నాడు లాభాలు.. నేడు కన్నీరు
తాడిపత్రిటౌన్: నేను పదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. 2022 సంవత్సరం కరోనా సమయంలో పంటను అమ్ముకోలేని పరిస్థితి. అలాంటి సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ కిసాన్ రైలు ఏర్పాటు చేయించారు. మా ప్రాంతం నుంచి వేలాది టన్నుల అరటి దిగుబడులను ఢిల్లీ, ముంబాయి వంటి నగరాలకు చేర్చి రైతులు నష్టపోకుండా చూశారు. నేను అప్పట్లో ఎనిమిది ఎకరాల్లో అరటి పంట వేశా. రూ.7 లక్షల వరకు పెట్టుబడులు పెట్టా. కరోనా పరిస్థితుల్లోనూ టన్ను రూ.22 వేలతో అమ్మాను. సంవత్సరం పంట మీద దాదాపు రూ.20 లక్షలు ఆదాయం తీసుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో అన్న కొడుకు వివాహం ఘనంగా చేశాం. నేడు అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఏడు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నా. నెలన్నర క్రితం పంట చేతికి వచ్చింది. టన్ను కేవలం రూ.2 వేలతో అమ్ముకోవాల్సి వచ్చింది. రూ.4 లక్షల దాకా నష్టపోయా. జగనన్న హయాం అరటి రైతులకు స్వర్ణయుగం లాంటిది. ఆనాటి ధర మళ్లీ ఏనాడూ చూడలేదు.
– నాగమునిరెడ్డి,
కేశవరాయునిపేట, యాడికి మండలం


