హోరాహోరీగా టీచర్ల క్రికెట్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా టీచర్ల క్రికెట్‌ టోర్నీ

Dec 23 2025 7:24 AM | Updated on Dec 23 2025 7:24 AM

హోరాహ

హోరాహోరీగా టీచర్ల క్రికెట్‌ టోర్నీ

అనంతపురం కార్పొరేషన్‌: ఆర్డీటీ క్రికెట్‌ మైదానం వేదికగా సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్‌ టోర్నీ హోరాహోరీగా సాగింది. కళ్యాణదుర్గం, గుంతకల్లు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుంతకల్లు జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 93 పరుగులు చేసింది. అనంతరం కళ్యాణదుర్గం జట్టు 9 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. జట్టులో 39 పరుగులుచేసిన హుస్సేన్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపిక చేశారు. అంతకుముందు పోటీలను డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాప్తాడు ఎంఈఓ మల్లికార్జున, బ్రహ్మసముద్రం ఎంఈఓ ఓబులపతి, క్రికెట్‌ సంఘం జిల్లా కార్యదర్శి యుగంధర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి శ్రీనివాసులు, గోపాలరెడ్డి, మంజుల, గౌసియా తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశాలతో సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 14 అంగన్‌వాడీ వర్కర్లు, 78 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. మంగళవారం నుంచి జిల్లా కార్యాలయం సహా ఆయా ప్రాంత ప్రాజెక్టు కార్యాలయాల్లో ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు http://ananthapuramu.ap.gov.in వెబ్‌సైట్‌ పరిశీలించవచ్చు.

క్రమశిక్షణే కీలకం

కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమంలో డీఐజీ డాక్టర్‌ షిమోషి

అనంతపురం సిటీ: పోలీస్‌ శాఖ అంటే క్రమశిక్షణకు మారుపేరని, పోలీస్‌ కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ డా.షిమోషి ఆకాంక్షించారు. విశాఖపట్నం, ప్రకాశం, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయవాడ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన 692 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికై న అభ్యర్థులకు అనంతపురంలోని పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలో సోమవారం నుంచి శిక్షణ తరగతులను డీఐజీ షిమోషి లాంఛనంగా ప్రారంభించారు. కోర్సు డైరెక్టర్‌ జె.మల్లికార్జున వర్మ, అనంతపురం పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆర్‌.వాసుదేవన్‌, పీటీసీ ఇండోర్‌ విభాగం డీఎస్పీలు హరినాథరెడ్డి, అల్లాబకాష్‌, ఎం.సూర్యనారాయణరెడ్డి, ఫీల్డ్‌ ట్రైనింగ్‌ డీఎస్పీ వై.రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇళ్ల మధ్యన గంజాయి సాగు

ఆత్మకూరు: మండల కేంద్రంలో ఇళ్ల మధ్యన గంజాయి మొక్కలు పెంచుతున్న 69 ఏళ్ల వ్యక్తిని సోమవారం ఎకై ్సజ్‌ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సయ్యద్‌ జాకీర్‌, సిబ్బంది అరెస్ట్‌ చేసి, సుమారు ఐదు అడుగుల ఎత్తున పెరిగిన 20 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెద్దన్నను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.

జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

యాడికి: ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు యాడికి జెడ్పీహెచ్‌ఎస్‌లోని 8వ తరగతి విద్యార్థి ఎస్‌.మణికంఠ ఎంపికయ్యాడు. జనవరి 4న ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌ వేదికగా జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రతిభ చాటిన మణికంఠను ఆ పాఠశాల హెచ్‌ఎం సీతారామాంజనేయులు, పీడీలు చంద్రకళ, శివశంకర్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

పలువురు పోలీసు అధికారులకు డిస్క్‌ అవార్డులు

అనంతపురం: డీజీపీ కమండెషన్‌ డిస్క్‌ అవార్డులు సోమవారం ప్రకటించారు. ఇందులో జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులకు సిల్వర్‌ (వెండి) డిస్క్‌ అవార్డు దక్కింది. వీరిలో అనంతపురం ఎస్‌ఐ షేక్‌ సైఫుల్లా, డీసీఆర్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌ బి. నాగరాజు, ఎస్బీ సీఐ బి.క్రాంతి కుమార్‌ ఉన్నారు. అలాగే కళ్యాణదుర్గం రూరల్‌ సీఐ సి.నీలకంఠేశ్వర, పెద్దపప్పూరు ఎస్‌ఐ వి.అమానుల్లా, అనంతపురం హెడ్‌కానిస్టేబుల్‌ డి. భాస్కర్‌బాబు, జె.జగదీష్‌బాబు, డీఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌ పి.తిప్పేస్వామి, కూడేరు కానిస్టేబుల్‌ వి.వీర నరసింహరాజు, ఏపీఆర్‌సీ–83 డీఏఆర్‌ షేక్‌ మహమ్మద్‌ రఫీ, అనంతపురం త్రీ టౌన్‌ పీఎస్‌ డబ్ల్యూపీసీ సీహెచ్‌ ప్రభావతి, శెట్టూరు కానిస్టేబుల్‌ జి.నాగార్జున, అనంతపురం కానిస్టేబుల్‌ కె.రాజశేఖర్‌కు అవార్డులు దక్కాయి.

హోరాహోరీగా  టీచర్ల క్రికెట్‌ టోర్నీ 1
1/1

హోరాహోరీగా టీచర్ల క్రికెట్‌ టోర్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement