సర్కారు బడి రూపురేఖలు మార్చారు
అనంతపురం సిటీ : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే పాడుబడిన భవనాలు.. కూలేందుకు సిద్ధంగా ఉన్న పైకప్పులు.. గాలీ వెలుతురు లేని గదులు.. కనీసం సున్నానికి కూడా నోచుకోని గోడలు.. ఒక్కమాటలో చెప్పాలంటే భూత్ బంగ్లాలను తలపించేవి. ఇదంతా గతం. జగనన్న రాకతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. ‘నాడు–నేడు’ అమలుతో రూ.కోట్ల ఖర్చుతో ప్రభుత్వ బడుల రాత మార్చారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా డిజిటల్ బోధన– ఇంగ్లిష్ మీడియం బోధనతో సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దారు. ఊరూరా.. ప్రతి పాఠశాల అమ్మ ఒడిని తలపించేలా ప్రభుత్వ బడిని అన్ని హంగులతో పునర్నిర్మించారు. నాటి పాలన ఓ స్వర్ణయుగమని ఊరూరా కట్టిన బడులే సాక్ష్యంగా నిలిచాయి. జిల్లాలో నాడు–నేడు ఫేజ్–1 కింద రూ.213,73 కోట్లు, ఫేజ్–2 కింద రూ.365.50 కోట్లతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు.


