రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థి
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్, సీఎస్‌ఈ ద్వితీయ సంవత్సర విద్యార్థిని హర్షిత్ హోదయ రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికై ంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. ఎంపికై న హర్షిత్ హోదయ న్యూఢిల్లీలో ఈ నెల 30 నుంచి జరిగే శిక్షణా కార్యక్రమంలో పాల్గొననుంది. ఎంపికై న విద్యార్థిని ప్రిన్సిపాల్, వైస్ ప్రెసిడెంట్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, సీఎస్‌ఈ హెచ్‌ఓడీ డాక్టర్ వీరప్రకాష్, ఎన్‌ఎస్‌ఎస్ పోగ్రాం ఆఫీసర్ చిన్న పుల్లయ్య, అధ్యాపకులు అభినందించారు.


