అనంతపురం
●సుపరిపాలనకు ఆద్యుడు వైఎస్ జగన్
●నేడు వాడవాడలా జన్మదిన వేడుకలు
I
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అనంతపురం : పాలకుడంటే ప్రజల కష్టనష్టాల్లో తోడుగా ఉండాలి. ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ధైర్యమివ్వాలి. వారి ప్రగతికి బాటలు వేయాలి. కుల, మత, రాజకీయాలకు అతీతంగా మేలు చేయాలి. తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ అండగా నిలిచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి. అలాంటి పారదర్శకత, దార్శనికత కల్గిన అతికొద్దిమంది నాయకుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకరు. ఆయన సీఎంగా అధికారం చేపట్టిన మొదటిసారే సంక్షేమ విప్లవాన్ని సృష్టించారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. ‘పాలకుడంటే ఇలా ఉండాలి’ అంటూ నిర్వచనంగా నిలిచారు. అధికారం కోల్పోయినా..ప్రతిపక్ష నేతగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ప్రతి సమస్యపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నేడు జనహృదయ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు. జిల్లావ్యాప్తంగా వాడవాడలా బర్త్‌డే వేడుకలు నిర్వహించడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు సిద్ధమయ్యారు.
అనంతపురం


