●మత్తులో సొమ్మ సిల్లి..
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం ఉదయం ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి సొమ్మసిల్లి పోయాడు. స్థానికులు లేపడానికి ప్రయత్నించినా చలనం లేకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ముఖంపై నీళ్లు కొట్టి లేవడానికి శత విధాల ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికుల సాయంతో అతి కష్టంపై ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెల్లవారుజామునే విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతోందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. గత వారంలో ఇలాంటి ఘటనలు ఆరేడు జరిగాయి.


