ఐఈఎస్‌కు ఎంపికై న పెద్దొడ్డి యువకుడు
గుత్తి రూరల్: పెద్దొడ్డి గ్రామానికి చెందిన వంశీధర్‌రెడ్డి అనే యువకుడు ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికయ్యాడు. భాస్కర్‌రెడ్డి, వరలక్ష్మి దంపతుల కుమారుడు వంశీధర్‌రెడ్డి తిరుపతి ఎస్వీ కళాశాలలో బీటెక్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ పూర్తి చేశాడు. సివిల్ సర్వీసెస్ సాధించడమే ధ్యేయంగా ఢిల్లీలో కోచింగ్ తీసుకుని పరీక్ష రాశాడు. అయితే ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో వంశీధర్‌రెడ్డి ఆల్ ఇండియా 102వ ర్యాంకు సాధించి ఐఈఎస్‌కు ఎంపికయ్యాడు. వంశీధర్‌రెడ్డికి ఐఏఎస్ సాధించడమే ధ్యేయమని తల్లి వరలక్ష్మి సోమవారం తెలిపారు. వంశీధర్‌రెడ్డిని గ్రామస్తులు, స్నేహితులు బంధువులు అభినందించారు.


