‌జెండర్‌ను యువకుడు పెళ్లిచేసుకోవడంతో కణేకల్లులోనే కాదు సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కణేకల్లుకు చెందిన ట్రాన్స్‌జెండర్ జానుతో డీ.హీరేహళ్ మండలం గొడిసెలపల్లికి చెందిన వంశీకి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్లు ఇద్దరూ ప్రేమించుకొన్నారు. ప్రేమించిన జానుతో జీవితాంతం కలిసి ఉండి ఆమె జీవితంలో వెలుగులు నింపాలని నిర్ణయించుకొన్నాడు వంశీ. కొద్ది రోజుల క్రితమే ఈ విషయాన్ని జానుకూ చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. దీంతో బుధవారం కణేకల్లు బస్టాండ్‌లోని నాగులకట్ట వద్ద మనసా, వాచా, కర్మణా అంటూ జానూ మెడలో వంశీ మూడు ముళ్లూ వేశాడు. సహచర ట్రాన్స్ జెండర్లు దగ్గరుండి ఈ వివాహాన్ని జరిపించారు. తమ జానుకు పెళ్లికావడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. చదవండి: కన్నబిడ్డనే అమ్మాలనుకుంది.. -
ఆరుగురు దొంగల అరెస్ట్
నార్పల: శింగనమల, నార్పల, గార్లదిన్నె మండలాల్లో కేబుల్, బొందలవాడలో ఇంట్లో దొంగతనం, బైక్‌లు చోరీ చేసిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. బుధవారం నార్పలలోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో వివరాలు వెల్లడించారు. నార్పల సీపీఎం కొట్టాలకు చెందిన మురళి, బుక్కరాయసముద్రం ఎన్టీఆర్ మార్గ్‌కు చెందిన ఆంజనేయప్రసాద్, జనచైతన్య కాలనీకి చెందిన అమీన్ బాబా, అనంతపురం పాతూరుకు చెందిన సాయినాథ్, ధర్మవరానికి చెందిన గంగాధర, తాడిపత్రికి చెందిన హరీష్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి బొందలవాడ గ్రామంలో దొంగతనం చేసిన నాలుగు బంగారు చిన్న ఉంగరాలు, జత కమ్మలు, వెండి గొలుసులు రెండు కుంకమ గిన్నెలు, 1000 మీటర్ల కాపరు వైరు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపర్చామన్నారు. పాము కాటుకు బలైన రైతు బెళుగుప్ప: పాముకాటుకు ఓ రైతు బలైన సంఘటన మండల పరిధిలోని దుద్దేకుంటలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. దుద్దేకుంటలో రైతు పుల్లయ్య (69) బుధవారం తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ పంట నూర్పిడికి కుమారుడు లక్ష్మినారాయణతో పాటు మరో పది మంది కూలీలతో కలసి పొలంలో పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో విష సర్పం పుల్లయ్య ఎడమచేతిపై కాటు వేయడంతో గట్టిగా అరిచాడు. పాము కాట్లు ఉండటంతో హుటాహుటిన రైతు కుమారుడు లక్ష్మినారాయణ, అన్న కుమారుడు రఘు ఆయన్ను ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రైతు పుల్లయ్య మృతి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య రామాంజినమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు మొర పెట్టుకుంటున్నారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శివశంకర్‌నాయక్ తెలిపారు. -
అక్రమాలకు ‘సహకారం’
చిలమత్తూరు: సహకార కేంద్ర బ్యాంకు అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. అడిగేవారు లేకపోవడంతో బ్యాంకు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ బ్యాంకుకే తీరని నష్టం కలిగిస్తున్నారు. భూములను తాకట్టుపెట్టుకుని రుణాలు ఇస్తున్న బ్యాంకు సిబ్బంది రుణదాతలు రుణం మొత్తం చెల్లించినా... బ్యాంకులో చెల్లించకుండా సెక్రటరీలు మింగేసిన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో స్కాం రాష్ట్రంలో సంచలనంగా మారింది. హిందూపురం ఏడీసీసీ బ్యాంకులో భారీ స్కాం బయటపడింది. బ్యాంకులో పనిచేసే గోల్డ్ అప్రైజర్ ద్వారా నకిలీ బంగారం తనఖా పెట్టించి సుమారు రూ.8 కోట్లు రుణాలు పొందడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో హిందూపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బ్యాంకు సిబ్బంది పాత్రపై అనుమానాలు జిల్లా సహకార సంఘం బ్యాంకులో జరిగిన భారీ గోల్డ్ స్కాంలో ఇక్కడే పాతుకుపోయిన అధికారుల పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఘటన తో బ్యాంకులో పనిచేసే సిబ్బంది అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ స్కాంలో సూత్రధారులుగా అనుమానిస్తున్న బ్యాంకు మేనేజరు జయరాం చౌదరి, అసిస్టెంట్ మేనేజరు కంబగిరి, సహాయకురాలు అర్చనాభాయిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గుట్టుగా విచారణ ఏడీసీసీబీ అధికారులు హిందూపురంలోనే తిష్ట వేసి అవినీతి అంశంపై విచారణ వేగవంతం చేశారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఉంటూ నకిలీ బంగారం తాకట్టు అంశానికి సంబంధించి గుట్టుగా విచారణ జరుపుతున్నారు. నకిలీ బంగారం తాకట్టుపై ఇప్పటికే మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. సహకార బ్యాంకుల్లో ఇంత పెద్ద స్కాం బయట పడటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గోల్డ్‌స్కాం కేరాఫ్‌గా మారిన హిందూపురం ఏడీసీసీబీ నకిలీ బంగారంతో బ్యాంకుకు భారీ టోకరా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సహా ముగ్గురు సస్పెండ్ సమగ్ర విచారణ చేపట్టిన బ్యాంకు ఉన్నతాధికారులు ఎస్పీకి ఫిర్యాదు..? నకిలీ ఖాతాలు.. నకిలీ బంగారంఏడీసీసీ బ్యాంకులో సాధారణ తనిఖీలు నామమాత్రంగా సాగుతుండటంతో అక్రమార్కుల పంట పండింది. కేవలం రైతులు మాత్రమే రుణాలు తీసుకొనే ఈ బ్యాంకుల్లో నకిలీ రైతులను సృష్టించి, అదే విధంగా పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు తెరచి వాటి ద్వారా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి వాటిని తనిఖీ చేసే అప్రైజర్‌తో బ్యాంకు అధికారులు కుమ్మకై ్క ఈ భారీ స్కాంకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. తవ్వే కొద్దీ అక్రమాల చిట్టా బయటకు వస్తుండటం సంచలనంగా మారింది. ఈ విషయం అధికారికంగా బయటకు చెప్పనప్పటికీ బ్యాంకు ఉన్నతాధికారులు ఈ స్కాంపై ఐదు రోజులుగా విచారణ చేస్తూనే ఉండటంతో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గోల్డ్ స్కాం వ్యవహారంలో బ్యాంకులో పనిచేసే సిబ్బంది పాత్ర ఉండటంతో విచారణ అధికారులకు వారు ఏమాత్రం సహకరించనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భారీగా రుణాలు ఇచ్చినట్టు గుర్తించిన అధికారులు, ఈ వ్యవహారం పై పోలీసులు విచారణ చేస్తేనే నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో బుధవారం ఎస్పీ సతీష్‌కుమార్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. -
హెచ్చెల్సీ ఎస్ఈగా విఠల్ ప్రసాద్
అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్ఈగా విఠల్ ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇన్చార్జ్ ఎస్ఈ సుధాకర్‌రావు వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో మదనపల్లిలో హెచ్ఎన్ఎస్ఎస్ సర్కిల్ –3 ఎస్ఈగా పనిచేస్తున్న విఠల్ప్రసాద్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురు, శుక్రవారాల్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నట్లు హెచ్చెల్సీ అధికార వర్గాలు వెల్లడించాయి. చిన్న నీటి పారుదలశాఖకు నూతన అధికారులు చిన్న నీటి పారుదలశాఖ ఎస్ఈగా తిరుపతి తెలుగు గంగా ప్రాజెక్టు ఎస్ఈగా పనిచేస్తున్న శారదను నియమించారు. ఈమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ ఎస్ఈగా ఇరిగేషన్ సర్కిల్లో ఐబీ డివిజన్ ఈఈ ఏ. రాముకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జలవనరులశాఖ ఈఎన్సీ వరప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘కుష్టు’ నివారణే లక్ష్యంఅనంతపురం సిటీ: జిల్లాలో కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులకు డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకూ జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఇంటింటి సర్వే చేపట్టి కుష్టు వ్యాధి అనుమానిత కేసులను గుర్తించనున్నట్లు డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కుష్టు నివారణ అధికారి బి.జయలక్ష్మి, డాక్టర్ శివారెడ్డి, పారా మెడికల్ అధికారి నాగన్న, డీపీఎంఓలు రామదాస్, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. సమ్మె విరమించిన కార్మికులుకూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద ఏర్పాటైన సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికులు బుధవారం సమ్మె విరమించారు. పెండింగ్‌లో ఉన్న 5 నెలల వేతనాలు ఇవ్వాలని , ఇతర డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఈ నెల 1 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాజెక్ట డీఈ రామారావు, జేఈ భార్గవ్‌లు చర్చలు జరిపి ఒక నెల వేతనం డబ్బులు బుధవారం కార్మికుల ఖాతాల్లోకి జమ చేశారు. గురువారం మరో నెల వేతనం జమ చేస్తామని , మరో 10 రోజుల్లో మిగిలిన వేతనాన్ని జమ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ తెలిపారు. సమ్మె విరమించి విధుల్లోకి చేరుతున్నామని పేర్కొన్నారు. 10 రోజుల తర్వాత మిగిలిన వేతనాలు ఇవ్వకపోతే మళ్లీ సమ్మెబాట పడుతామని ఆయన హెచ్చరించారు. విద్యుదాఘాతంతో రైతు మృతి పెద్దపప్పూరు: పందుల బెడద నుంచి పంటను కాపాడుకోవాలని కాపలాగా వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తూ విద్యుదాఘానికి గురై మృతి చెందిన సంఘటన బుధవారం పెద్దపప్పూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని తురకపల్లికి చెందిన ఆదినారాయణరెడ్డి (61) తనకున్న పొలంలో మొక్కజొన్న పంటను సాగుచేశాడు. పందుల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు తరచూ రాత్రిళ్లు, తెల్లవారుజామున పొలానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లిన ఆదినారాయణరెడ్డి తెగిపడిన లెవెన్ కేవీ విద్యుత్ వైరును గుర్తించకపోవడంతో విద్యుదాఘానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి నలుగురు కుమార్తెలు సంతానం కాగా అందరికీ వివాహాలు అయ్యాయి. ఒకరు ఎస్ఐ, మరొకరు బ్యాంకు మేనేజర్, ఇంకొకరు సాఫ్ట్వేర్, ఒకరు వ్యవసాయ కుటుంబలో స్థిరపడ్డారు. గత కొన్నేళ్లుగా మృతుడి పెద్దయక్కలూరులో నివాసముంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పందుల దొంగల ముఠా అరెస్టు
హిందూపురం టౌన్: పోలీసులపై దాడులకు పాల్పడిన దొంగల ముఠాను ఎట్టకేలకు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. గతంలో పందులను దొంగిలించేందుకు బొలెరో వాహనంలో వచ్చిన ముఠా సభ్యులు పోలీసులను సైతం లెక్కచేయకుండా రెండు సార్లు దాడులకు పాల్పడి పరారయ్యారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి 11 మంది ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హిందూపురం ఏఎస్పీ మహేష్‌తో కలిసి ఎస్పీ సతీష్‌కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కేసు పూర్వాపరాలు ఇలా.. గత నెల 6న రాత్రి హిందూపురం పట్టణంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా, చిన్నమార్కెట్ సమీపంలో ఓ బొలెరో వాహనం ఆపకుండా వేగంగా వెళ్లింది. వెంబడించిన పోలీసులపై ముఠా సభ్యులు దాడి చేయడానికి ప్రయత్నించారు. సీఐని వాహనంతో గుద్దేందుకు ప్రయత్నించారు. సీఐ చాకచక్యంగా తప్పించుకున్నారు. అదే నెలలో 27న అర్ధరాత్రి సమయంలో హిందూపురం రూరల్ సీఐ జనార్దన్ స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో గస్తీలో ఉండగా, అదే సమయంలో ఓ బొలెరో రావడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. వారు ఆపకుండా వెళ్లడంతో సీఐ జనార్దన్ ఇతర పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసులపైనే రాళ్లు, బాటిళ్లతో దాడులకు యత్నించారు. దీంతో రూరల్ సీఐ జనార్దన్ దుండగుల వాహనంపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా దుండగులు తప్పించుకుపోయారు. దీనిపై హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. ముఠా అరెస్ట్... హిందూపురం పట్టణ శివారులో హైవేపై దారిదోపిడీకి సిద్ధమవుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం పట్టణంలోని సింగిరెడ్డిపల్లి శివారులో శిరా–కొడిగెనహళ్లి ఎన్‌హెచ్–544ఈ రహదారి వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా మారణాయుధాలతో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వన్‌టౌన్ సీఐ ప్రసాద్‌బాబు, టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం, హిందూపురం రూరల్ సీఐ జనార్దన్, యూపీఎస్ సీఐ ఆంజనేయులు, వన్‌టౌన్ ఎస్ఐ రాజేష్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముఠాలోని 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు హైవేపై రవాణా అవుతున్న పందుల లోడును దారి కాచి పందులను దొంగిలించేందుకు సిద్ధమైనట్లు వెల్లడైంది. వారి వద్ద నుంచి రూ.8.50 లక్షల నగదు, రెండు బొలెరో పికప్ వాహనాలు, ఆరు పిడిబాకులు, దాడి చేయడానికి ఉంచుకున్న రాళ్లు, 20 ఖాళీ కూల్‌డ్రింక్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పోలీసులపై దాడికి పాల్పడిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. విచారణలో నిందితులు గత నెల 27న హిందూపురం పట్టణంలో 10 పందులను దొంగలించినట్లు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టు అయిన వారిలా.. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అనంతపురానికి చెందిన ఎరికల చంద్రశేఖర్, సాకే రాజేష్, ఎరికల రమేష్, వెంకటేష్, బెస్త రాకేష్, సాకే మహేష్, ఎరికల గంగన్న, నడిమిండ్లు లక్ష్మణ్, ఎరికల సునీల్, జె.రోహిత్, హిందూపురానికి చెందిన వెంకటేష్ ఉన్నారు. వీరు పందులను దొంగలించి కర్ణాటక, అనంతపురం ప్రాంతాల్లో విక్రయించేవారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన పందులను కొన్న అనంతపురం, కర్ణాటకకు చెందిన వారిని కూడా పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులపై కేసులు ప్రస్తుతం అరెస్టు అయిన ముఠా సభ్యులపై హిందూపురం వన్‌టౌన్, ఉరవకొండ, తాడిపత్రి టౌన్, తాడిపత్రి రూరల్, గుంతకల్లు రూరల్, కసాపురం, యల్లనూరు, కళ్యాణదుర్గం అర్బన్, డోన్ రూరల్, అమరాపురం, నల్లమాడ, బుక్కరాయసముద్రం తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, పోలీసులపై దాడులు, హింసాత్మక నేరాలకు సంబంధించిన పలు కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐలు ప్రసాద్ బాబు, ఆంజనేయులు, జనార్ధన్, కరీం, ఎస్ఐ రాజేష్, ఉమ్మడి అనంతపురం జిల్లా క్రైమ్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులను అందించారు. 11 మంది అరెస్ట్, పరారీలో ఇద్దరు రూ.8.50 లక్షల నగదు, రెండు బొలెరోలు, మారణాయుధాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్‌కుమార్ -
ధరల నియంత్రణకు చర్యలు తీసుకోండి
ఉరవకొండ: నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారం పడుతోందని, వెంటనే అధికారులు స్పందించిన ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన అనంతపురంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత ఏడాదితో పొలిస్తే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ముఖ్యంగా కొందరు దళారీలు, వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు సరుకులు తరలిస్తుండటంతో ధరలు అందనంతస్థాయికి పెరిగిగాయన్నారు. చౌకదుకాణాల ద్వారా పేదలకు నిత్యావసరాలు అందించాలన్నారు. జిల్లాలో తీవ్ర కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకొని కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, పశుగ్రాసం కొరత తీర్చడానికి దానా కేంద్రాలు వెంటనే ప్రారంభించాలన్నారు. హంద్రీనీవా ద్వారా ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లోని చెరువులకు నీరు అందించాలన్నారు. చెరువులు, కుంటలు నిండితే కనీసం పశువుల దాహర్తి అయినా తీరుతుందన్నారు. కరువుతో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరారు. -
ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి పెళ్లి
కణేకల్లు: ప్రేమకు లింగభేదాలు కూడా అడ్డురావని నిరూపించారు జాను, వంశీ. ట్రాన్స్‌జెండర్‌ను యువకుడు పెళ్లిచేసుకోవడంతో కణేకల్లులోనే కాదు సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కణేకల్లుకు చెందిన ట్రాన్స్‌జెండర్ జానుతో డీ.హీరేహళ్ మండలం గొడిసెలపల్లికి చెందిన వంశీకి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్లు ఇద్దరూ ప్రేమించుకొన్నారు. ప్రేమించిన జానుతో జీవితాంతం కలిసి ఉండి ఆమె జీవితంలో వెలుగులు నింపాలని నిర్ణయించుకొన్నాడు వంశీ. కొద్ది రోజుల క్రితమే ఈ విషయాన్ని జానుకూ చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. దీంతో బుధవారం కణేకల్లు బస్టాండ్‌లోని నాగులకట్ట వద్ద మనసా, వాచా, కర్మణా అంటూ జానూ మెడలో వంశీ మూడు ముళ్లూ వేశాడు. సహచర ట్రాన్స్ జెండర్లు దగ్గరుండి ఈ వివాహాన్ని జరిపించారు. తమ జానుకు పెళ్లికావడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. దగ్గరుండి వివాహం జరిపించిన ట్రాన్స్జెండర్లు -
గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలి
అనంతపురం అర్బన్: గిరిజనుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన కాలనీల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. కొన్ని గ్రామాల్లో శ్మశానవాటికలు లేవన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యం అనంతపురం న్యూ టౌన్: గిరిజనుల సమస్యలను పరిష్కరించడమే ఎస్టీ కమిషన్ లక్ష్యమని చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్–నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక పంటలు దెబ్బతిన్నాయని, రైతులను, కూలీలను ఆదుకోవాలని గిరిజనుల నుంచి అర్జీలు అందాయని తెలిపారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన ప్రజల నుంచి పలు సమస్యలతో కూడిన అర్జీలను కమిషన్ బృందం స్వీకరించింది. విజయవాడకు వెళ్లిన కలెక్టర్ అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నుంచి రెండురోజుల పాటు కలెక్టర్లతో నిర్వహించనున్న కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కలెక్టర్ ఆనంద్ బుధవారం విజయవాడకు వెళ్లారు. జిల్లాకు సంబంధించిన నివేదికను కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సమర్పించనున్నారు. కాన్ఫరెన్స్ ముగిసిన తరువాత ఆయన 12న జిల్లాకు తిరిగి వస్తారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. డిస్ట్రిబ్యూటరీలకు ఆన్ అండ్ఆఫ్ పద్ధతిలో నీరు కణేకల్లు: హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు విడుదల చేయనున్నట్లు కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌డివిజన్ డీఈఈ దివాకర్‌రెడ్డి తెలిపారు. స్థానిక హెచ్చెల్సీ కార్యాలయంలో బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హెచ్ ఎల్ఎంసీ, జీబీసీ పరిధిలో 40 వేల ఎకరాల ఆయకట్టులో ఆరుతడి పంటలకు సాగునీరిస్తామన్నారు. ప్రతి రైతు పొలానికీ నీరందించాలనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటరీలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీరు సరఫరా చేస్తామన్నారు. ఎస్కేయూకు రూ.10 కోట్ల నిధులు అనంతపురం సిటీ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్కేయూసీఈటీ)కు మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎంఈఆర్ఐటీఈ) ప్రాజెక్ట్ కింద రూ.10 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సాంకేతిక విద్యా బోధన–అభ్యసన నాణ్యతను మెరుగుపరచడం, సమాన అవకాశాల కల్పన, పరిశోధన, ఆవిష్కరణలు, డిజిటలైజేషన్ ద్వారా సంస్థాగత పాలన బలోపేతం కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. ప్రాజెక్ట్ దక్కేందుకు కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బందిని వర్సిటీ వీసీ పొఫెసర్ ఎన్.వి.ఆర్. జ్యోతికుమార్ అభినందించారు. 12న లోక్ అదాలత్ అనంతపురం సెంట్రల్: ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్పీ జగదీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు స్టేషన్లు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడే క్రిమినల్, ట్రాఫిక్ చలాన్లు, సివిల్ కేసులు పరిష్కరించుకోవడానికి ఇదే మంచి అవకాశమని వివరించారు. జేఎన్టీయూఏ వేదికగా ‘ఇన్నోవేటర్స్ కాన్క్లేవ్’ ● అక్టోబర్‌లో రెండు రోజుల పాటు జాతీయస్థాయి సదస్సు అనంతపురం: ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, పారిశ్రామికత, పరిశ్రమలు –విద్యాసంస్థల అనుసంధానానికి మరింత బలమైన వేదికను కల్పించే లక్ష్యంతో జేఎన్టీయూఏ వేదికగా జాతీయస్థాయి ‘ఇన్నోవేటర్స్ కాన్క్లేవ్–2026’ నిర్వహించనున్నట్లు వీసీ పొఫెసర్ హెచ్.సుదర్శనరావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. ‘ఆవిష్కరణలు – ప్రభావం చూపే చోటు’ ఇతివృత్తంగా అక్టోబర్ 24, 25 తేదీల్లో జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, విద్యాసంస్థలను ఒకే వేదికపైకి తీసుకురానున్నట్లు చెప్పారు. -
ట్రెల్లీస్ స్కూల్లో దారుణం
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ట్రెల్లీస్ పాఠశాలలో బాలికపై అక్కడ పనిచేస్తున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి వేధించాడన్న అభియోగాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో తరగతి చదువుతున్న బాలిక బాత్రూంకు వెళ్లిన సమయంలో అక్కడ శుభ్రత పనులు చేసే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ తర్వాత కూడా బాలికను వేధించాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్ద బాలిక ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లి ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ‘చిన్న విషయం’గా ఎలా చూస్తారు? తమ కుమార్తైపె జరిగిన అఘాయిత్యాన్ని పాఠశాల యాజమాన్యం చిన్న విషయంగా చూస్తోందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కరస్పాండెంట్ వడ్ల శ్రీకాంత్, డైరెక్టర్ అనిల్తేజ తమ ఫిర్యాదుపై సరిగా స్పందించలేదన్నారు. ప్రశ్నిస్తే తమకు రాజకీయ, పోలీసు అధికారుల అండ ఉందంటూ బెదిరించారన్నారు. పోలీసులను ఆశ్రయించినప్పటికీ సమస్యను చిన్నదిగా చూడటం బాధ కలిగించిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. ఆ స్కూల్ నాదే.. ఆ వైపు వెళ్లకండి! అనంతపురం సెంట్రల్: నగరంలో ట్రెల్లీస్ స్కూల్లో వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఓ ద్వితియ శ్రేణి టీడీపీ నాయకుడు పెద్దస్థాయిలో మంత్రాంగం నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రెలీస్స్కూల్ యాజమాన్యం జీసస్ నగర్, బళ్లారి బైపాస్ రోడ్డులో బ్రాంచులు నడుపుతోంది. గత 20 రోజులుగా స్కూల్లో విద్యార్థులపై వరుస ఘటనలు జరుగుతున్నాయి. గత నెల 22న బళ్లారి బైపాస్ బ్రాంచ్‌లో 10వ తరగతి చదువుతున్న హర్షిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థి విచక్షణా రహితంగా దాడి చేశాడు. కంటి వద్ద బలమైన గాయమైంది. పిల్లలు కొట్టుకున్నా.. విద్యార్థికి తీవ్ర గాయమైనా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా టీసీ తీసుకొని వెళ్లిపోండి అంటూ బెదిరించారు. దీంతో బాధిత విద్యార్థి తల్లి నాగలక్ష్మి న్యాయం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీజగదీష్ను కలిసి వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇక ఇటీవల బాత్రూమ్కు వెళ్లిన ఓ బాలికపై అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించాడు. రంగంలోకి టీడీపీ నేత ట్రెల్లీస్ యాజమాన్యంపై చర్యలు లేకుండా ఉండేందుకు అధికార టీడీపీకి చెందిన నేత రంగంలోకి దిగాడు. సదరు స్కూల్లో తనకూ వాటా ఉందని పోలీసులతో బేరసారాలకు దిగాడు. ఇందుకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పేరు వాడుకొని పోలీసు స్టేషన్లలో దుప్పటి పంచాయితీలు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం రాణినగర్లో జరిగిన డీజే వివాదంలో కూడా అటు పోలీసులకు.. ఇటు బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఇతనికి పోలీసులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపస్తున్నాయి. అందులో భాగంగానే ట్రెల్లీస్ స్కూల్‌యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. పోలీసులు చట్టపరంగా కేసు నమోదు చేశామని చెబుతున్నా... నిందితుని అరెస్ట్.. యాజమాన్యంపై కేసులు నమోదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిదేళ్ల చిన్నారిపై సిబ్బంది అఘాయిత్యం యాజమాన్యం పట్టించుకోలేదని తల్లిదండ్రుల ఆవేదన పోలీసులకు ఫిర్యాదు.. ‘పోక్సో’ కేసు నమోదు -
టీడీపీ నాయకుల అరాచకం
పెద్దవడుగూరు : మండలంలో టీడీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయి. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతుండడంతో మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ కార్యాలయానికి టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తాళం వేశారు. దాన్ని తీయడానికి బుధవారం ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు ఏకపక్షంగా అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల వైఎస్సార్సీపీ నాయకుడు ఎద్దుల సూర్యప్రభాకర్‌రెడ్డి పెద్దవడుగూరులో పార్టీ కార్యాలయ నిర్వహణకు పి.కొట్టాలపల్లికి చెందిన శిరారెడ్డి భవనాన్ని బాడుగకు తీసుకున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు పోలీసులకు తెలిపారు. వారు చెప్పిందే వేదంగా పోలీసులు భవన యజమానిపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఆయన స్టేషన్‌కు వెళ్లారు. తాను భవనాన్ని బాడుగకు ఇచ్చానని స్పష్టం చేశారు. అయినా పోలీసులు వారం రోజుల పాటు కార్యాలయం తెరవడానికి వీల్లేదని సూచించారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు పోలీసుల సూచనలు పాటించి వారం పాటు కార్యాలయ తలుపులు తీయలేదు. పోలీసులు ఇచ్చిన గడువు ముగియడంతో రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ కార్యకర్తలు కార్యాలయ తలుపు తీశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలను బయటకు పంపి దౌర్జన్యంగా తాళం వేసుకుని వెళ్లారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు సూర్యప్రభాకర్‌రెడ్డి, భవన యజమాని కలసి పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు స్పందించలేదు. పోలీసుల ఏకపక్ష వైఖరి పోలీసుల ఏకపక్ష ధోరణితో విసిగిపోయిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎద్దుల శరభారెడ్డి, నాయకులు బుధవారం కార్యకర్తలతో కలసి కార్యాలయ తాళం తీయడానికి ప్రయత్నించారు. అయితే ఎస్ఐ రాఘవేంద్రప్ప, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుతో విసిగి పోయిన మండల కన్వీనర్ ఎద్దుల శరభారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. గమనించిన ఎస్ఐ వారించారు. సీఐ నరేంద్రరెడ్డి సిబ్బందితో చేరుకుని ఘటనపై ఆరా తీశారు. చివరకు భవన యజమాని ఎలా చెబితే అలా చేస్తామనడంతో ఆయన్ను అక్కడికి పిలిపించారు. తాను వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇష్ట పూర్వకంగానే భవనం ఇచ్చానని యజమాని స్పష్టం చేశారు. అయినా పోలీసులు ససేమిరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయ తాళం తీసి లోపలికి వెళ్లారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు దాడికి సిద్ధమై అక్కడికి బయలుదేరారు. దీంతో పోలీసు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. – వైఎస్సార్సీపీ కార్యాలయానికి తాళం – తెరవడానికి ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకులు – ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు -
విజయఢంకా మోగించాలి
రాష్ట్రంలోని వెన్నుపోటు ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయ ఢంకా మోగించాలి. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపించేందుకు కలసికట్టుగా కృషి చేయాలి. పార్టీ కార్యకర్తలను దేవుళ్లుగా భావించి ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ముందుంటుంది. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి
ప్రజల అవసరాలకు సంబంధించిన తాగునీటి పథకం నిర్వహణకు కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. దీంతో కార్మికులకు ఉద్యోగ భద్రత, రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట పడుతుంది. తొలగించిన 23 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పూర్తి వేతనాలు, పీఎఫ్ చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మికులకు న్యాయం జరిగే వరకు సీఐటీయూ పోరాటం కొనసాగిస్తుంది. –ఎస్.నాగేంద్రకుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి
గార్లదిన్నె: రైతులు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కల్లూరు, కనంపల్లిలో ‘పొలం పిలుస్తోంది’ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి ఉమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల వల్ల వరి పంట సాగు చేయవద్దన్నారు. బీడు భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు. రైతులు ఫారం పాండ్స్ నిర్మించుకుని వర్షపు నీటి వృథాను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకట్ కుమార్, టెక్నికల్ ఏఓ రాకేష్, ఏఓ సోమశేఖర్, హెచ్ఓ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర విచారణ చేపట్టాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యవేక్షణ పూర్తిగా కుప్పకూలింది. ఆర్డ్డబ్ల్యూఎస్ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలకు నిరంతర తాగునీరు అందించడం పక్కనబెట్టి.. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ ప్రజల హక్కులను తాకట్టు పెడుతున్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టుపై హై లెవల్ కమిటీతో సమగ్ర విచారణ జరపాలి. అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. –వెన్నపూస రవీంద్రారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం -
ఎండుతున్న పంటలను కాపాడండి
అనంతపురం: తీవ్ర వర్షాభావంతో ఎండిపోతున్న పండ్లతోటలను, పంటలను కాపాడుకోవడానికి తక్షణమే హంద్రీ–నీవా నీటితో చెరువులు నింపాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి జిల్లాలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను వివరించి, వినతిపత్రం అందజేశారు. అనంతరం విశ్వ మాట్లాడుతూ జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతులను, ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హంద్రీ–నీవా కింద 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హంద్రీ–నీవా అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు జీవనాడి వంటిదన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చెరువులకు నీరు ఇచ్చిన తరువాతే.. ఇతర ప్రాంతాలకు నీరు తరలించాలని కోరారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజూ నీరు వృథాగా కిందకు వెళ్తోందన్నారు. టీబీ డ్యాంలో 96 టీఎంసీల నీరున్నందున సరైన ప్రణాళికతో అనంతపురం జిల్లాకు అదనంగా 5 టీఎంసీల నీటిని మళ్లించే అవకాశం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కూడేరులో దారుణ పరిస్థితులు జిల్లాలో సగటు వర్షపాతం 550 మి.మీ అయితే, కూడేరు ప్రాంతంలో 350 మి.మీ మాత్రమే కురుస్తుందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అయితే ఈ ఏడాది ఎల్–నినో ప్రభావంతో 150 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైందన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు ఎండిపోవడంతో కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల తోటలను కాపాడుకోవడానికి రైతులు రోజుకు ట్యాంకర్‌కు రూ.600 చొప్పున వెచ్చించాల్సి వస్తోందన్నారు. ఈ భారం మోయలేక రైతులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలే కాకుండా మనుషులకు, పశువులకు కూడా తీవ్రమైన తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కేవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కూడేరు మండల అధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హంద్రీ–నీవా కింద 3.5 లక్షల ఆయకట్టుకు నీరివ్వాలి ఉమ్మడి జిల్లాలో చెరువులు నిండిన తర్వాతే ఇతర ప్రాంతాలకునీరు తరలించాలి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ -
అనుమతి లేకుండా విక్రయం.. పురుగుల మందుల సీజ్
విడపనకల్లు: మండల పరిధిలోని గడేకల్లు గ్రామంలో మంగళవారం బాలాజీ ఫర్టిలైజర్ షాపుతో పాటు కోరమాండల్, మన గ్రోమోర్ సెంటర్లను అధికారులు తనిఖీ చేశారు. అనుమతి లేని పురుగుల మందులను విక్రయిస్తున్న సాయి బాలాజీ ఫర్టిలైజర్ షాపులో రూ.9,300, కోరమాండల్ షాపులో 40 లీటర్ల పురుగుల మందును సీజ్ చేశారు. రూ.1.3 లక్షల విలువ చేసే మందులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అనంతపురం, ఉరవకొండ ఏడీఏలు విద్యావతి, సత్యనారాయణ, వ్యవసాయాధికారి పెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
అనంతపురం న్యూటౌన్: స్థానిక సంస్థల సమరానికి వైఎస్సార్సీపీ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా బుధవారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నగరంలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసింది. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాట్లను పర్యవేక్షించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి, రాబోయే ‘స్థానిక’ పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు బోరెడ్డి నరేష్ కుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యా హ్నం 3 గంటలకు విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం.. ఇద్దరికి షోకాజ్ అనంతపురం ఎడ్యుకేషన్: కుందుర్పి మండలం అప్పిలేపల్లిలో తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా ఎందుకు నిలిచిపోయింది? అంతరాయానికి కారణాలేమిటి? సమస్య పరిష్కారానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీపీఓ సూచించారు. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. చుక్కలు చూపుతున్న ‘సర్వర్’ బొమ్మనహాళ్: సామాజిక భద్రత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారికి సర్వర్ పనిచేయకపోవడంతో చుక్కలు కనిపించాయి. రెండేళ్ల తర్వాత కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించడం.. అదీ ఈ నెల 16వ తేదీలోపు వరకే గడువు ఉండడంతో అర్హులైన వారు సచివాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో రెండవరోజు మంగళవారం నేమకల్లు సచివాలయంలో సర్వర్ మొరాయించడంతో దరఖాస్తుదారులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల అయితే సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మిగిలిన రోజుల్లో పరిస్ధితి ఎలా ఉంటుందోనని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ప్రక్రియపై అవగాహన లేని వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు లేదా ఇతరులతో కలిసి సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి. -
వైభవంగా ఆది చెన్నకేశవస్వామి రథోత్సవం
వజ్రకరూరు: కొనకొండ్లలో ఆది చెన్నకేశవ స్వామి రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం, పల్లకీసేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మడుగు తేరు చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు ఉట్ల ఉత్సవం నిర్వహించారు. పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి జై ఆది చెన్నకేశవ అంటూ రథాన్ని ముందుకు లాగారు. స్వామివారి రథంపై భక్తులు పండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. రథాన్ని మారెమ్మ కట్ట వరకు లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ ఏటా నిర్వహించే రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో కలిసి మెలసి జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నాగస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కాకర్ల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణాయాదవ్, మాజీ సర్పంచు నంచర్ల ఇందిరమ్మ, మాజీ ఎంపీపీ రామచంద్ర, ఆలయ ఈఓ అంగదాల క్రిష్ణయ్య, ఎంపీటీ సీలు పాపన్న, మునయ్య, ముద్దయ్య, సీనియర్ నేత నంచర్ల లాలెప్ప, మాజీ ఉప సర్పంచులు రామక్రిష్ణ, గురు, మాజీ ఎంపీటీసీ శ్రీరాములు, మాజీ సర్పంచు పెద్దరాజు, క్లర్క్ లాలేష్ పాల్గొన్నారు. నేడు వసంతోత్సవం.. ఆదిచెన్నకేశవ స్వామి రథోత్సవంలో భాగంగా బుధవారం స్వామివారికి అభిషేకం, పల్లకీ సేవ, వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు భూదేవి, లక్ష్మమ్మ దోపులు, పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఈఓ అంగదాల క్రిష్ణయ్య తెలిపారు. -
కరువు మండలాలపై మల్లగుల్లాలు
అనంతపురం అగ్రికల్చర్: కరువు మండలాలను ప్రకటించేందుకు చంద్రబాబు సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నడుమ ఇప్పటికే కరువు గుప్పిట్లోకి వెళ్లినా.. ముందస్తు ప్రకటన చేయకుండా వేచిచూసే ధోరణి అవలంబిస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా కరువు ఛాయలు కమ్మేశాయి. అయినా కరువు మండలాలను ప్రకటించకుండా ఆలస్యం చేస్తుండటం గమనార్హం. ఈ నెలాఖరులోపు వర్షం వస్తే... కొన్ని మండలాలను జాబితా నుంచి తప్పించే ఎత్తుగడే ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు. అన్నింటా లోటు వర్షపాతం ఖరీఫ్ సీజన్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 61.2 మి.మీకు గాను 11.8 శాతం అధికంగా 68.4 మి.మీ నమోదైంది. ఇక విత్తుకు కీలకమైన జూలైలో 64.3 మి.మీకు గాను ఏకంగా 70.8 శాతం తక్కువగా 18.8 మి.మీ నమోదైంది. పంటలు కీలకదశలో ఉండే ఆగస్టులో 84.4 మి.మీకు గాను 54 శాతం తక్కువగా 33.8 మి.మీ వర్షం కురిసింది. ఇక సెప్టెంబర్‌లో 111.6 మి.మీకు గాను కేవలం 1.8 మి.మీ నమోదు కావడం గమనార్హం. ఇలా నెలలు కరిగిపోతున్నా వర్షం జాడ కరువైంది. ఇప్పటి వరకు 230 మి.మీకు గాను 47 శాతం తక్కువగా 123 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే నాలుగైదు రోజుల్లో వర్షపాతం లోటు 50 శాతానికి చేరువకానుంది. 32 మండలాల్లోనూ సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతం నమోదు కావడంతో కరువు జాబితాలోకి చేరాల్సిన పరిస్థితి నెలకొంది. 70 శాతానికి చేరిన ‘ఖరీఫ్’ ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం తాజా నివేదిక ప్రకారం 70 శాతానికి చేరింది. 3.43 లక్షల హెక్టార్లకు గానూ 2.38 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. అందులో కంది మాత్రమే అధికంగా సాగు చేశారు. 78,274 హెక్టార్లు అంచనా వేయగా ఏకంగా 1.18 లక్షల హెక్టార్లకు చేరింది. 1.47 లక్షలు హెక్టార్లు అంచనా వేసిన వేరుశనగ 51 వేల హెక్టార్లకు పరిమితమైంది. ఇక పత్తి 28 వేల హెక్టార్లు, మొక్కజొన్న 14,500 హెక్టార్లు, ఆముదం 11,500 హెక్టార్లు, సజ్జ 2,300 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 430 హెక్టార్లు, ఉలవ 220 హెక్టార్లు, అలసంద 150 హెక్టార్లు, జొన్న 430 హెక్టార్లు, సోయాబీన్ 160 హెక్టార్లలో సాగు చేశారు. ఇక నీటి వసతి కింద 23 వేల హెక్టార్లు అంచనా వేసిన వరి ప్రస్తుతం 10,700 హెక్టార్ల వద్ద ‘సాగు’తోంది. నెలల తరబడి వర్షం లేకపోవడంతో ఒక్క పంట నుంచి కూడా దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే పంటలన్నీ ఎండుముఖం ముందస్తు ‘కరువు’ ప్రకటనపై సర్కారు మౌనముద్ర నెలాఖరులోపు వర్షం వస్తే మండలాలను తగ్గించేందుకు ఎత్తుగడ! -
తారస్థాయికి వర్గపోరు
అనంతపురం టౌన్: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుతోంది. త్వరలో జరగనున్న అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు చెక్ పెట్టేలా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తనదైన శైలిలో వ్యూహాలు పన్నుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం కష్టపడి పని చేసిన మైనార్టీలు, బలిజ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు దగ్గుపాటికి దూరంగా ఉన్నారు. అలాంటి నేతలను వైకుంఠం తనవైపు తిప్పుకునేలా రాజకీయం నెరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మసీద్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారు. శ్రీనగర్‌కాలనీలో ఆదివారం మసీదు శంకుస్థాపన సందర్భంగా కేఎం షకీల్‌షఫీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. అసమ్మతి నేతలతో అలా జతకట్టి.. దగ్గుపాటికి వ్యతిరేకంగా ఉన్న బలిజ సామాజికవర్గ టీడీపీ ముఖ్య నాయకులతో పాటు ముస్లిం మైనార్టీ నేతలు ఆదివారం శ్రీనగర్ కాలనీలో జరిగిన మసీదు శంకుస్థాపనకు హాజరయ్యారు. వారందరినీ వైకుంఠం ప్రభాకర్‌చౌదరి ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకున్నారు. వారు కూడా చౌదరిని పొగడ్తలతో ముంచెత్తారు. 2024 ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసం పనిచేసిన టీడీపీ సీనియర్ నాయకుడు రాయల్ మురళిని ఎన్నికల అనంతరం దూరంగా పెట్టారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి, మైనార్టీ నాయకులతోపాటు బీసీ నేతలు ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన అత్యంత సీనియర్ నాయకులు జిల్లా మాజీ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తితోపాటు ఎమ్మెల్యేకు అన్నీ తానై నడిపించిన గంగారం, ఏపీఐఐసీ డైరెక్టర్ ఇలా అనేక మందిని ఎమ్మెల్యే దూరం పెట్టారు. అలాంటి వారందరినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి రాజకీయాలు చేయడం మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గీయులకు మేయర్ పదవి రాకుండా చెక్ పెట్టే విధంగా వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిని పొగడ్తలతో ముంచెత్తుతూ విందు రాజకీయాలకు తెరలేపారు. అందులో భాగంగానే నెల రోజుల కిందట జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్‌సాబ్ ఇంటిలో ఆయన తనయుడు ముక్తియార్ ఇచ్చిన విందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యతిరేక వర్గం పాల్గొంది. మైనార్టీలు, బలిజలు ఒకతాటిపైకి వచ్చి వచ్చే ఎన్నికల్లో దగ్గుపాటికి వ్యతిరేకంగా తమ సత్తా ఏమిటో చాటి చెప్పే విధంగా ముందుకు వెళ్లాలని చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దగ్గుపాటి – ప్రభాకర్‌చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. రెండేళ్ల పాలనపై వైకుంఠం ప్రెస్‌మీట్ పెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దగ్గుపాటి పెద్ద ఎత్తున దందాలు, భూ అక్రమాలకు పాల్పడి రూ.వందల కోట్లు దోచుకున్నాడని దుమ్మెత్తిపోశారు. అధికార పార్టీలో రగులుకున్న అసమ్మతి పోరు ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి. సామాజికవర్గమంతా దూరమే.. ఎమ్మెల్యే దగ్గుపాటి నుంచి తనకు ప్రాణహాని ఉందని గతంలోనే ‘లిక్కర్’ సుధాకర్‌నాయుడు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేతో విభేదించి వైరి వర్గంగా కొనసాగుతున్నాడు. ఇక మున్సిపాలిటీ పరిధిలోని కాంట్రాక్టులన్నీ దగ్గుపాటి ఇన్ఫ్రాకు అప్పగించడంపై శ్రీనివాసచౌదరి అనే కాంట్రాక్టర్ ఇటీవల ఆర్టీఐ యాక్ట్ కింద వివరాలు అడిగాడు. అసలు సీనియార్టీ లేని దగ్గుపాటి ఇన్ఫ్రాకు పనులు ఎలా కేటాయించారని అందులో ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ఫోన్ ద్వారా మంతనాలు నడిపాడు. ఆ ఫోన్‌కాల్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే భార్య శ్రీనివాసచౌదరిపై నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన అతను..రెండు రోజుల కిందట హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. ఫ్లెక్సీ కడితేనే డీలర్షిప్ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ పెద్దలు స్టోర్ డీలర్ షిప్‌లన్నీ ‘తమ్ముళ్ల’కే ఇప్పించారు. దీంతో డీలర్ల వల్ల తనకేమీ లాభం లేదని భావించిన ఎమ్మెల్యే దగ్గుపాటి తన జన్మదినం.. ఇతరత్ర కార్యక్రమాల సమయంలో తన ఫొటోతో ప్రతి డీలరూ కనీసం 5 బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టాలని హుకుం జారీ చేశారు. అంతేకాకుండా సదరు ఫ్లెక్సీ ఫొటో, వీడియో పెట్టాలని ఆదేశించారు. లేకపోతే డీలర్షిప్ రద్దవుతుందని హెచ్చరించారు. దీంతో డీలర్లంతా ఇష్టం లేకపోయినా టీడీపీ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే ఇంటి ఫంక్షన్ల వేళ ఒక్కో ఫ్లెక్సీ రూ. 6 వేల చొప్పున ఖర్చు చేసి ఫెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై డీలర్లంతా ఇప్పటికే తమ గోడును టీడీపీ పెద్దల వద్ద వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటికి చెక్ పెట్టేలా వ్యూహాలు అసమ్మతి నేతలను కూడగడుతున్న ‘వైకుంఠం’ మసీద్ శంకుస్థాపన వేదికగా పావులు కదిపిన వైనం -
విద్యుత్ సరఫరాలో విఫలం
● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజంరాప్తాడు రూరల్: డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయి, రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడుతోందని ఆరోపించారు. మంగళవారం హంపాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరాను పెంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటల విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే రాప్తాడు నియోజకవర్గంలో మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం 7 గంటలైనా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను చులకనగా చూస్తున్నారు విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, విద్యుత్ కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేవని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రైతుల కష్టాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు సత్తిరెడ్డి, గద్దె కేశవరెడ్డి, మండల కన్వీనరు సాకే వెంకటేశు, మాజీ కన్వీనరు శేఖర్, యూత్ కన్వీనరు విశ్వనాథరెడ్డి, హంపాపురం సింగారప్ప, చుక్కా సంజీవరాయుడు, రామినేపల్లి మాధవరెడ్డి, మన్నల రవికుమార్, రాప్తాడు చిరుతల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలు
గుంతకల్లు రూరల్: స్థానిక టీవీ స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంతకల్లు పట్టణానికి చెందిన జోహా అనే బాలిక తీవ్రంగా గాయపడింది. వివరాలు.. ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో నివాసం ఉంటున్న ఎస్కే రియాజ్ బాషా, నసీరున్సీసా దంపతుల కుమార్తె జోహ పట్టణంలోని సాయిబాబా స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం స్కూలు వదలగానే తండ్రి రియాజ్‌బాషా కుమార్తెను స్కూటీపై ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో టీవీ స్టేషన్ వద్ద మలుపు తిరగ్గానే ఎదురుగా వేగంగా వచ్చిన కంటైనర్ లారీ స్కూటీని ఢీకొంది. దీంతో తండ్రి,కుమార్తె పక్కకు పడిపోయారు. అదే సమయంలో కంటైనర్ లారీ టైరు బాలిక కుడికాలిపై వెళ్లడంతో ఛిద్రమైపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన రియాజ్‌బాషా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే ఇద్దరినీ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం బాలికను అనంతపురం తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. స్థానికుల రాస్తారోకో టీవీ స్టేషన్ సమీపంలో ఇటీవల నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ అక్కడ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆందోళనకు దిగారు. నిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డులో ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో గాయపడిన బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ స్థానికులకు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. -
ఇసుక అక్రమ రవాణాకు చెక్
పామిడి: వంకరాజుకాలువ గ్రామ పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతుండటంపై గ్రామస్తులు ఆగ్రహించారు. మూకుమ్మడిగా వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. నది పరీవాహక ప్రాంతం సమీపంలో 150 మంది రైతులు 400 ఎకరాల మాగాణిలో వరి సాగుచేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు, తాగడానికి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉండటంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ఇలాగే ఉంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి మంగళవారం ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా తవ్వకాలు చేపడతారంటూ ప్రశ్నించారు. ఇంతలో నియోజకవర్గ ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి గ్రామ టీడీపీ నాయకులకు ఫోన్ వచ్చింది. సిక్స్‌వే నిర్మాణంలో భాగంగా గుడ్డాలపల్లి వద్ద చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణం కోసం ఇసుక తరలిస్తున్నట్లు తెలపగా.. సాగు–తాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశమున్నందున తవ్వకాలకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. గత్యంతరం లేక ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఇసుక రవాణాదారులు హిటా చీ, టిప్పర్లను పెన్నానది నుంచి తీసుకెళ్లిపోయారు. -
అగ్ని ప్రమాదంలో పశుగ్రాసం దగ్ధం
బెళుగుప్ప: మండల కేంద్రానికి చెందిన రైతు శివ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో అగ్ని ప్రమాదం జరిగింది. పశుగ్రాసంతో పాటు గృహోపకరణాలు, పశువుల షెడ్డు మంటల్లో కాలిపోయాయి. కళ్యాణదుర్గం అగ్నిమాపక స్టేషన్ ఇన్చార్జ్ వసంతనాయక్, సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో ఘటనాస్థలికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను చుట్టుపక్కల గడ్డివాములకు విస్తరించకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంతో రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు శివ పేర్కొన్నారు. రైలు కింద పడి యువతి ఆత్మహత్య గుత్తి: పట్టణంలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన మునిస్వామి కుమార్తె హేమ(20) కాల్వగడ్డ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హేమ కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదు. ఇటీవల హేమకు పెళ్లి ఖాయమైంది. దసరాకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మునిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. డీఎస్సీ అవకతవకలపై విచారణ జరపాలి ● ఎస్ఎఫ్ఐ డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తరిమెల గిరి, ఓతూరు పరమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఒకవైపు అవకతవకలు జరగలేదని చెబుతూనే మరోవైపు కొంతమందిని అరెస్టు చేయడం, పలు ఘటనలపై విచారణకు ఆదేశించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎంపికై న అభ్యర్థుల విజయగాథలను మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం కంటే, అన్యాయానికి గురైన అభ్యర్థుల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఏళ్ల తరబడి చదువుతూ, లక్షల రూపాయలు ఖర్చు చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరిగితే వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు అంగన్వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యం ● ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం అనంతపురం సిటీ: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టినట్లు ఐసీడీఎస్ పీడీ సాజిదాబేగం తెలిపారు. ‘నా అంగన్వాడీ – నా బాధ్యత’ నినాదంతో అక్టోబర్ 8 వరకూ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రీయ పోషణ్ మహోత్సవాలను బుధవారం ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో రాష్ట్రీయ పోషణ్ మహోత్సవాలను నిర్వహించనున్నామన్నారు. పోషకాహారం, ఆరోగ్యం, తల్లులు, చిన్నారుల సంరక్షణతో పాటు బాలల సమగ్ర అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ప్రధానంగా ఆహార వైవిధ్యం – తగినంత ప్రోటీన్, అంగన్వాడీ కేంద్రాల్లో తాజా వేడి వంటకాల పంపిణీ, సమాజ భాగస్వామ్యం – జవాబుదారీతనం, పోషణ– చిన్నారుల ప్రాథమిక అభివృద్ధి, ప్రధానమంత్రి మాతృవందన యోజన అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో తల్లిదండ్రులు, తల్లుల కమిటీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కిశోర బాలికలు, కమ్యూనిటీ వలంటీర్లు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
హనుమ ఆలయాలు కిటకిట
గుంతకల్లు రూరల్:శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారు ఒంటె వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవ మూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ పురవీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహించారు. బొమ్మనహాళ్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నేమకల్లు, మురడి ఆంజనేయస్వాముల బాలాలయాలకు శ్రావణమాసం చివరి నాల్గో మంగళవారం సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌స్వామి, పవన్‌స్వామి ఆధ్వర్యంలో ఆలయాల్లో స్వామివారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహానివేదన, మహామంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తుల కోసం దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ ఎస్ఐలు నబీరసూల్, గురుప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలంకరణలో నేమకల్లు, మురడి ఆంజనేయస్వామి వార్లు నేమకల్లులో దర్శనం కోసం క్యూకట్టిన భక్తులు మురడిలో భక్తుల రద్దీ ఒంటె వాహనంపై విహరిస్తున్న నెట్టికంటుడు -
ప్రొఫెసర్ వైశాలికి విశిష్ట మహిళా ఇంజినీర్ అవార్డు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) ప్రొఫెసర్ డాక్టర్ వైశాలి జి. ఘోర్పడేను విశిష్ట మహిళా ఇంజినీర్ అవార్డు– 2026కు ఎంపిక చేశారు. మంగళవారం 56వ ఇంజినీర్స్ డే అవార్డులను ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా), ఏపీఎస్సీ ప్రకటించాయి. ప్రస్తుతం వైశాలి జి. ఘోర్పడే జేఎన్టీయూలో రీసెర్చ్ – డెవలప్మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, మేధో సంపత్తి హక్కులు, సాంకేతికత ఆధారిత పరిశోధనలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. డాక్టర్ వైశాలి ఎంపికపై వర్సిటీ వీసీ డా.హెచ్ సుదర్శనరావు, రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెలోని విద్యా నైపుణ్యం, పరిశోధన ప్రతిభ, ఇంజినీరింగ్ రంగానికి అందిస్తున్న విశిష్ట సేవలు, పరిపాలన నాయకత్వం, సంస్థాగత అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమంపై నిబద్ధతతకు ఈ గౌరవం ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. ఆమె అకడమిక్ ప్రొఫైల్‌లో 70కి పైగా పరిశోధనా ప్రచురణలు, పుస్తక అధ్యాయాలు, బాహ్య నిధులతో కూడిన పరిశోధనా కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసిన కృషి ఉన్నాయన్నారు. -
దాడి కేసులో ముగ్గురి అరెస్ట్
నార్పల: మామపై దాడికి పాల్పడిన అల్లుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నార్పల ఎస్ఐ జి.సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా తాతిరెడ్డి పల్లికి చెందిన చరణ్‌కు నార్పల గ్రామానికి చెందిన రమాదేవితో 18 నెలల క్రితం వివాహమైంది. ఇటీవల రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన భార్యను చూసేందుకు గత నెల 31న చరణ్ తన తండ్రి శివకుమార్, బంధువు శివకల్యాణ్తో కలిసి నార్పల వచ్చాడు. తన భార్య, పిల్లలను పంపాలని కోరగా, ఇప్పుడు పంపలేమని అత్తామామాలు చెప్పారు. ఆ మాటలకు ఆగ్రహం చెందిన చరణ్ వెంట తెచ్చుకున్న కొడవలితో మామ చిలమకూరి రాజా మెడపై దాడి చేయబోయాడు. గమనించిన రాజా తన చేతిని అడ్డుపెట్టడంతో తీవ్ర గాయమైంది. మిగిలిన ఇద్దరు కూడా రాజాపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చిలమకూరి రాజా కుమార్తె రమాదేవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నాయనపల్లి క్రాస్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దాడికి ఉపయోగించిన కొడవలిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
నీటి కోసం నిరసన
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. గుక్కెడు నీళ్లివ్వండి మహాప్రభో అంటూ పాలకులను వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం గాండ్లపెంట, గుడిబండ, కుందుర్పి మండలాల్లో రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. – గాండ్లపెంట/ గుడిబండ/కుందుర్పి⇒ తాగడానికి బిందెడు మంచినీరు ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకని ప్రశి్నస్తూ అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పిలేపల్లికి చెందిన మహిళలు సోమవారం ఉదయం ఆరు గంటలకే ఖాళీ బిందెలతో కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను సుమారు నాలుగు గంటల పాటు అడ్డుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేదిలేదని స్పష్టం చేశారు. చివరకు పోలీసులు, మండల పరిషత్ అధికారులు వచి్చ.. వారం రోజుల్లోగా కొత్తగా బోరు వేయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.⇒ శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లి గొల్లపల్లిలో రెండు నెలలుగా తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు సోమవారం ఉదయం కటారుపల్లి క్రాస్‌కు చేరుకుని కదిరి–రాయచోటి ప్రధాన రహదారిపై బైఠాయించారు. వాడకానికి సైతం గ్రామంలో నీరు లేకపోవడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయించి తెచ్చుకుంటున్నామని, తాగునీటిని కొనుగోలు చేస్తున్నామని వాపోయారు. ]ఆందోళన విషయం తెలుసుకున్న ఎంపీడీఓ రామక్రిష్ణ, ఎస్ఐ సుమతి అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపీడీఓ ఆదేశించారు. పంచాయతీ బోరులో అదనపు పైపులు అమర్చి సమస్య పరిష్కరిస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.⇒ గుడిబండ మండలం కరికెర గ్రామ మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో నాగేపల్లి –కరికెర రహదారిపై నిరసన తెలిపారు. 20 రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, గుక్కెడు నీరు లేక నీరసించిపోతున్నామని వివరించారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే యంత్రాంగం స్పందించకపోతే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
పింఛన్ దరఖాస్తుదారులకు చుక్కలే!
సాక్షి, అమరావతి: రెండేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఎట్టకేలకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించగా.. తొలిరోజే సర్వర్ మొరాయించడంతో వృద్ధులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లిన దరఖాస్తుదారులు సాంకేతిక సమస్యల కారణంగా గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది. సోమవారం నుంచి ఏడు రోజులు మాత్రమే ఆన్లైన్ ద్వారా పింఛన్ల దరఖాస్తులు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉదయం సచివాలయాలు తెరవకముందే వృద్ధులు, వితంతువులు వాటి ఎదుట బారులుతీరారు. ఉదయం ఆన్లైన్ పోర్టల్ పనిచేయలేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసిన తర్వాత కూడా అనేకచోట్ల పోర్టల్ పనిచేయలేదు. దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవ్వాతాతలు సాయంత్రం వరకు సచివాలయాల వద్ద వేచిచూడగా.. తగిన పత్రాలు తీసుకురాలేదని సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. -
రైతులను ఆదుకోవాలి
● హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలి ● మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్ ● రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతపురం : కరువు కరాళ నృత్యం చేస్తోందని, రైతులను తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఎండిపోయిన వేరుశనగ, కంది మొక్కలను ప్రదర్శిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి రెండు గంటలపాటు మండుటెండలోనే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గంలోని కాలువల దిగువ ఆయకట్టు ప్రాంతాలకు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, సుబ్బరాయ సాగర్‌కు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరారు. కణేకల్లు చెరువు, హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ ఆయకట్టుకు మాత్రమే నీరు అందిస్తామని ఐఏబీ సమావేశంలో నిర్ణయించారన్నారు. మరి హెచ్చెల్సీ దిగువన ఉన్న ఎంపీఆర్ పరిధిలోని శింగనమల, తాడిపత్రి తదితర నియోజకవర్గాల రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సెప్టెంబర్ మొదటి వారం గడిచినా తగిన వర్షాలు కురవలేదన్నారు. బోర్లు ఎండిపోతున్నాయని, మెట్టభూముల్లో పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ట్యాంకరు నీరు రూ.900 వెచ్చించి పంటలకు పెట్టాల్సి వస్తోందన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పశువులకు నీటి సమస్య అధికమైందన్నారు. ఇంతటి దుర్భర పరిస్థితులు కళ్లకు కనిపిస్తున్నా సాగుకు నీరు ఇవ్వలేమని చెప్పడం బాధ్యతారాహిత్యమేనని మండిపడ్డారు. కర్ణాటకలో హెచ్చెల్సీ ఎగువన ఆరుతడి పంటలకు 90 రోజులపాటు నీరందించే అవకాశం ఉన్నప్పుడు.. దిగువ ప్రాంతంలోని జిల్లా రైతులకు నీరు ఎందుకు అందించరని ప్రశ్నించారు. తుంగభద్రలో ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా అదనంగా నీటిని వినియోగించుకునే అవకాశాలు ఉంటే పరిశీలించి, హెచ్చెల్సీ చివరి ఆయకట్టు రైతులకు కూడా న్యాయం చేయాలని కోరారు. పంట వేయలేకపోయినా, వేసిన పంట ఎండిపోయినా అది రైతు తప్పు కాదని.. నీటిని సకాలంలో అందించాల్సిన వ్యవస్థదే వైఫల్యమని అన్నారు. నీటిని విడుదల చేయడం సాధ్యం కాకపోతే, పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకోబోయే ప్రత్యామ్నాయ చర్యలేవో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఆనంద్‌కు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, నాయకులు నార్పల సత్యనారాయణరెడ్డి, బొమ్మన శ్రీరామ్‌రెడ్డి, వంశీ గోకులరెడ్డి, బోగాతి ప్రతాపరెడ్డి, సరిబాల ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు, ఎల్లారెడ్డి, పరంధామరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, అంకె ముసలన్న, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మంజునాథ్, విష్ణు నారాయణ, నాగేశ్వరరావు, పద్మావతి, బోనాల హరికృష్ణ, ఓబిరెడ్డి, కాటమయ్య, శ్రీనివాసులురెడ్డి, ఆంజనేయులు, నాగలింగారెడ్డి, పుల్లారెడ్డి, కొండ్రెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పట్నం ఫణీంద్ర, నాగభూషణ, రామాంజనేయులు, నాగలింగారెడ్డి, పురుషోత్తం, మల్లికార్జున, ముత్యాల శ్రీనివాస్, బయపరెడ్డి, వెంకటరామిరెడ్డి, నారాయణరెడ్డి, శేఖర్, రమణారెడ్డి, భీమేశ్వర్రెడ్డి, బాలరాజు, శివరామిరెడ్డి, ప్రభుదాస్, రాజా, శేషానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
చీనీ తోటలో విధ్వంసం
గుంతకల్లు రూరల్: మండల పరిధిలోని ఓబుళాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మైనాపురం గ్రామంలో రైతు వెంకటేష్‌కు చెందిన తోటలోకి ఆదివారం రాత్రి దుందగులు చొరబడి చీనీ చెట్లను నరికివేశారు. రైతు వెంకటేష్ తన 9.5 ఎకరాల పొలంలో నాలుగు సంవత్సరాల క్రితం చీనీ తోట సాగు చేశాడు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఈ ఏడాది మొదటికోతను తీయాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి జేసీబీతో చొరబడి మొక్కలపై ఇష్టారాజ్యంగా నడిపిస్తూ 200 మొక్కలను నాశనం చేశారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు వెంకటేష్ చీనీ మొక్కలు నేలకు ఒరిగి ఉండటాన్ని గమనించి హతాశుడయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనాపురం గ్రామానికి చెందిన శేఖర్‌కు, తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఈ విషయంలో ఆదివారం అర్ధరాత్రి శేఖర్ తనకు ఫోన్ చేసి దుర్భాషలాడాడని బాధితుడు తెలిపాడు. శేఖర్ తన జేసీబీతో ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించాడు. బైకును ఢీకొన్న టిప్పర్.. వృద్ధురాలి మృతి● మరొకరికి తీవ్రగాయాలు బత్తలపల్లి: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం ధర్మవరం పట్టణం కొత్తపేటకు చెందిన వెంకటరమణ, అతని తల్లి లక్ష్మీనారాయణమ్మ (60) ద్విచక్రవాహనంలో తాడిపత్రికి వెళుతున్నారు. మార్గమధ్యంలో మండల పరిధిలోని పోట్లమర్రి ఆంజనేయస్వామి ఆలయం వద్ద టిప్పర్ వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణమ్మ మృతి చెందగా, వెంకటరమణ చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న బత్తలపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ●బత్తలపల్లి నుంచి ధర్మవరం వైపు వెళ్లే టిప్పర్ల వేగానికి అంతేలేకుండా పోతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇసుక, బంకమట్టి, కంకర లోడుతో వెళ్లే టిప్పర్లకు స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా ఏమాత్రమూ అడ్డూఅదుపు ఉండదన్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మొదటి రోజే ఏడి‘పింఛన్’
ఆత్మకూరు: కొత్త పింఛన్ల కోసం సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి పలువురు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల వద్ద వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. ఇంటింటి సర్వేలో భాగంగా ఆత్మకూరు మండల వ్యాప్తంగా 2 వేల మంది వరకు కొత్త పింఛన్లకు అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. కేవలం ఆత్మకూరులోనే 500 మందికి పైగా ఉన్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేయడంతో సచివాలయాల వద్ద సోమవారం వారంతా బారులు తీరారు. అయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ పని చేయకపోవడంతో వద్ద నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 16 వరకే దరఖాస్తుకు అవకాశం ఉండటంతో అర్హులు ఆందోళనకు గురవుతున్నారు. కుష్టును నిర్మూలించాలి అనంతపురం అర్బన్: కుష్టువ్యాధిని నిర్మూలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కుష్టు నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. అనుమానిత కేసులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారింపజేసుకోవాలన్నారు. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ఎండీటీ మందులను అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఓ నాగరాజు నాయుడు, కుష్టు నివారణ అధికారి జయలక్ష్మి, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ గంగాధర్‌రెడ్డి, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, పారామెడికల్ అధికారి నాగన్న, ఆరోగ్య విద్య అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అయినవారు ఉన్నా అనాథలా మృతి! పామిడి: అయినవారు పట్టించుకోకపోవడంతో మనసు చంపుకొని ఇల్లు వదిలివచ్చిన ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పామిడి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం ఈరన్నపల్లికి చెందిన అశోక్ (65) 25 ఏళ్ల క్రితం వ్యాపార రీత్యా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇటీవల అశోక్ అనారోగ్యం బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై 6 నెలల క్రితం ఇల్లు వదిలి వచ్చాడు. రెండు రోజులుగా పామిడి కమ్యూనిటీ ఆసుపత్రిలో తిరుగుతూ ఆసుపత్రి ప్రాంగణంలో నిద్రించేవాడు. ఆదివారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచాడు. పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుమారుడు, ప్రొద్దుటూరుకు చెందిన హరికృష్ణకు సమాచారం చేరవేశారు. ఆటో బోల్తా.. వృద్ధుడి మృతి ఉరవకొండ: ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన ఉరవకొండ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి గ్రామం నుంచి సోమవారం ఆటో ప్రయాణికులతో బయలుదేరింది. ఉరవకొండ సమీపంలో గొర్రెల మంద అడ్డురావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన అంజయ్య (70) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ బాషాతో పాటు మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజయ్యకు భార్య తిప్పమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడా పోటీల్లో జిల్లాకు 36 పతకాలుఅనంతపురం సెంట్రల్: రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 4 స్వర్ణ, 22 రజత, 10 కాంస్య పతకాలు సాధించారు. సోమవారం ఎస్పీ జగదీష్ తన చాంబర్లో క్రీడాకారులను అభినందించారు. క్రీడల్లో రాణించడం ద్వారా పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని తెలిపారు. జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
కలశం చిచ్చు.. ఇరువర్గాల ఘర్షణ
డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): ఆలయంపై కలశం ఏర్పాటు చిచ్చు రేపింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో నలుగురికి గాయాలయ్యాయి.. డి.హీరేహాళ్ మండలం పులకర్తిలో జంబన్న తాత గుడి వెనుక ఉన్న మడివాల మాచిదేవ ఆలయ విషయంలో రజకులు, కురుబల మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆలయ హక్కులు, నిర్వహణ తదితర అంశాలపై ఇరువర్గాలు రాయదుర్గం కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉంది. ఈ క్రమంలో సోమవారం రజక వర్గానికి చెందిన వారు ఆలయంపై కలశం ఏర్పాటు చేశారు. కోర్టులో వివాదం నడుస్తున్న సమయంలో కలశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ కురుబ వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలశాన్ని తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని చివరకు పరస్పరం దాడులకు దారితీసింది. సమాచారం అందుకున్న రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి సిబ్బందితో వెంటనే గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘర్షణలో గాయపడిన రజకవర్గానికి చెందిన ఎర్రిస్వామి, హేమంతరాజు, కురుబ వర్గానికి చెందిన లోకేష్, మంజునాథ్‌ను రాయదుర్గం, బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి
● వేధిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయండి ● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశంఅనంతపురం న్యూ టౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టు కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి.. నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెలోకి వెళతామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎర్రిస్వామి, వన్నూరుస్వామి సోమవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి నోటీసు అందజేశారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ట్రంక్‌లైన్ ఫేజ్–1 కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, 2025 సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్కరికి రూ. 22 వేలు బకాయిలు పెట్టారని, 40 నెలల పీఎఫ్ సొమ్ము జమ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. ట్రంక్‌లైన్ ఫేజ్–4లో పనిచేసే కార్మిక కార్మికులకు 11 నెలల జీతంతో పాటు 11 నెలల పీఎఫ్ నిధులను జమ చేయకుండా కాంట్రాక్టర్ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. సమ్మె నోటీసుపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, కార్మిక శాఖ ఉప కమిషనర్ లక్ష్మీనారాయణలను పిలిపించుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనల మేరకు పనిచేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. వేధింపులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఒకవేళ అలా చేయకుండా కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క కార్మికుల కడుపు కొట్టే చర్యలకు పాల్పడితే మీపై చర్యలు తీసుకుంటానంటూ అధికారులను హెచ్చరించారు. -
పంటలు ఎండుతున్నాయ్
● కలెక్టర్‌కు సమస్య విన్నవించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రాప్తాడు రూరల్: అనధికారిక కోతలతో వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా అందడం లేదని, బోర్లు పనిచేయక పంటలు నిలువునా ఎండిపోతున్నాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వాపోయారు. సోమవారం అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాలకు చెందిన పలువురు రైతులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కరెంటు సమస్యలపై రైతులు సబ్స్టేషన్లకు వెళ్లి ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయానికి నిర్దేశించిన సమయంలో విద్యుత్ సరఫరా చేయకుండా కోతలు విధిస్తున్నారన్నారు. ఇప్పటికే ఎల్–నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉన్న భూగర్భ జలాలతో పంటలను కాపాడుకుందామంటే కరెంటు కోతలు వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 2–3 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని, 300 ఓల్టేజీ ఉండాల్సిన చోట 150–200 మాత్రమే ఉంటోందని తెలిపారు. ఎల్–నినో ప్రభావం ఉంటుందని ముందే పేరూరు డ్యాంకు నీళ్లు నింపాలని కోరినా ఎమ్మెల్యే పరిటాల సునీత, అధికారులు పట్టించుకోలేదన్నారు. హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేయొద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. గతేడాది 7 నెలల పాటు హంద్రీ–నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు 5.5 టీఎంసీల నీరు ఇస్తే.. కేవలం 2.5 టీఎంసీలు మాత్రమే చెరువులకు చేరాయని, మిగిలిన 3 టీఎంసీలు లాసెస్ అయ్యాయని తెలిపారు. ఆ నీటిని ఇక్కడికి ఇస్తే పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న చెరువులన్నీ నిండేవన్నారు. ఇప్పటికై నా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తాగు–సాగునీరు, విద్యుత్ సమస్యలపై దీర్ఘకాళిక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ను కోరారు. -
ఏడీసీసీబీకి టోకరా
● నకిలీ బంగారంతో రూ.కోట్ల రుణాలు? చిలమత్తూరు: అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఏడీసీసీ)కే టోకరా వేశారు. ఆ బ్యాంకు హిందూపురం శాఖలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఏకంగా రూ.8 కోట్ల దాకా రుణాలు పొందినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. బ్యాంకు అధికారుల ప్రమేయంతోనే ఈ స్కాం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల తనిఖీల్లో ఈ ఘరానా మోసం బయట పడ్డట్టుగా తెలుస్తోంది. పదుల సంఖ్యలో గోల్డ్‌లోన్ ఖాతాలను తెరిచి నకిలీ బంగారంతో సుమారు రూ.8 కోట్ల వరకూ రుణాలు పొందారనే చర్చ సాగుతోంది. ఆ బ్యాంకులో అంతపెద్ద మొత్తంలో రుణాల మంజూరుకు అనుమతి లేదని అధికార వర్గాలు చెబుతుండగా, ఇంత పెద్ద స్కాం ఎలా జరిగిందనే దానిపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలు చేసే సమయంలో బంగారం నాణ్యతలో తేడాలొచ్చినట్టుగా సమాచారం. అధికారులకు అనుమానం వచ్చి గోల్డ్ లోన్ కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని తనిఖీ చేయగా... ‘నకిలీ’ గుట్టు రట్టయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులు రహస్యంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకు ఉన్నతాధికారులు మాత్రం ఈ గోల్డ్ స్కాం అంశాన్ని ధ్రువీకరించడం లేదు. త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు అనంతపురం న్యూటౌన్: త్వరలో గడువు ముగియనున్న మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ (నం.515) జారీ చేశారు. మండల ప్రజా పరిషత్‌ల ఐదేళ్ల పదవీ కాలం ఈ నెల 23తోనూ, జిల్లా పరిషత్‌ల గడువు ఈ నెల 24తోనూ ముగియనుందని, త్వరలోనే మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలకు ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను మండల ప్రాదేశిక నియోజక వర్గాల వారీగా ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్ ఫొటో ఓటర్ల జాబితాలను జెడ్పీటీసీల వారీగా సీఈఓలు తయారు చేస్తారు. ప్రజల పరిశీలన నిమిత్తం ఈ నెల 11న ఎంపీపీ, జెడ్పీ కార్యాలయాల్లో ప్రచురించాలి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించి, ఎస్ఈసీ ఆదేశాలను అమలుచేయాలని ఆ నోటిఫికేషన్లో స్పష్టంచేశారు. విద్యార్థులకు బాలల బీమా అమలు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలల బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. బాలల బీమా కింద ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25వేల ఆర్థికసాయం అందజేస్తారు. ప్రమాదంలో తీవ్ర వైకల్యానికి గురైన విద్యార్థులకు రూ.10 వేలు చెల్లిస్తారు. ప్రతి విద్యార్థి నుంచి ప్రీమియం కింద రూ.5 చొప్పున ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వసూలు చేసి సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి అందజేయాలని సూచించారు. పాఠశాలల వారీగా విద్యార్థుల జాబితాతో పాటు అసలు రశీదును అక్టోబర్ 31లోగా సమగ్ర శిక్ష అనంతపురం కార్యాలయంలో అందజేయాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకూడదు అనంతపురం అర్బన్: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఎల్–నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. నీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలు, సంక్షేమ వసతి గృహాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉన్నట్లు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాబ్‌కార్డులున్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని ఆదేశించారు. ఈ–పంట నమోదు వందశాతం జరగాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ సాలురెడ్డి, ఉద్యానశాఖ ఏడీ ఉమాదేవి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ శైలజ తదితరులు పాల్గొన్నారు. -
చీనీ రైతు ఉక్కిరిబిక్కిరి
వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడం, చీనీ తోటలు వాడుముఖం పట్టడం, తెగుళ్లతో కాయలు దెబ్బతినడం వెరసి చీనీ రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మార్కెట్లో చీనీ ధరలు భారీగా పడిపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. చీనీ తోటలో తెగుళ్ల నివారణకు పురుగుల మందులు పిచికారీ చేయాలంటే ధరలు పెరిగిపోయాయి. మార్కెట్లో చీనీ ధరలు కూడా తగ్గిపోయాయి. ధరలు ఉంటే అప్పు చేసి తెచ్చయినా మందులు పిచికారీ చేసేవాడిని. దిగుబడి వచ్చిన తరువాత చెల్లించేవాడిని. అయితే, కాయలు కొనుగోలు చేయడానికి వ్యాపారులు తోటల వద్దకు రాకపోవడంతో దిక్కుతోచడం లేదు. – థామస్‌రెడ్డి, రైతు, తాడిపత్రి తాడిపత్రి రూరల్: జిల్లాలో 1.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో చీనీ తోటలు విస్తరించాయి. యల్లనూరు, పుట్లూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, గార్లదిన్నె, నార్పల, కళ్యాణదర్గం తదితర మండలాల్లో భారీగా చీనీ పంట సాగవుతోంది. తెగుళ్లు, పెరిగిన పెట్టుబడులు, ధరల హెచ్చుతగ్గులు, మారిన వ్యవసాయ పరిస్థితులు, అడుగంటుతున్న భూగర్భజలాలు తదితర కారణాలతో ఇటీవల కొంతమంది రైతులు తోటల్లోని చీనీ చెట్లను కొట్టివేస్తున్నారు. వాటి స్థానంలో అరటి, దానిమ్మ, బొప్పాయి, మొక్కజొన్న తదితర పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితం ఏదీ..? చీనీ తోటలకు ఇటీవల బోరాన్, ఎండుతెగులు, తెల్లదోమ ఆశించడంతో పంట దిగుబడి తగ్గుతోంది. బోరాన్ లోపం వల్ల కాయలు పగులుతున్నాయి. గట్టిగా మారి రసం తగ్గిపోతోంది. ఎండు తెగులు కారణంగా చెట్లు ఎండిపోతున్నాయి. తోటలకు తెల్లదోమ పోటు ఎక్కువగా ఉంది. కాయలు, ఆకులపై తెల్లగా పిండి చల్లినట్టుగా కనిపిస్తోంది. దీన్ని రైతులు పిండినల్లిగా కూడా పిలుస్తారు. కాయలు మచ్చలుగా ఏర్పడి రంగు మారుతుండడంతో డిమాండ్ ఉండదు. తెగుళ్ల నివారణకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పడిపోయిన ధర అరకొర దిగుబడి వచ్చినా ఎలాగోలా అప్పులు తీర్చుకుందామని ఆశించిన రైతులను తగ్గిన చీనీ ధరలు మరింత ఆవేదనలోకి నెడుతున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం చీనీ టన్ను రూ.14 వేలు పలుకుతోంది. ధర తగ్గినా విక్రయించేందుకు రైతులు ముందుకొచ్చారు. అయితే, వ్యాపారులు చీనీ పంటను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడం లేదు. గతంలో తోటల వద్దకే వచ్చి కాయలను కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. మరిన్ని రోజులు చెట్లపైనే కాయలు ఉంచితే పాడవుతాయన్న భయాందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. మార్కెట్‌కు తీసుకెళ్లడానికి కూలి, వాహన ఖర్చులకు సరిపోతుందన్న భయంతో చెట్లపైనే కాయలు ఉంచి మంచి ధర కోసం ఎదురుచూస్తున్నారు. పంటకు తెగుళ్లతో సతమతం ఎన్ని మందులు కొట్టినా అదుపులోకి రాని వైనం మార్కెట్లో ధరలు పడిపోవడంతో మరింత ఆవేదన -
నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటినా పట్టదా?
ఉరవకొండ: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలైతో పోలిస్తే ఆగస్టు చివరి నాటికి అనేక రకాల సరుకుల ధరలు 40 నుంచి 75 శాతం వరకూ పెరిగాయన్నారు. బియ్యం, పప్పులు, పంచదార, నూనె, కూరగాయలు, వంటగ్యాస్ ఇలా అన్ని ధరలు ఆకాశాన్నంటాయన్నారు. గ్రామాల్లో కూలి పనులు తగ్గడంతో పాటు పట్టణాల్లో ఉపాధి దొరక్కపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. వైద్యం, ఇతర ఖర్చులు పెరగడంతో పేద, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. ప్రతి కుటుంబంపై సగటున రూ. 4 వేల నుంచి రూ.7 వేల అదనపు భారం పడిందన్నారు. జీఎస్టీ 2.0తో నిత్యావసరాల ధరలు తగ్గి ఊరట లభిస్తుందని చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు గొప్పలు చెప్పారని, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని పేదలకు రేషన్ షాపుల ద్వారా పంచదార, పప్పు, వంటనూనె, ఉల్లిపాయలు వంటివి అందించి ఆదుకోవాలని కోరారు. చంద్రబాబు సర్కారుపై ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఆగ్రహం -
ఎన్ఆర్ఎల్ఎం నిధులు సద్వినియోగం చేసుకోవాలి
పామిడి: పట్టణ ఐకేపీ భవనాన్ని ఎన్ఆర్ఎల్ఎం (నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్) ఢిల్లీ బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా మండల సమాఖ్య నిర్వహణ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పోగ్రామ్ మేనేజర్ పంకజ్ సుయల్ మండల సమాఖ్య ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఎల్ఎం నిధుల సద్వినియోగంపై సమీక్షించారు. భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. కార్యక్రమంలో ఎస్ఈఆర్పీ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్‌రెడ్డి, ఆ సంస్థ పీఈ శోభ, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు రాధారాణి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్ ‘కళ్యాణదుర్గం’ ● ముగిసిన స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు అనంతపురం: రెండు రోజులుగా అనంత క్రీడాగ్రామంలో జరుగుతున్న స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ 2026 పోటీలు సోమవారం ముగిశాయి. ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు. సోమవారం నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఎర్రగుంట జెడ్పీహెచ్ఎస్, రన్నర్స్‌గా నెలగొండ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు నిలిచారు. హాకీ విన్నర్స్‌గా దురదకుంట జెడ్పీహెచ్ఎస్,రన్నర్స్‌గా పాల్తూరు జెడ్పీహెచ్ఎస్, ఫుట్‌బాల్ విన్నర్స్‌గా రాయదుర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రన్నర్స్‌గా ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ నిలిచాయి. అథ్లెటిక్స్ విభాగంలో 600 మీటర్ల పరుగులో ప్రభంజన్ (ఉరవకొండ) బంగారు పతకం, అభిలాష్ (బీకేఎస్) సిల్వర్, రాజదీప్ నాయక్ (కళ్యాణదుర్గం) బ్రాంజ్ పతకాన్ని దక్కించుకున్నారు. వంద మీటర్ల పరుగులో కళ్యాణదుర్గం అభిరామ్‌కు బంగారు పతకం, రాయదుర్గం భానుతేజాకు వెండి పతకం, కార్తీక్ నాయక్ (అనంతపురం)కు కాంస్య పతకం దక్కాయి. లాంగ్‌జంప్‌లో శ్రీనాథ్ (కళ్యాణదుర్గం), టి.కార్తీక్ నాయక్ (అనంతపురం), భానుతేజ (రాయదుర్గం) వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. 400 మీటర్ల పరుగులో సందీప్ (శింగనమల), కార్తీక్ (గుంతకల్లు), చందు (రాయదుర్గం) వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలను దక్కించు కున్నారు. షాట్‌పుట్‌లో రంజిత్ (శింగనమల)కు బంగారు, హిమేష్ (ఉరవకొండ)కు వెండి, యశ్వంత్ (అనంతపురం)కు కాంస్య పతకం దక్కాయి. డిస్క్ త్రోలో ఉరవకొండ హిమేష్, గుంతకలుల తిరుదీప్, శింగనమల సందీప్ వరుసగా మూడు స్థానాల్లో నిలిచి పతకాలను కై వసం చేసుకున్నారు. 200 మీటర్ల పరుగులో రాయదుర్గం భానుతేజ (బంగారు), అనంతపురం కార్తీక్ నాయక్ (వెండి), కళ్యాణదుర్గం మంజునాథ్ (కాంస్య) పతకాలను దక్కించుకున్నారు. వంద మీటర్ల (4) రిలే పరుగులో శింగనమల, రాయదుర్గం, కళ్యాణదుర్గం క్రీడాకారులు వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. ముఖ్య అతిథులుగా కేజీఎఫ్ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ,డీఈఓ అయూబ్ హుస్సేన్,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్.ఎం మంజుల, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల పాల్గొని పతకాలు అందజేశారు. -
గాండ్లపాడు ఘటనలో నిందితుడిని శిక్షించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలలోకి చొరబడి ఉపాధ్యాయుడిపై దాడి చేయడంతో పాటు విద్యా పరికరాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్ఆర్టీఏ) డిమాండ్ చేసింది. పుట్లూరు మండలం గాండ్లపాడు ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఘటనను సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం డీఈఓ అయ్యూబ్హుస్సేన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి మద్యం తాగేందుకు డబ్బు కావాలంటూ ఉపాధ్యాయుడిని వేధించాడని, డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో దాడి చేసి తలపై గాయపరిచాడని తెలిపారు. అంతటితో ఆగకుండా పాఠశాలలోని ఐఎఫ్బీ ప్యానల్ బోర్డు, బెంచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఉపాధ్యాయులు విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారని తెలిపారు. పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఘటనను తీవ్రంగా పరిగణించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలలో ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని కోరారు. అశోక్‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి వైఎస్ఆర్టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని నాయకులు డీఈఓను కోరారు. టెట్‌కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చే సమయంలో డీఎస్సీపై ఫిర్యాదు చేశారనే కారణంతో సంబంధం లేని అంశాన్ని ముడిపెట్టి సస్పెండ్ చేయడం విచారకరమన్నారు. నిరాధార ఆరోపణలతో విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. డీఈఓను కలిసిన వారిలో వైఎస్ఆర్టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్‌రెడ్డి, రాధాకృష్ణాడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు విశ్వనాథరెడ్డి, కృష్ణానాయక్, రామకృష్ణ ఉన్నారు. డీఈఓకు వైఎస్సార్‌టీఏ వినతి -
ఉల్లికల్లులో ఆగని ఇసుక తరలింపు
శింగనమల: ఉల్లికల్లు పెన్నానది నుంచి ఇసుక అక్రమ తరలింపు నిరాటంకంగా సాగుతోంది. పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు దాడులు చేసినా రాజకీయ నాయకుల అండదండలతో వెనక్కు తగ్గడం లేదు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అక్రమార్జనే ధ్యేయంగా ఇసుక రవాణా చేస్తున్నారు. పెన్నానదిలో జేసీబీ పెట్టి ట్రాక్టర్లతో ఒక చోటకు డంప్ చేసుకుని, అక్కడి నుంచి రాత్రిపూట టిప్పర్లతో తరలిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో దాదాపు రూ.3 కోట్లు విలువ చేసే ఇసుకను అమ్ముకున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. సీజ్ చేసిన ఇసుకనూ వదల్లేదు ఉల్లికల్లు పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా గత నెల 18న దాడులు చేసి, ఇసుక డంప్‌లను గుర్తించారు. దాదాపు 300 టన్నుల ఇసుక ఉందని లెక్క కట్టారు. కొద్దిరోజుల విరామం అనంతరం అక్రమార్కులు మళ్లీ ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఈసారి ఇసుక తవ్వకంతో పాటు సీజ్ చేసిన ఇసుకనూ రాత్రికి రాత్రే తరలించారు. సీజ్ చేసిన ఇసుక ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తే భూగర్భజలాలు తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
వైభవంగా దొణగంగమ్మ జాతర
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని టీ.వీరాపురం గ్రామ సమీపంలో వెలసిన దొణ గంగమ్మ జాతర సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. జాతరకు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో కొలువుదీర్చి పురవీధులలో మేళతాళాల నడుమ ఊరేగింపుగా దొణవద్దకు చేర్చారు. తిరిగి సాయంత్రం రథాన్ని ఆలయం వద్దకు లాగారు. అంతకుమునుపు మహిళలు భక్తిశ్రద్ధలతో దొణవద్దకు చేరుకుని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కాంట్రాక్టర్ నేత్రపల్లి ఆర్టీ లక్ష్మీకాంతారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జున, మాజీ సర్పంచ్ ఓబుళమ్మ, మాజీ ఎంపీటీసీ రాజమ్మ, మెట్టు ధనుంజయరెడ్డి, గొల్ల రామాంజినేయులు, తిమ్మారెడ్డి, అనుమేష్, రామన్నయాదవ్ లక్ష్మీరెడ్డి, చిత్రయ్య, మహేష్, అశోక్, ప్రకాష్, దుబాయ్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని లారీ దగ్ధం
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో సోమవారం వేకువజామున ఓ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నుంచి బెంగళూరులోని మాలూరుకు ఆలు గడ్డల లోడుతో లారీ బయలుదేరింది. కొత్తపేట గ్రామ శివారులోకి రాగానే సర్వీస్ రోడ్డులో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో విద్యుత్ తీగలు తెగి లారీపై పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై అనుమానాలు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు లారీ హైవే మీదుగా వెళ్లాలి. అయితే సర్వీస్ రోడ్డులోకి రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి డ్రైవర్, క్లీనర్లు అదృశ్యమయ్యారు. పొరపాటుగా లేదా నిద్రమత్తులో లారీని సర్వీస్ రోడ్డులోకి తిప్పి ఉంటే ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్, క్లీనర్ అక్కడే ఉండేవారు. దీనిపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేలుడు పదార్థాలు తీసుకెళ్తూ మంటలు రావడంతో డ్రైవర్ లారీని కావాలనే సర్వీస్ రోడ్డులోకి తీసుకెళ్లి పల్టీ కొట్టించాడా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
●పచ్చని చెట్ల నరికివేత
ఉరవకొండ: అధికారం ఉంది కదా అని ఏకంగా తన కాంప్లెక్స్ కనిపించకుండా చెట్లు అడ్డువస్తున్నాయని 30 నుంచి 40 చెట్లను ఓ టీడీపీ సీనియర్ నేత నరికించేశాడు. వివరాలు.. స్థానిక శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం వద్ద ప్రధాన రోడ్డు డివైడర్ మధ్యలో పంచాయతీ అధికారులు గుంతకల్లు రోడ్డు నుంచి అనంతపురం బైపాస్ వరకూ మొక్కలు నాటారు. అవి ప్రస్తుతం పెద్ద చెట్లుగా మారాయి. అయితే చెట్టు పెరగడంతో తన కాంప్లెక్స్‌కు అడ్డంగా మారాయని గుర్తించి అటవీశాఖ అధికారులు, మేజర్ పంచాయతీ అధికారుల అనుమతులు తీసుకోకుండా దాదాపు 20 నుండి 30 చెట్లు నరికించాడు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు.


